ప్రభాస్ (Prabahs) అభిమానులకు నిరాశ.. మళ్లీ వాయిదా పడనున్న 'ప్రాజెక్ట్ K' (Project K).. 2024 వేసవికి విడుదల?

Updated on Nov 01, 2022 04:15 PM IST
తాజా సమాచారం ప్రకారం 'Project K' సినిమాని 2024 ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
తాజా సమాచారం ప్రకారం 'Project K' సినిమాని 2024 ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌ (Hero Prabhas) హీరోగా అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న చిత్రం 'ప్రాజెక్ట్ K' (Project K). ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తోంది. ‘మ‌హాన‌టి’ ఫేం నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం అత్యంత భారీ బ‌డ్జెట్‌తో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. ఇక, ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లకు ప్రేక్షకుల నుండి విశేష స్పందన లభించింది.

ఇదిలా ఉంటే.. ప్రభాస్ (Hero Prabhas) ప్రస్తుతం ఓ భారీ హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. ‘బాహుబలి’ వంటి పాన్‌ ఇండియా హిట్‌ తర్వాత ‘సాహో’, ‘రాధేశ్యామ్‌’ చిత్రాలు వరుసగా ఫ్లాప్‌ అవడంతో ప్రభాస్‌ తీవ్రంగా నిరాశపడ్డాడు. ప్రస్తుతం ఆయన మూడు సినిమాలను సెట్స్ పైన ఉంచాడు. అందులో ‘ప్రాజెక్ట్‌-K’ ఒక‌టి. అయితే షూటింగ్ ప్రారంభమయి నెలలు గడుస్తున్నా ప్రభాస్‌ లుక్‌ను రిలీజ్‌ చేయలేదని డార్లింగ్‌ అభిమానులు చిత్రబృందంపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో 'ప్రాజెక్ట్ K' విడుదల వాయిదా పడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.  

'ప్రాజెక్ట్‌ K' (Project K) అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమా అసలు టైటిల్‌ ఏంటన్న దానిపై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాని 2024వేసవి కానుకగా ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది చివరికి గానీ 2023 ప్రారంభంలోకానీ సినిమా చిత్రీకరణ పూర్తి చేసి ఆ తర్వాత నిర్మాణానంతర కార్యక్రమాలు మొదలు పెట్టనున్నారట. అయితే ముందుగా ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది చివర్లో.. లేదంటే 2024 సంక్రాంతికి రిలీజ్‌ చేయనున్నట్లు నిర్మాత అశ్వినీదత్‌ ప్రకటించాడు. కానీ, తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ‘ప్రాజెక్ట్‌-K’ (Project K) చిత్రం మరో మూడు నెలలు పోస్ట్‌ పోన్‌ కానుంది.

నాగ్ అశ్విన్‌ ఈ చిత్రాన్ని తెలుగు తెరపై మునుపెన్నడూ లేని కథాంశంతో తెరకెక్కిస్తున్నాడు. మూడో ప్రపంచ యుద్ధం నేపథ్యంగా సూపర్ హీరో కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇక ఇటీవల ప్రభాస్‌ పుట్టిన రోజు సందర్భంగా చిత్ర యూనిట్‌ విడుదల చేసిన పోస్టర్‌ సినిమాపై అంచనాలు అమాంతం పెంచేసింది. 

'ప్రాజెక్ట్‌ K' (Project K) అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమా అసలు టైటిల్‌ ఏంటన్న దానిపై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. ఇక ఈ సినిమాలో బాలీవుడ్‌ బిగ్‌బి అమితాబ్‌ బచ్చన్‌ కీలక పాత్రలో నటిస్తుండగా, ప్రభాస్‌కు జోడిగా బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె నటిస్తోంది. పాన్‌ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని ఓ విజువల్‌ వండర్‌లా నిర్మిస్తున్నారు.

Read More: ప్రభాస్-మారుతి (Prabhas-Maruthi) కాంబో సినిమాపై ఆసక్తికర అప్డేట్స్.. హీరోయిన్లుగా హాట్ బ్యూటీలు?

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!