Kajal Aggarwal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ నటించిన టాప్ టెన్ సినిమాలు (బర్త్‌డే స్పెషల్)

Updated on Jun 20, 2022 11:04 AM IST
కాజల్ అగర్వాల్‌ (Kajal Aggarwal) బర్త్‌డే స్పెషల్
కాజల్ అగర్వాల్‌ (Kajal Aggarwal) బర్త్‌డే స్పెషల్

కల్యాణ్‌ రామ్‌ హీరోగా నటించిన ‘లక్ష్మీ కల్యాణం’ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal). తర్వాత కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘చందమామ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. 2007వ సంవత్సరంలో టాలీవుడ్‌లోకి వచ్చిన కాజల్‌.. దాదాపు 15 సంవత్సరాలుగా హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ క్రమంలోనే అందరు స్టార్‌‌ హీరోల సరసన నటించింది కాజల్.

1985 జూన్‌ 19న ముంబైలో పుట్టిన కాజల్ అగర్వాల్.. ఇటీవల మగబిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం మాతృత్వపు మాధుర్యాన్ని ఆస్వాదిస్తోంది. ఈ రోజు కాజల్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమె నటించిన కొన్ని హిట్‌ సినిమాలపై ఒక లుక్‌ వేద్దాం.

కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా చేసిన లక్ష్మీకల్యాణం సినిమా పోస్టర్

లక్ష్మీ కల్యాణంతో అరంగేట్రం..

తేజ దర్శకత్వం వహించిన ‘లక్ష్మీ కల్యాణం’ సినిమాతో కాజల్ టాలీవుడ్‌కి పరిచయమైంది. ఈ సినిమా అనుకున్నంత విజయం సాధించలేదు. కాజల్ నటించిన రెండో సినిమా ‘చందమామ’ కూడా 2007లోనే విడుదలై సూపర్‌‌హిట్‌ టాక్‌ సొంతం చేసుకుంది. దర్శకుడు కృష్ణ వంశీ తెరకెక్కించిన ఆ సినిమాలో నాగబాబు కూతురుగా కాజల్ నటించింది. తెలుగు సాంప్రదాయానికి ప్రతీకగా తెరకెక్కించిన  ‘చందమామ‘ సినిమాలో కాజల్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.

చందమామ సినిమా పోస్టర్

మగధీర సినిమా పోస్టర్

‘మగధీర’తో హిట్‌ హీరోయిన్‌గా

‘చందమామ‘ తర్వాత కాజల్ హీరోయిన్‌గా నటించిన పౌరుడు, ఆటాడిస్తా, తమిళ సినిమా పజని, సరోజ, మొది విలయదు బాక్సాఫీస్ దగ్గర బోల్తాపడ్డాయి. ఈ క్రమంలో మెగా పవర్‌‌స్టార్ రాంచరణ్‌ హీరోగా దర్శక ధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి తెరకెక్కించిన ‘మగధీర’ సినిమాలో కాజల్‌కు అవకాశం దక్కింది. 2009లో రిలీజైన ‘మగధీర‘ సినిమా ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది.

ఆర్య  2 సినిమా పోస్టర్

అల్లు అర్జున్‌ ఆర్య 2 లో..

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన ‘ఆర్య’ సినిమాకు సీక్వెల్‌గా ‘ఆర్య 2‘ సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమాలో నవదీప్‌కు లవర్‌‌గా.. సైకో ప్రేమికుడిగా నటించిన అల్లు అర్జున్‌కు భయపడే సాఫ్ట్‌వేర్‌‌ అమ్మాయిగా కాజల్ మంచి మార్కులే కొట్టేసింది.

డార్లింగ్‌ సినిమా పోస్టర్

‘డార్లింగ్‌’తో రొమాన్స్‌..

కాజల్ అగర్వాల్‌ను యూత్‌‌కు మరింత దగ్గర చేసిన సినిమా ‘డార్లింగ్’. రొమాంటిక్ లవ్ ఎంటర్‌‌టైనర్‌‌గా తెరకెక్కిన ‘డార్లింగ్‌‘ సినిమాలో కాజల్ అల్లరి, క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్స్‌ అభిమానులకు తెగ నచ్చేశాయి. 2010లో రిలీజైన ఈ సినిమా కాజల్‌ను స్టార్ హీరోయిన్‌గా మరో మెట్టు ఎక్కించింది.

బృందావనం సినిమా పోస్టర్

ఎన్టీఆర్‌‌తో..

జూనియర్‌‌ ఎన్టీఆర్, కాజల్ అగర్వాల్ మొదటిసారి కలిసి నటించిన సినిమా ‘బృందావనం’. ఫ్యామిలీ, యాక్షన్ ఎంటర్‌‌టైనర్‌‌గా తెరకెక్కిన ఈ సినిమాలో కాజల్‌.. తండ్రి మాట జవదాటని కూతురిగా నటించింది. ఎన్టీఆర్‌‌ పైన లేని ప్రేమను ఉన్నట్టుగా నటించే అమ్మాయి పాత్ర పోషించి మెప్పించింది కాజల్. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ హిట్‌ సాధించింది. 

మిస్టర్ పర్‌‌ఫెక్ట్‌ సినిమా పోస్టర్

ప్రభాస్‌తో మరోసారి..

రెబల్‌స్టార్ ప్రభాస్‌తో కాజల్ అగర్వాల్ జత కట్టిన సినిమా ‘మిస్టర్ పర్‌‌ఫెక్ట్‌’. రొమాంటిక్, ఫ్యామిలీ ఎంటర్‌‌టైనర్‌‌గా తెరకెక్కిన మిస్టర్ పర్‌‌ఫెక్ట్‌ సినిమా సూపర్‌‌హిట్‌ అయ్యింది. ఈ సినిమాలో కాజల్.. ప్రభాస్‌పై ప్రేమ, కోపం.. ఇలా రెండు షేడ్స్ ఉన్న క్యారెక్టర్‌‌లో నటించి మెప్పించింది. 2011వ సంవత్సరంలో వచ్చిన ఈ సినిమా ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది.

బిజినెస్‌మేన్ సినిమా పోస్టర్

ప్రిన్స్‌ మహేష్‌తో..

డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌ డైరెక్షన్‌లో సూపర్‌‌స్టార్‌‌ మహేష్‌బాబు నటించిన మరో బ్లాక్‌బస్టర్ సినిమా ‘బిజినెస్‌మేన్’. ఈ సినిమాలో కాజల్ హీరోయిన్‌గా నటించింది. 2012లో రిలీజైన ‘బిజినెస్‌మేన్’ సినిమాలో కాజల్‌ గ్లామర్‌‌తోపాటు, తన నటనతోనూ ఆకట్టుకుంది. ముఖ్యంగా, మహేష్‌, కాజల్‌ల మధ్య రూపొందించిన సన్నివేశాలు యూత్‌కు విపరీతంగా కనెక్ట్‌ అయ్యాయి. ఈ సినిమాలోని ఒక పాటలో మహేష్‌, కాజల్‌ల మధ్య లిప్‌లాక్ సీన్‌ కూడా ఉంటుంది. అదే మహేష్‌ కెరీర్‌‌లో ఫస్ట్‌ అండ్ లాస్ట్ లిప్‌లాక్ కావడం విశేషం.

బాద్‌షా సినిమా పోస్టర్

బాద్‌ షా..

గ్యాంగ్‌స్టర్‌‌గా ఎన్టీఆర్‌‌ నటించిన సూపర్‌‌హిట్‌ యాక్షన్‌ అండ్ కామెడీ ఎంటర్‌‌టైనర్‌‌ ‘బాద్‌షా’. ఈ సినిమాలో కాజల్ అందం, అభినయంతోనే కాకుండా కామెడీతో కూడా ఆకట్టుకుంది. జూనియర్ ఎన్టీఆర్‌‌తో రెండోసారి జతకట్టిన కాజల్‌ కామెడీ టైమింగ్‌‌ను, తెలుగు ప్రేక్షకులు తెగ ఎంజాయ్ చేశారు. ‘బాద్‌షా‘ సినిమాకు శ్రీన్‌ వైట్ల దర్శకత్వం వహించారు.

టెంపర్‌‌ సినిమా పోస్టర్

టెంపర్‌‌తో మరోసారి..

జూనియర్ ఎన్టీఆర్‌‌ హీరోగా 2015లో వచ్చిన ‘టెంపర్‘ సినిమాలో కాజల్ అగర్వాల్ యానిమల్ లవర్‌‌గా కనిపించింది. అమాయకత్వం, అందం, మంచి మనసున్న అమ్మాయిగా కాజల్ నటన అద్భుతం అని చెప్పాలి. ఈ సినిమా హిట్‌తో ఎన్టీఆర్‌‌, కాజల్‌ హ్యాట్రిక్ విజయాలు అందుకున్నారు.

‘అ’ సినిమా పోస్టర్

ప్రయోగాత్మక సినిమా ‘ !

కాజల్‌ ప్రధాన పాత్రలో నటించిన ప్రయోగాత్మక సినిమా ‘అ’. సైకలాజికల్ థ్రిల్లర్‌‌గా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్‌ హిట్‌గా నిలవక పోయినా.. కాజల్‌ నటనను విమర్శకులు కూడా ప్రశంసించారు. ఈ సినిమాకు చాలా జాతీయ అవార్డులు దక్కాయి.

భర్త గౌతమ్‌ కిచ్లు, కొడుకు నీల్ కిచ్లుతో కాజల్ అగర్వాల్

ఇక, టాలీవుడ్‌లోకి అడుగుపెట్టక ముందే 2004లో హిందీ సినిమా ‘క్యూ హో గయానా’ అనే చిత్రంతో ఇండస్ట్రీలోకి వచ్చింది కాజల్ అగర్వాల్. 36 వసంతాలు పూర్తి చేసుకుని.. 37వ వసంతంలోకి అడుగుపెడుతున్న కాజల్ అగర్వాల్‌కు ఈ బర్త్‌డే ఎంతో స్పెషల్ అనే చెప్పాలి. 2020 అక్టోబర్‌‌ 30వ తేదీన గౌతం కిచ్లుని పెళ్లి చేసుకున్న కాజల్ (Kajal Aggarwal).. ఈ ఏడాది ఏప్రిల్‌ 19న మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ బాబుకు నీల్ కిచ్‌లు అని పేరు పెట్టింది.

Read More : ఒక్క సీన్‌లో అయినా వైట్‌ షర్ట్‌తో చిరు.. రిలీజ్‌కు ముందు దర్గాకు మహేష్‌..టాలీవుడ్ (Tollywood) తారలసెంటిమెంట్స్

 
 
దాదాపు 15 సంవత్సరాలుగా తన అందం, అభినయంతో మనందరినీ అలరిస్తున్న
కాజల్‌ అగర్వాల్‌కు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు
 
Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!