ఆ రెండు చివరి కోరికలు తీర్చుకోకుండానే తుది శ్వాస విడిచిన రెబల్ స్టార్ కృష్ణంరాజు (Rebelstar Krishnam Raju)..!

Updated on Sep 11, 2022 03:06 PM IST
రెబల్ స్టార్ కృష్ణంరాజు (Rebelstar Krishnam Raju) చివరి కోరిక తీరకుండానే తుదిశ్వాస విడిచారు.
రెబల్ స్టార్ కృష్ణంరాజు (Rebelstar Krishnam Raju) చివరి కోరిక తీరకుండానే తుదిశ్వాస విడిచారు.

టాలీవుడ్ రెబల్ స్టార్ కృష్ణంరాజు (Rebelstar Krishnam Raju) గత కొంతకాలంగా అనారోగ్య సమస్యతో బాధపడుతూ AIG హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం 3:25 గంటలకు తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఇక, ఆయన మరణ వార్త విన్న సినీ ఇండస్ట్రీ ఒక్కసారిగా శోకసంద్రంలో మునిగిపోయింది. పలువురు సినీ ప్రముఖులు ఆయన కుటుంబానికి తీవ్ర సంతాపం తెలియజేస్తున్నారు.

అయితే, కృష్ణంరాజుకు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌ (Prabhas) అంటే ఎంతో ప్రేమ. తనకు కొడుకులు లేకపోవడంతో తమ్ముడి కొడుకైన ప్రభాస్‌ను తన సొంత కొడుకులా చూసుకుంటూ.. ప్రభాస్‌తో కలిసి నటించేందుకు ఎంతో మక్కువ చూపించేవారు. ఈ ఇద్దరు నటులు ఇప్పటికే వెండితెరపై 'బిల్లా', 'రెబల్‌', 'రాధేశ్యామ్‌' చిత్రాల్లో కలిసి నటించారు.

ఇకపోతే రెబల్ స్టార్ కృష్ణంరాజు (Rebelstar Krishnam Raju) చివరి కోరిక తీరకుండానే తుదిశ్వాస విడిచారు. హీరోగా, రాజకీయ నాయకుడిగా, కేంద్రమంత్రిగా పనిచేసిన కృష్ణంరాజు... జీవితంలో అనుకున్న లక్ష్యాలన్నీ చేధించారు. కానీ, ఆయన ప్రభాస్ పెళ్లి చూడకుండానే తుదిశ్వాస విడిచారు. ప్రభాస్‌ ఎదుగుదలను దగ్గర నుంచి చూసిన కృష్ణంరాజు.. పెళ్లిని మాత్రం కళ్లారా చూడలేకపోయారు. ప్రభాస్ పెళ్లి గురించి ఆయన ఎంతో ఆరాటపడ్డారు. 

అలాగే.. 'మ‌న‌ఊరి పాండ‌వులు' లాంటి చిత్రంలో ప్రభాస్‌ నటిస్తే చూడాలని ఉందని కోరికను బయటపెట్టారు. అదేవిధంగా కృష్ణంరాజు డ్రీమ్ ప్రాజెక్ట్ (Krishnam Raju Dream Project) అయిన 'విశాల నేత్రాలు' అనే నవల చేయాలనుకున్నారు. ఈ నవలలో ప్రభాస్ తో చేయాలని కృష్ణంరాజు అనుకున్నారు. ప్రభాస్ పెళ్లి చేసుకుని ఆయనకు కలిగే సంతానంతో కూడా కలిసి నటించాలనేది కృష్ణంరాజు చివరి కోరిక. కానీ, కృష్ణంరాజు తన కోరికలు ఏవీ తీర్చుకోకుండానే తుదిశ్వాస విడిచారు.

అయితే, గతంలో ప్రభాస్ పెళ్లి (Prabhas Marriage) గురించి కృష్ణంరాజు అనేకసార్లు స్పందించారు. ఆయనకు మంచి జోడీ కోసం వెతుకుతున్నామని, అయితే ప్రభాస్ పెళ్లి విషయంలో ఆసక్తి చూపించడం లేదని వాపోయారు. 

Read More: కృష్ణం రాజు (Krishnam Raju) తో 50 ఏళ్ల స్నేహబంధం ఉంది - సూప‌ర్ స్టార్ కృష్ణ (Superstar Krishna)

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!