రెబల్ స్టార్ కృష్ణంరాజు (Rebelstar Krishnam Raju) అంతిమ యాత్ర పూర్తి.. కనకమామిడి ఫామ్ హౌస్‌లో అంత్యక్రియలు..!

Updated on Sep 12, 2022 04:59 PM IST
కృష్ణంరాజు ఏ కార్యక్రమంలో పాల్గొన్నా.. ఎప్పుడు ఇంటర్వ్యూ ఇచ్చినా తన వారసుడు ప్రభాస్ (Prabhas) అని ఎప్పుడూ చెప్పేవారు.
కృష్ణంరాజు ఏ కార్యక్రమంలో పాల్గొన్నా.. ఎప్పుడు ఇంటర్వ్యూ ఇచ్చినా తన వారసుడు ప్రభాస్ (Prabhas) అని ఎప్పుడూ చెప్పేవారు.

ప్రముఖ సినీ నటుడు, రెబల్ స్టార్ కృష్ణంరాజు (Rebelstar Krishnam Raju) మృతితో టాలీవుడ్ శోక సంద్రంలో మునిగిపోయింది. ఈ రోజు కృష్ణంరాజు అంత్యక్రియలను తెలంగాణా ప్రభుత్వం అధికార లాంఛనాలతో జరిపింది. దీనిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌కు సీఎం కేసీఆర్ ఆదివారమే ఆదేశాలు జారీ చేశారు. అలాగే ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యేకం ఏర్పాట్లు చేసింది. మంత్రి కేటీఆర్ ఆదివారం కృష్ణంరాజు నివాసానికి వెళ్లి ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. 

ఇక కృష్ణంరాజు (Krishnam Raju) అంత్యక్రియలను ఆదివారం మధ్యాహ్నం మహాప్రస్థానంలో (Mahaprasthanam) నిర్వహిస్తారని అనుకున్నారు. తొలుత వీఐపీల సందర్శనార్థం యూసుఫ్‌గూడలోని కోట్ల విజయభాస్క రెడ్డి స్టేడియంలో ఆయన భౌతిక కాయాన్ని ఉంచి, అక్కడి నుంచి మహాప్రస్థానానికి తరలిస్తారని అభిమానులు భావించారు. కానీ, ఈ వార్తలపై కృష్ణంరాజు కుటుంబసభ్యులు క్లారిటీ ఇచ్చారు. 

పండితుల సూచన మేరకు ఆ తర్వాత ఈ కార్యక్రమంలో స్వల్ప మార్పుల చేశారు. మధ్యాహ్నం జరగాల్సిన అంత్యక్రియలను సాయంత్రానికి మార్చారు. ప్రభాస్ సోదరుడు ప్రభోద్ (Prabhas Brother Prabodh) చేతుల మీదుగా అంత్యక్రియలు జరిగాయి. మధ్యాహ్నం ఒంటిగంటకు కృష్ణంరాజు అంతిమయాత్ర ప్రారంభమైంది.

మొయినాబాద్‌లోని క‌న‌క‌మామిడి ద‌గ్గ‌ర ఉన్న త‌న‌ ఫాంహౌస్‌లో (Kanakamamidi Farmhouse) అధికారిక లాంఛ‌నాల‌తో రెబల్ స్టార్ అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించారు.ఈ అంత్యక్రియలకు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులకు మాత్రమే అనుమతించారు.

అయితే కృష్ణంరాజుకు అబ్బాయిలు లేకపోవడంతో, ఆయనకు ఎవరు తలకొరివి పెడతారన్నది చర్చనీయాంశంగా మారింది. కాగా, కృష్ణంరాజు 'ఏ కార్యక్రమంలో పాల్గొన్నా.. ఎప్పుడు ఇంటర్వ్యూ ఇచ్చినా' తన వారసుడు ప్రభాస్ (Prabhas) అనే చెప్పేవారు. వారిద్దరి మధ్య అనుబంధం సొంత తండ్రీకొడుకుల కంటే ఎక్కువగా ఉండేది. దీంతో ఆయనకు ప్రభాస్ తలకొరివి పెడతారని అందరూ భావించారు.

కాగా, 56 ఏళ్లకు పైగా సినిమా ఇండ‌స్ట్రీలో ఉన్న కృష్ణంరాజు (Krishnam Raju) .. ఎన్నో గొప్ప సినిమాల్లో న‌టించారని సినీ పెద్దలు కొనియాడారు. భక్త కన్నప్ప, తాండ్ర పాపారాయుడు, మన వూరి పాండవులు, రంగూన్ రౌడీ, పల్నాటి పౌరుషం లాంటి సినిమాలు కృష్ణంరాజు  కెరీర్‌లో మైలు రాళ్లుగా నిలిచిపోయాయి. ఐదు దశాబ్దాలుగా తెలుగు సినీ ప్రేక్షకుల మనసుల్లో రారాజుగా వెలిగిన రెబల్ స్టార్ కృష్ణంరాజు పరిశ్రమపై తనదైన ముద్ర వేశారు. 

Read More: కృష్ణంరాజు (Krishnam Raju) భౌతికకాయానికి నివాళులర్పించిన సినీ, రాజకీయ ప్రముఖులు రామ్ (Ram), రోజా(Roja), జయప్రద

 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!