ప్ర‌భాస్ (Prabhas) సినిమా స‌లార్ నుంచి మైండ్ బ్లాక్ అయ్యే అప్‌డేట్.. ఏంటంటే

Updated on Jun 16, 2022 04:36 PM IST
స‌లార్ (Prabhas) సినిమాలో రెండు డిఫెరెంట్ క్యారెక్ట‌ర్‌లో ప్ర‌భాస్ వెండితెర‌పై క‌నువిందు చేయ‌నున్నారు. 
స‌లార్ (Prabhas) సినిమాలో రెండు డిఫెరెంట్ క్యారెక్ట‌ర్‌లో ప్ర‌భాస్ వెండితెర‌పై క‌నువిందు చేయ‌నున్నారు. 

పాన్ ఇండియా హీరో ప్ర‌భాస్ (Prabhas) న‌టిస్తున్న స‌లార్ సినిమా నుంచి ఓ క్రేజీ అప్‌డేట్ అందింది. కేజీఎఫ్ సినిమాల‌తో సినిమా రికార్డులు బ‌ద్ద‌లు కొట్టిన ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ స‌లార్ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. ప్ర‌భాస్ స‌లార్ సినిమాలో డ‌బుల్ రోల్‌లో న‌టిస్తున్నారు. స‌లార్ సినిమాలో రెండు డిఫెరెంట్ క్యారెక్ట‌ర్‌లో ప్ర‌భాస్ వెండితెర‌పై క‌నువిందు చేయ‌నున్నారు. 

డ‌బుల్ రోల్‌లో ప్రభాస్!
కేజీఎఫ్ చాప్ట‌ర్ 2 సినిమాతో ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ బ‌డా డైరెక్ట‌ర్‌గా మారారు. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ హీరోగా స‌లార్ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. స‌లార్‌లో ప్ర‌భాస్ ద్విపాత్రాభిన‌యం చేయ‌నున్నారు. పాత‌, కొత్త త‌రాల‌కు చెందిన రెండు విభిన్న‌మైన పాత్ర‌ల్లో ప్ర‌భాస్ న‌టించ‌నున్నారు. అందుక‌నే ప్ర‌భాస్ మొన్న‌టి వ‌ర‌కు కాస్త హెవీగా క‌నిపించారు. ప్ర‌స్తుతం స్లిమ్ లుక్‌లోకి మారారు. అంటే పాత త‌రం క్యారెక్ట‌ర్ కోసం ప్ర‌భాస్ (Prabhas) అలా మారార‌నే టాక్ వినిపిస్తుంది.
 

స‌లార్ (Prabhas) సినిమాలో రెండు డిఫెరెంట్ క్యారెక్ట‌ర్‌లో ప్ర‌భాస్ వెండితెర‌పై క‌నువిందు చేయ‌నున్నారు. 

ప్ర‌భాస్ లుక్‌ను హైలెట్ చేస్తున్న డైరెక్ట‌ర్
'రాధేశ్యామ్' సినిమాలో ప్ర‌భాస్ (Prabhas) లుక్‌పై నెగెటివ్ టాక్ వ‌చ్చింది. ప్ర‌భాస్ కూడా కాస్త భారీ ప‌ర్స‌నాలిటీతో క‌నిపించారు. కొన్ని సీన్ల‌లో ప్ర‌భాస్ లుక్ అంత న‌చ్చ‌లేదు. దీంతో ఫ్యాన్స్ కూడా నిరాశ చెందారు. 

ప్ర‌భాస్ లుక్‌పై వ‌చ్చిన కామెంట్లు ప్ర‌శాంత్ నీల్ వ‌ర‌కు చేరాయనిపిస్తుంది. ఎందుకంటే ప్ర‌భాస్ లుక్‌పై ఉన్న నెగెటివ్ టాక్‌ను పాజిటివ్‌గా మార్చాల‌ని నీల్ ప్లాన్ చేస్తున్నారు. అందుకు త‌గ్గట్టుగానే ప్ర‌భాస్‌ను తీర్చిదిద్దుతున్నారు. 

స‌లార్ సినిమా కోసం  హీరో ప్ర‌భాస్ (Prabhas) బ‌రువు కూడా త‌గ్గారు.  స్లిమ్ లుక్, సిక్స్ ప్యాక్‌తో స్టైలిష్‌గా క‌నిపిస్తున్నారు. ఇక రెండు పాత్ర‌ల్లో ప్ర‌భాస్ లుక్‌కు పూర్తిగా డిఫెరెంట్‌గా క‌నిపించేలా చేస్తున్నారు ప్ర‌భాస్.

హీరోలు సినిమా సినిమాకు త‌మ వెయిట్, లుక్‌ను ఛేంజ్ చేసుకుంటారు. క్యారెక్ట‌ర్‌ను బ‌ట్టి వెయిట్‌లో మార్పులు చేసుకుంటూ ఉంటారు. ప్ర‌భాస్ కూడా 'బాహుబ‌లి' కోసం వెయిట్ పెరిగారు. ఆ త‌ర్వాత 'సాహో'లో కాస్త స్లిమ్‌గా క‌నిపించారు. రాధేశ్యామ్‌లో ప్ర‌భాస్ చాలా బరువు పెరిగిన‌ట్టు క‌నిపించారు. ఇక 'స‌లార్‌'లో మాత్రం ప్ర‌భాస్‌ను మ‌రింత అందంగా చూపించాల‌ని ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ అనుకుంటున్నార‌ని టాక్.

ప్ర‌భాస్ కొత్త ప్రాజెక్టులు
ప్ర‌భాస్ (Prabhas) బాలీవుడ్ ద‌ర్శ‌కుడు ఓం రౌత్ తెర‌కెక్కిస్తున్న ఆదిపురుష్‌లో న‌టిస్తున్నారు. నాగ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో ప్రాజెక్ట్ కెలో హీరో ప్ర‌భాసే. ఇక మారుతీ డైరెక్ష‌న్‌లో ఓ సినిమా, అర్జున్ రెడ్డి ఫేం సురేంద‌ర్ రెడ్డితో స్పిరిట్ సినిమాను ప్ర‌భాస్ చేయ‌నున్నారు. 

Read More : ఇంత స్లిమ్ లుక్ ఏంటి డార్లింగ్ అంటున్న ప్ర‌భాస్ (Prabhas) ఫ్యాన్స్.. ఆదిపురుష్ టీమ్‌కు ఓం రౌత్ పార్టీ

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!