సలార్ (Salaar) : హాలీవుడ్‌ రేంజ్‌లో ప్రీ క్లైమాక్స్‌కి సిద్ధమైన ప్రభాస్ సినిమా

Updated on Apr 26, 2022 11:18 AM IST
హాలీవుడ్‌ రేంజ్‌లో ప్రభాస్ (Prabhas) సలార్‌‌ ప్రీక్లైమాక్స్
హాలీవుడ్‌ రేంజ్‌లో ప్రభాస్ (Prabhas) సలార్‌‌ ప్రీక్లైమాక్స్

రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) నటిస్తున్న మరో క్రేజీ ప్రాజెక్ట్‌ సలార్. ప్రభాస్, శృతిహాసన్ జంటగా నటిస్తున్న ఈ సినిమాకు ప్రశాంత్‌ నీల్ దర్శకత్వం వహిస్తున్నాడు. హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్‌‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాను హోంబలే ఫిల్మ్స్‌ బ్యానర్‌‌పై విజయ్‌ కిరగందూర్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. బొగ్గు గనుల మాఫియా కథ ఆధారంగా నిర్మిస్తున్న సలార్‌‌లో ప్రభాస్‌ లుక్‌ ఓ రేంజ్‌లో ఉంది. ఇప్పటికే రిలీజ్‌ చేసిన ఫస్ట్‌ లుక్‌కు భారీ రెస్పాన్స్ వచ్చింది. ప్రభాస్‌ నటించిన ‘సాహో’, ‘రాధేశ్యామ్’ బాక్సాఫీస్ దగ్గర అనుకున్న రీతిలో విజయం సాధించలేకపోయాయి. అయితే దాని ప్రభావం సలార్‌‌ సినిమాపై ఏ మాత్రం పడే అవకాశం లేదు. సాహో, రాధేశ్యామ్‌ సినిమాల్లోని క్యారెక్టర్లకు.. సలార్‌‌లోని ప్రభాస్ క్యారెక్టర్‌‌కు చాలా వేరియేషన్‌ ఉండబోతోంది.  

కేజీఎఫ్‌ సక్సెస్‌తో ప్రశాంత్‌నీల్‌పై అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి. అందులోనూ పాన్‌ ఇండియా స్టార్‌‌గా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్‌తో చేయబోతున్న సినిమా కావడంతో. తనపై బాధ్యత మరింత పెరిగిందని ప్రశాంత్‌ నీల్‌ అంటున్నాడు.

ప్రభాస్‌ ఫ్యాన్స్​ను అలరించేలా సినిమాను తెరకెక్కించనున్నట్టు వెల్లడించాడు. అందుకు తగ్గట్టుగానే సినిమాను నెక్ట్స్‌ లెవెల్‌కు తీసుకెళ్లడానికి ప్రశాంత్ నీల్ కష్టపడుతున్నాడు. ఆ సినిమాలోని ప్రీ క్లైమాక్స్​లో వచ్చే యాక్షన్‌ సీక్వెన్స్​ను అద్భుతంగా చిత్రీకరిస్తున్నాడని తెలిసింది. ఇంటర్వెల్‌ సీక్వెన్స్ మొత్తం ఒక లోయలో జరుగుతుందని టాక్.

అలాగే అండర్‌‌ గ్రౌండ్‌లో జరిగే విజువల్స్‌ ఓ రేంజ్‌లో ఉంటాయని సమాచారం. ఇక లోయ లోపల జరిగే ఛేజింగ్‌ సీన్స్ ప్రభాస్‌ అభిమానులతోపాటు, సినీ ప్రేమికులకు గూస్‌ బంప్స్‌ తెప్పించడం ఖాయమని అంటున్నారు. ప్రీ క్లైమాక్స్‌లోని యాక్షన్ సీన్స్‌ కోసం దాదాపుగా రూ.20 కోట్లు ఖర్చు చేస్తున్నారు.

ఇక, ప్రభాస్‌ (Prabhas). శృతిహాసన్‌ మధ్య సాగే రొమాంటిక్‌ సన్నివేశాలు సినిమాకే హైలైట్‌గా నిలుస్తాయని చిత్ర యూనిట్‌ చెబుతోంది. కేజీఎఫ్‌2 సినిమాలో లాగే సలార్‌‌లో హీరోయిన్‌ క్యారెక్టర్‌‌ కూడా ఉండబోతోందని, దీంతో శృతిహాసన్‌ కనిపించే సన్నివేశాలు ఎమోషనల్‌గా ఉండబోతున్నాయని తెలుస్తోంది.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!