Prithviraj Sukumaran : పృథ్వీ రాజ్ సుకుమారన్‌కు సలార్ చిత్రంలో ఛాన్స్? అలాగే ఓ తెలుగు సినిమా డైరెక్ట్ చేస్తారట

Updated on Jun 25, 2022 09:27 PM IST
సలార్ విషయానికి వస్తే.. ఈ చిత్రంలో  నటుడు పృథ్వీ రాజ్ (Prithviraj Sukumaran) ఓ  పాత్రను చేస్తారని అప్పట్లో ఓ టాక్  మీడియాలో హల్చల్ చేసింది.
సలార్ విషయానికి వస్తే.. ఈ చిత్రంలో నటుడు పృథ్వీ రాజ్ (Prithviraj Sukumaran) ఓ పాత్రను చేస్తారని అప్పట్లో ఓ టాక్ మీడియాలో హల్చల్ చేసింది.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) మరియు కేజీఎఫ్ సినిమాతో ఇండస్ట్రీ రికార్డులను బద్దలుకొట్టిన ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న యాక్షన్ థ్రిల్లర్ “సలార్” (Salaar) కోసం అభిమానులందరూ కాచుకొని ఉన్న సంగతి తెలిసిందే. 

ఇప్పటికే ప్రశాంత్ నీల్ జూనియర్ ఎన్టీఆర్‌తో కూడా ఓ సినిమా తీయడానికి ప్రాజెక్ట్ సైన్ చేశాడు. అలాగే కేజీఎఫ్ మూడవ భాగాన్ని తెరకెక్కించేందుకు కూడా ఈయన తనదైన శైలిలో ప్రణాళికలు రచిస్తున్నాడు. 

ఇక సలార్ విషయానికి వస్తే.. ఈ చిత్రంలో మలయాళ నటుడు పృథ్వీ రాజ్ (Prithviraj Sukumaran) కూడా ఓ కీలకమైన పాత్రను పోషిస్తున్నాడని అప్పట్లో ఓ టాక్ సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. ఇప్పుడు అదే విషయంపై పృథ్వీ రాజ్ తన వివరణ ఇచ్చారు. తాను 'సలార్' చిత్రంలో నటించే అవకాశం ఉందని ఆయన తెలిపారు. 

ప్రశాంత్ నీల్ తనను రెండు సంవత్సరాల క్రితమే ఈ కథతో అప్రోచ్ అయ్యారని.. కానీ కరోనా ప్యాండమిక్ వల్లా, ఆ తర్వాత ఆయన కేజీఎఫ్ 2 ను తెరకెక్కించడం వల్ల తనను కలిసే అవకాశం చిక్కలేదని పృథ్వీ రాజ్ తెలిపారు. ఇప్పుడు అవకాశం ఉంటే, తప్పకుండా తాను 'సలార్‌'లో నటిస్తానని ఆయన పేర్కొన్నారు. ఈ విషయంపై ప్రశాంత్‌తో మాట్లాడడానికి కూడా ప్రయత్నిస్తున్నానని పృథ్వీ‌రాజ్ (Prithviraj Sukumaran) క్లారిటీ ఇచ్చారు.

అలాగే మరో విషయంపై కూడా పృథ్వీ‌రాజ్ స్పందించారు. తనకు తెలుగులో డైరెక్షన్ ఛాన్సులు  వస్తున్నాయని.. ఈ విషయానికి సంబంధించి పలువురు నిర్మాతలు తనను సంప్రదించారని కూడా ఆయన తెలిపాడు. 

హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ పై సలార్ (Salaar) చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.  రవి బస్రూర్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు. శ్రుతి హాసన్ ఇందులో హీరోయిన్‌గా నటిస్తుండగా.. జగపతిబాబు కూడా సినిమాలో ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు.  

Read More:  సలార్ (Salaar) : హాలీవుడ్‌ రేంజ్‌లో ప్రీ క్లైమాక్స్‌కి సిద్ధమైన ప్రభాస్ సినిమా


 

Advertisement
Credits: Instagram

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!