Prabhas-Maruthi: ప్రభాస్-మారుతి కాంబినేషన్ లో సినిమా వద్దంటున్న రెబల్ స్టార్ ఫ్యాన్స్.. డైరెక్టర్ పై ట్రోలింగ్

Updated on Aug 24, 2022 09:32 PM IST
బిజీ షెడ్యూల్‌లోనూ ప్ర‌భాస్ (Prabhas) మారుతితో సినిమా చేయ‌టం గొప్ప విష‌య‌మే. ప్ర‌భాస్‌ను స‌రికొత్త కోణంలో చూపించేలా ప్లాన్ చేశార‌ట‌ మారుతి.
బిజీ షెడ్యూల్‌లోనూ ప్ర‌భాస్ (Prabhas) మారుతితో సినిమా చేయ‌టం గొప్ప విష‌య‌మే. ప్ర‌భాస్‌ను స‌రికొత్త కోణంలో చూపించేలా ప్లాన్ చేశార‌ట‌ మారుతి.

టాలీవుడ్‌లో కొంత‌కాలంగా వినిపిస్తున్న మోస్ట్ క్రేజీయెస్ట్ కాంబినేష‌న్‌ డైరెక్టర్ మారుతి (Maruthi)- యంగ్ రెబల్ స్టార్ ప్ర‌భాస్ (Prabhas). ఈ పాన్ ఇండియా స్టార్ ప్రస్తుతం వరుసగా భారీ బ‌డ్జెట్ సినిమాలే చేస్తూ వ‌స్తున్నారు. సాహో (Saaho), రాధేశ్యామ్ (Radhe Shyam) సినిమాలు ఆశించిన స్థాయిలో విజ‌యాల‌ను సాధించ‌లేదు. అయితే క్రేజీ ప్రాజెక్ట్స్ సెట్స్‌పై ఉండ‌టంతో ఫ్యాన్స్ ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.  

ప్రభాస్ లిస్ట్ లో ప్రస్తుతం 'ప్రాజెక్ట్ K' (Project K), 'సలార్' (Salaar), 'స్పిరిట్' వంటి సినిమాలు ఉన్నాయి. మరో రెండు, మూడేళ్లలో ఈ సినిమాలన్నీ పూర్తి చేయనున్నారు ప్రభాస్. మారుతి దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నారు. ఈ విషయాన్ని మారుతి స్వయంగా వెల్లడించారు. కొన్ని నెల‌ల నుంచి ప్ర‌భాస్-మారుతి సినిమాపై వార్త‌లు వినిపిస్తూనే వ‌స్తున్నాయి.  సినిమాకి 'రాజా డీలక్స్' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. రేపే ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరుగబోతున్నట్లు సమాచారం. 

ప్ర‌భాస్ ఫ్యాన్స్ ఓ వైపు ఈ ప్రాజెక్ట్‌పై పెద్ద‌గా ఆస‌క్తి చూప‌డంలేదు. అస‌లే స‌క్సెస్‌లు లేక ఇబ్బందులు ప‌డుతుంటే ఇప్పుడు మారుతిలో (Director Maruthi) సినిమా ఎందుకు అనేది వారి ఆలోచ‌న‌. ఈ మధ్యకాలంలో మారుతి నుంచి వచ్చిన ఒక్క సినిమా కూడా సరిగ్గా ఆడలేదు. భారీ అంచనాల మధ్య విడుదలైన 'పక్కా కమర్షియల్' (Pakka Commercial) సినిమా కూడా పెద్దగా ఆడలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభాస్ తో సినిమా కరెక్ట్ కాదనేది అభిమానుల అభిప్రాయం. ఈ క్రమంలో మారుతిని ఈ ప్రాజెక్ట్ టేకప్ చేయొద్దంటూ సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తున్నారు. 

ఇదిలా ఉంటే.. ఇంత బిజీ షెడ్యూల్‌లోనూ ప్ర‌భాస్ (Prabhas) మారుతితో సినిమా చేయ‌టం గొప్ప విష‌య‌మే. మారుతి సైతం ప్ర‌భాస్‌ను స‌రికొత్త కోణంలో చూపించే విధంగా ప్లాన్ చేశార‌ట‌. ప్ర‌భాస్ విలువైన స‌మ‌యాన్ని దృష్టిలో పెట్టుకుని మారుతి ముందుగానే ఆయ‌న పాత్ర‌కు సంబంధించిన చిత్రీక‌రణంతా పూర్తి చేసేలా ప్లాన్ చేసేశార‌ట‌. కాగా, త్వ‌ర‌లోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌నుంద‌ని స‌మాచారం.

మరోవైపు.. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉంటారట. మెయిన్ హీరోయిన్ గా అనుష్కను (Anushka) తీసుకున్నట్లు సమాచారం. ఆమె ఈ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అదే నిజమైతే మరోసారి తెరపై ప్రభాస్-అనుష్కలను చూసే ఛాన్స్ వస్తుంది. రెండు, మూడు షెడ్యూల్స్ లోనే సినిమాను పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

Read More: Prabhas: 'సలార్' (Salaar) షూటింగ్‌లో ప్రభాస్ కాలికి గాయం.. ఆందోళనలో ఫ్యాన్స్ !

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!