Hero Prabhas: బక్కపలుచగా 'బాహుబలి'.. ప్రశాంత్ నీల్ సూచనతో డాషింగ్ లుక్ లో రెబల్ స్టార్!

Updated on Jun 24, 2022 04:50 PM IST
డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో హీరో ప్రభాస్ (Hero Prabhas With Prashant Neel)
డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో హీరో ప్రభాస్ (Hero Prabhas With Prashant Neel)

యంగ్ రెబల్ స్టార్ హీరో ప్రభాస్ (Hero Prabhas) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. ప్రస్తుతం ఈ పాన్ ఇండియా స్టార్ బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ సినిమా ‘ఆదిపురుష్’ లో నటిస్తున్నాడు. దాదాపు 500కోట్లతో టీసీరీస్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఈ చిత్రం తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో రూపొందుతోంది. ఇక ఈ మూవీలో ప్రభాస్ శ్రీరాముడిగా, కృతి సనన్ సీతగా, సైఫ్ అలీఖాన్ రావణునిగా నటిస్తున్నారు. అయోధ్య నేపథ్యంగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. కాగా, ‘ఆదిపురుష్’ వచ్చే ఏడాది సంక్రాంతికి థియేటర్లలోకి రానుంది. 

ఇదిలా ఉంటే.. ప్రభాస్ హీరోగా ఇటీవలె 'రాధే శ్యామ్' (Radhey Shyam Movie) సినిమాతో అందరిని అలరించారు. అనంతరం తాజాగా ప్రభాస్.. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ఇటీవలే 'సలార్' షూటింగ్‌ని ప్రారంభించారు. ఈ సంవత్సరం డిసెంబర్ నాటికి మొత్తం షూటింగ్ పార్ట్ పూర్తి చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ చిత్రం 2023 వేసవిలో థియేటర్లలోకి రానుంది.

హీరో ప్రభాస్ (Hero Prabhas)

ఇక అసలు విషయానికి వస్తే.. మొన్న రాత్రి ముంబయి, బాంద్రాలో ఆదిపురుష్ (Adi Purush) దర్శకుడు ఓంరౌత్ ఇంట్లో ఇచ్చిన పార్టీలో ప్రభాస్ కూడా పాల్గొన్నారు. ఆ పార్టీలో ప్రభాస్ బ్లాక్ జీన్స్, మెరూన్ షర్ట్‌లో కొత్త లుక్ లో కనిపించారు. ఇకపోతే గతంలో కంటే ప్రభాస్ ఇప్పుడు సన్నబడటం విశేషం. ఆయన సన్నబడ్డట్టు కనిపిస్తున్న ఫొటోలు సోషల్‌ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. డార్లింగ్ అభిమానులు కోరుకున్నట్లు ఫిట్ గా తయారవుతున్న ప్రభాస్  గత కొంతకాలంగా కనిపిస్తున్న లుక్‌కు భిన్నంగా, స్మార్ట్‌గా ఉన్నారు. 

అయితే, సలార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Director Prashant Neel) పట్టుబట్టడంతోనే ప్రభాస్ మేకోవర్ చేయించుకున్నట్లు తెలుస్తోంది. కసరత్తులు చేసి మరీ ప్రభాస్ కండలు తగ్గించినట్లు కనపడుతోంది. కాగా, ‘సలార్’ లో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. అందుకే బరువు తగ్గారని చెప్పుకుంటున్నారు. అయితే అసలు కారణం వేరే ఉందని సమాచారం. 

ఇదిలా ఉంటే.. సలార్ (Salaar Movie) సినిమా రషెష్ చూసిన ప్రశాంత్ నీల్... ప్రభాస్ ఫిజికల్ గా అసలు ఎట్రాక్షన్ గా లేరని భావించాడు. అందుకే ఇద్దరూ 'కేజీఎఫ్ 2' రిలీజ్ కు ముందు సమావేశమయినట్లు తెలుస్తోంది. కనీసం 10 కిలోలయినా బరువు తగ్గాలని ప్రభాస్‌ని కోరారట ప్రశాంత్ నీల్. ఇక రషెష్ చూసిన ప్రభాస్ సైతం అది నిజమే అని ఒఫ్పుకున్నారట ప్రభాస్. రీరాకృతిని తగ్గించుకోవడంపై దృష్టి పెట్టిన ప్రభాస్ ఆ విషయంలో చాలా వరకూ సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. అయితే ఆయన ఫ్యాన్స్ మాత్రం.. ప్రభాస్‌ శారీరకంగా మారిన తీరు ఎంతో నచ్చిందని, హ్యాండ్సమ్‌గా ఉన్నారని తెగ పోస్ట్‌లు చేస్తున్నారు. దీంతో ఫొటోలు కాస్తా తెగ వైరల్‌ అవుతున్నాయి.

Read More: Salaar : 'డార్లింగ్' ప్ర‌భాస్ (Prabhas) న‌టిస్తున్న‌.. స‌లార్ టీజ‌ర్ రిలీజ్ ఎప్పుడంటే ?

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!