ప్ర‌భాస్ (Prabhas) పెళ్లి పై కృష్ణం రాజు ప్ర‌క‌ట‌న ఇవ్వ‌నున్నారా? ఈ సంవ‌త్స‌రంలోనే డార్లింగ్ మ్యారేజా ?

Updated on Jun 12, 2022 04:35 PM IST
ప్ర‌భాస్‌  (Prabhas) కు వాళ్ల పెద్ద‌నాన్న కృష్ణం రాజు ఈ ఏడాదిలో పెళ్లి చేస్తారని ఓ అభిమాని చెప్పారు.
ప్ర‌భాస్‌ (Prabhas) కు వాళ్ల పెద్ద‌నాన్న కృష్ణం రాజు ఈ ఏడాదిలో పెళ్లి చేస్తారని ఓ అభిమాని చెప్పారు.

ప్రభాస్.. ఇప్పుడు పాన్ ఇండియా లెవల్‌లో పెద్ద హీరో. టాలీవుడ్ పరిశ్రమకు 'ఈశ్వర్' అనే చిత్రంతో పరిచయమైన ప్రభాస్.. అనతికాలంలోనే స్టార్ హొదాను కైవసం చేసుకున్నారు. ఛత్రపతి, మిస్టర్ పర్ఫెక్ట్, బుజ్జిగాడు, బిల్లా, మిర్చి, డార్లింగ్ లాంటి సినిమాలు ప్రభాస్ ఇమేజ్‌ను అమాంతం పెంచాయి. ఇక రాజమౌళి చిత్రం 'బాహుబలి'లో నటించాక, ప్రభాస్ రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. ఇప్పుడు ఆలిండియా స్థాయిలో ప్రభాస్‌కు ఫ్యాన్స్ ఉన్నారు.

దక్షిణాదితో పాటు ఉత్తరాదిలో కూడా ప్రభాస్ సినిమాలు రిలీజ్ అయితే చాలు.. 'డార్లింగ్' అభిమానులు చేసే సందడి అంతా ఇంతా కాదు.  'బాహుబలి' సినిమా విజయం సాధించాక, ప్రభాస్ పై ఇంకా ఒత్తిడి పడింది. ఆయన నటించిన సాహో, రాధే శ్యామ్ చిత్రాలు బాక్సాఫీసు వద్ద పెద్ద ప్రభావం ఏమీ చూపించలేదు. ప్రస్తుతం ప్రభాస్.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'సలార్' చిత్రంలో నటిస్తున్నారు. 

అలాగే నేడు టాలీవుడ్‌లో ప్ర‌భాస్  (Prabhas) పెళ్లి పెద్ద హాట్ టాపిక్ అయింది. మ్యారేజ్‌ కాని ప్ర‌తీ హీరో ప్ర‌భాస్ త‌ర్వాతే త‌మ పెళ్లి అంటున్నారు. ప్ర‌భాస్‌కు ఈ సంవ‌త్స‌రంలోనే పెళ్లి చేయాల‌ని కుటుంబ స‌భ్యులు నిర్ణ‌యించారా? అన్నది పెద్ద జవాబు లేని ప్రశ్నగా మారిపోయింది. అయితే ప్ర‌భాస్ పెళ్లి వేడుక గురించి త్వరలోనే వాళ్ల పెద్ద‌నాన్న కృష్ణం రాజు ప్ర‌క‌టిస్తార‌నే టాక్ వినిపిస్తుంది. 

కృష్ణం రాజు ప్రకటన కోసం వెయిటింగ్

తెలుగు సినిమా పరిశ్ర‌మ‌లో రెబ‌ల్ స్టార్‌గా సీనియ‌ర్ హీరో కృష్ణం రాజు ఓ వెలుగు వెలిగారు. ఎన్నో హిట్ సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌కు వినోదం అందించారు. కృష్ణంరాజు త‌మ్ముడి కుమారుడు ప్ర‌భాస్. ప్ర‌భాస్ కూడా పెద్ద‌నాన్న‌లానే సినిమానే కెరీర్‌గా ఎంచుకున్నారు. టాలీవుడ్‌లో స‌క్సెస్‌ఫుల్ హీరోగా కొన‌సాగుతున్నారు. ఇటీవలి కాలంలో వెస్ట్ గోదావ‌రి జిల్లాకు చెందిన ప్ర‌భాస్ అభిమానులు చెప్పిన మాట‌లు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. ప్ర‌భాస్ పెళ్లి ఈ ఏడాదిలో జ‌రుగుతుంద‌ని.. ఆ విష‌యాలు కృష్ణం రాజు వెల్ల‌డిస్తార‌ని వారు సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ చేశారు. 

ప్ర‌భాస్‌ పెళ్లి ఎందుకు లేట్ అయింది ? 

ప్రభాస్ (Prabhas), అనుష్క ఇద్ద‌రూ ప్రేమించుకుంటున్నార‌ని ఎన్నో రోజులుగా ఓ గాసిప్ న‌డుస్తోంది. వీరి పెళ్లికి కృష్ణంరాజు ఒప్పుకోవ‌డం లేద‌నే టాక్ కూడా వినిపించింది. అయితే అది అవాస్తవమని తర్వాత తెేలింది.  కృష్ణంరాజుతో పాటు కుటుంబంలోని పెద్ద‌లు నిర్ణ‌యించిన అమ్మాయినిచ్చే ప్ర‌భాస్‌కు పెళ్లి జ‌రుపుతార‌నేది విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే, ఈ వార్త సోషల్ మీడియాలో బాగా సర్క్యులేట్ కావడంతో, ప్ర‌భాస్ పెళ్లి వార్త త‌మ‌కు ఎంతో సంతోషానిచ్చింద‌ని ఫ్యాన్స్ ఆనంద‌ప‌డుతున్నారు. ప్రేమ పెళ్లి అయినా.. లేక పెద్ద‌లు కుదిర్చిన సంబంధం అయినా 'డార్లింగ్' పెళ్లి అయితే చాలంటున్నారు ఫ్యాన్స్. 

ప్ర‌భాస్ వ‌రుస సినిమాల‌తో ప్ర‌స్తుతం చాలా బిజీగా ఉన్నారు. కేజీఎఫ్ సినిమా ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్‌ తీస్తున్న 'స‌లార్' సినిమాలో నటిస్తున్నారు . ఇక బాలీవుడ్ బ‌డా డైరెక్ట‌ర్ ఓం రౌత్‌తో డార్లింగ్ 'ఆదిపురుష్' సినిమా చేస్తున్నారు. ఈ రెండు సినిమాలు అత్యంత భారీ బ‌డ్జెట్‌తో తీస్తున్నారు. 

ఇంత‌కీ ప్ర‌భాస్ పెళ్లిపై ఏమ‌న్నారు?
రాధేశ్యామ్ ప్ర‌మోష‌న్ల‌కు ముంబై వ‌చ్చిన ప్ర‌భాస్  (Prabhas) త‌న పెళ్లిపై ఓ కామెంట్ చేశారు. త‌న ప్రేమకు సంబంధించిన అంచ‌నాలు ఎప్పుడూ త‌ప్ప‌వుతాయ‌ని ప్ర‌భాస్ అన్నారు. అందుకే త‌న‌కు ఇంకా పెళ్లి కాలేద‌ని చెప్పారు. దీంతో, ప్రేమలో ఫెయిల్ అయ్యాన‌ని ప్ర‌భాస్ చెప్ప‌క‌నే చెప్పినట్లు అయ్యింది. ఏదేమైనా, హీరోగా ప్ర‌భాస్ మంచి స‌క్సెస్ సాధించాల‌ని.. అలాగే త‌న ప‌ర్స‌న‌ల్ లైఫ్‌ విషయానికి వస్తే, త్వరగా పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వాల‌ని డార్లింగ్ అభిమానులు కోరుకుంటున్నారు. 

Read More: ఆదిపురుష్ (Adipurush )లో కృష్ణంరాజు న‌టిస్తున్నార‌ట‌.. ప్ర‌భాస్‌కు ఏమ‌వుతారో తెలుసా!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!