పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas)కు ఇష్టమైనవి ఏంటో తెలుసా? (డార్లింగ్ గురించిన టాప్7 ఆసక్తికర విశేషాలు)
ఆరడుగుల కటౌట్‌తో అమ్మాయిల మనసులు దోచుకున్న ‘ఛత్రపతి’.. కలెక్షన్ల ‘వర్షం’ కురిపించే ‘ఏక్‌నిరంజన్’.. క్యారెక్టర్‌లో ‘మిస్టర్ పర్‌ఫెక్ట్’.. బాక్సాఫీస్ ‘బాహుబలి’.. అభిమానుల ‘డార్లింగ్’.. టాలీవుడ్ ‘ఆదిపురుష్’.. ఇండస్ట్రీ రికార్డులన్నీ ‘సాహో’ అనే సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు ప్రభాస్ (Prabhas).
ఈశ్వర్ సినిమాతో టాలీవుడ్‌లో జర్నీ మొదలుపెట్టిన ప్రభాస్.. తన స్టైల్, యాక్షన్‌తో రెబల్‌స్టార్‌గా మారారు. ఇక, బాహుబలి సినిమా కోసం చూపించిన డెడికేషన్, హార్డ్‌వర్క్ ఆయనను పాన్ ఇండియా స్టార్‌ను చేశాయి. అభిమానులు ముద్దుగా డార్లింగ్ అని పిలుచుకునే ప్రభాస్.. ఒక్కో సినిమాకు కొన్ని కోట్లు రెమ్యునరేషన్‌గా తీసుకుంటున్నారు. బాహుబలి సిరీస్ సినిమాల తర్వాత ఆయన రేంజ్ మరింతగా పెరిగింది.
పైకి సింపుల్‌గా కనిపించే ప్రభాస్ లగ్జరీ లైఫ్‌ను లీడ్ చేస్తుంటారు. ప్రస్తుతం ఆయన వద్ద ఉన్న విలువైన (టాప్7) వస్తువులపై ఒక లుక్ వేద్దాం.
యూవీ క్రియేషన్స్‌లో భారీ పెట్టుబడులు..
హీరోగా స్టార్ ఇమేజ్‌ను సంపాదించుకున్న ప్రభాస్.. తన స్నేహితులతో కలిసి యూవీ క్రియేషన్స్ అనే సంస్థను నెలకొల్పి సినిమాలు తెరకెక్కిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై ఇప్పటికే పలు సినిమాలు తీశారు.
ఈ సంస్థలో ప్రభాస్ రూ.300 కోట్ల నుంచి రూ.500 కోట్ల వరకు పెట్టుబడి పెట్టినట్టు తెలుస్తోంది.
హైదరాబాద్‌లోని ఇల్లు..
సినిమా షూటింగ్స్ లేని సమయంలో ఎక్కువగా ఇంట్లోనే ఉంటూ ఫుడ్‌ను ఎంజాయ్ చేయడం ఇష్టమని చెబుతుంటారు ప్రభాస్ (Prabhas). హైదరాబాద్‌లో ప్రభాస్‌కు లగ్జరీ హౌస్ ఉంది. చూడడానికి ఎంతో అందంగా, ఆకర్షణీయంగా కనిపించే ఆ ఇంటి కోసం ప్రభాస్ భారీగానే ఖర్చు చేసినట్టు టాక్.
దాని విలువ ప్రస్తుతం రూ.80 కోట్లు ఉంటుందని అంచనా.
హైదరాబాద్‌లోని ఫామ్ హౌస్..
హైదరాబాద్‌లోని ఇంటితోపాటు ఫామ్‌హౌస్ కూడా ప్రభాస్‌కి ఉంది. సిటీ శివార్లలో అన్ని సౌకర్యాలతో ఫామ్‌హౌస్‌ను నిర్మించుకున్నారని సమాచారం. దీని విలువ రూ.60 కోట్ల నుంచి రూ.80 కోట్ల వరకు ఉంటుందని టాక్.
ప్రైవేట్ జెట్..
టాలీవుడ్ స్టార్ హీరోలు చాలా మంది సొంత విమానాలను కొనుగోలు చేశారు. ఆ లిస్ట్‌లో ప్రభాస్ కూడా ఉన్నారు. బాహుబలి నుంచి ప్రభాస్ అన్నీ పాన్ ఇండియా సినిమాలే చేస్తున్నారు. వాటి ప్రమోషన్స్ కోసం వివిధ రాష్ట్రాలకు తిరుగుతూ ఉంటారు. వాటి కోసం ప్రభాస్ తన పర్సనల్ జెట్‌ను వినియోగిస్తున్నారని సమాచారం.
ప్రభాస్ కొనుగోలు చేసిన జెట్ విలువ సుమారు రూ.50 కోట్లు అని టాక్.
కళ్లు చెదిరే కార్లు..
ప్రభాస్ కార్ల గ్యారేజ్‌లో పలు లగ్జరీ కార్లు కనిపిస్తాయి. వాటిలో 8 కోట్ల విలువైన రోల్స్ రాయిస్ ఫాంటమ్ ఒకటి. దాంతోపాటు రూ.6 కోట్లతో కొనుగోలు చేసిన లాంబోర్ఘిని అవెంటేడర్, రూ.3 కోట్ల విలువ ఉన్న రేంజ్ రోవర్ ఆటో బయోగ్రఫీ, రూ.2.10 కోట్లతో కొనుగోలు చేసిన జాగ్వర్ ఎక్స్‌జేఆర్, 70 లక్షల విలువైన బీఎండబ్ల్యూ ఎక్స్3 ఉన్నాయి.
రిస్ట్ వాచ్‌లపై కూడా..
స్టైలిష్ కాస్ట్యూమ్స్‌తో ఆకట్టుకునే ప్రభాస్.. చేతికి పెట్టుకునే వాచీలపైనా బాగానే ఖర్చు చేస్తుంటారు. ఆయన దగ్గర రూ.28 లక్షల విలువైన బంగారంతో చేసిన రోలెక్స్ యాచ్‌మాస్టర్ II వాచ్, 22 క్యారెట్ల గోల్డ్ కేస్‌తో చేసిన రూ.27 లక్షల విలువైన రోలెక్స్ కాస్మోగ్రాఫ్ డేటోనా, రూ.13 లక్షల విలువైన హుబ్లో బిగ్ బ్యాంగ్ స్యాంగ్ బ్లూ ఆల్ వైట్ వాచీలు ఉన్నాయి.
ఖరీదైన జిమ్..
ఫుడ్‌తోపాటు ఫిట్‌నెస్‌కు కూడా ఎక్కువ ప్రాధాన్యతని ఇస్తుంటారు ప్రభాస్. బాహుబలి సినిమా కోసం ఆయన పడిన కష్టం గురించి అందరికీ తెలిసిందే. ఆ సినిమాలో ఆయన శరీరాకృతిని చూసి షాకయ్యారు చాలామంది. అంతటి డెడికేషన్‌తో జిమ్ చేసే ప్రభాస్ ఇంట్లోనే జిమ్‌ను ఏర్పాటు చేసుకున్నారు.
జిమ్‌లో ఎక్విప్‌మెంట్‌కు సుమారు రూ.2 కోట్లు ఖర్చు చేశారట ప్రభాస్ (Prabhas)
Read More : జపాన్‌లో కాసులు కురిపించిన టాప్8 భారతీయ సినిమాలు