Highest Paid Tollywood Heroes : 2022లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకున్న తెలుగు హీరోలపై ప్రత్యేక కథనం..

Updated on Nov 27, 2022 06:28 PM IST
Highest Paid Tollywood Heroes : టాలీవుడ్ హీరోలలో 2022లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకున్న హీరో ప్రభాస్. రెండో స్థానంలో అల్లు అర్జున్ ఉన్నారు.
Highest Paid Tollywood Heroes : టాలీవుడ్ హీరోలలో 2022లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకున్న హీరో ప్రభాస్. రెండో స్థానంలో అల్లు అర్జున్ ఉన్నారు.

Highest Paid Tollywood Heroes : తెలుగు సినిమా రంగంలో హీరోల పాత్ర చాలా ముఖ్యమైనది. సినిమా హిట్లా లేక ఫట్టా అనే విషయాలు ఎక్కువ శాతం హీరోలపై ఆధారపడి ఉంటాయి. తెలుగు కథానాయకులు ఎంచుకునే కథలను బట్టి ఆ సినిమా సక్సెస్ ఆధారపడి ఉంటుంది. 'బాహుబలి', 'బాహుబలి 2', 'పుష్ప', 'ఆర్ఆర్ఆర్' సినిమాలతో మన టాలీవుడ్ హీరోలు పాన్ ఇండియా స్టార్లుగా మారారు. పాన్ ఇండియా హీరోలైతే వారు తీసుకునే రెమ్యునరేషన్ కూడా భారీగానే ఉంటుంది.

తెలుగు సినిమాలు వందల కోట్ల రూపాయలతో పాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కుతున్నాయి. అలాగే వేల కోట్ల రూపాయలలో కలెక్షన్లు సాధిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టాలీవుడ్ హీరోల రెమ్యునరేషన్ కూడా హాట్ టాపిక్‌గా మారింది. 2022లో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోలపై పింక్ విల్లా ప్రత్యేక కథనం.

ప్రభాస్ (Prabhas)

1. ప్రభాస్ -  రూ. 100 కోట్లు

టాలీవుడ్ హీరో ప్రభాస్ రెబల్ స్టార్‌గా తెలుగు సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం  పాన్ ఇండియా స్టార్‌గా మారారు. పాన్ ఇండియా హీరో అంటే రెమ్యునరేషన్ కూడా ఎక్కువగానే ఉంటుంది. 2022లో ప్రభాస్ నటించిన సినిమా 'రాధే శ్యామ్' విడుదలైంది. ఈ సినిమా బడ్జెట్ కూడా ఈ సినిమా కోసం ప్రభాస్ రూ. 100 కోట్లు తీసుకున్నారట. 

2022లో ప్రభాస్ మరో ప్రతీష్టాత్మక సినిమా 'ఆదిపురుష్'లో నటిస్తున్నారు. 'ఆదిపురుష్' చిత్రంలో నటించినందుకు రూ.150 కోట్లు తీసుకున్నారట. టాలీవుడ్ హీరోలలో రెమ్యునరేషన్ విషయంలో ప్రభాస్ అగ్ర స్థానంలో ఉన్నారు. ప్రభాస్ కొత్త ప్రాజెక్టులైన సలార్, ప్రాజెక్ట్ కె, స్పిరిట్ సినిమాలు భారీ బడ్జెట్‌తో తెరకెక్కకుతున్నాయి.  

అల్లు అర్జున్ (Allu Arjun)

2. అల్లు అర్జున్ - రూ. 75 కోట్లు

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప' సినిమాతో సౌత్ ఇండియాతో పాటు నార్త్ ఇండియాలోనూ ఫేమస్ హీరోగా మారారు. అల్లు అర్జున్ 'పుష్ప' సినిమా కోసం రూ. 75 కోట్లు పారితోషికం తీసుకున్నారని సమాచారం. 'పుష్ప - ది రైజ్' సినిమాకు సీక్వెల్‌గా దర్శకుడు సుకుమార్ 'పుష్ప2' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో నటిస్తున్న అల్లు అర్జున్‌కు రూ. 100 కోట్ల రెమ్యునరేషన్ ఇస్తున్నారట. 

'పుష్ప 2' సినిమాతో పాటు అల్లు అర్జున్ దర్శకులు బోయపాటి శ్రీను, కొరటాల శివ, ఎ.ఆర్.మురుగుదాస్ సినిమాలలో నటించనున్నారు.

మహేష్ బాబు (Mahesh Babu)

3. మహేష్ బాబు - రూ. 70 కోట్లు

టాలీవుడ్ హీరోలలో భారీ స్థాయిలో రెమ్యునరేషన్ అందుకుంటున్న హీరోలలో మహేష్ బాబు ఒకరు. 2022లో మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట బ్లాక్ బాస్టర్ హిట్ సాధించింది. ఈ సినిమాకుగానూ మహేష్ రూ. 70 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నారు. 

మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న SSMB28 చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాతో పాటు దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న అడ్వెంచర్ థ్రిల్లర్ సినిమా SSMB29లో నటిస్తున్నారు. ఈ సినిమాలకు మహేష్ రూ. 100 కోట్లు తీసుకున్నంటున్నారని టాక్.

పవన్ కల్యాణ్ (Pawan Kalyan)

4. పవన్ కల్యాణ్ - రూ. 60 కోట్లు 

టాలీవుడ్‌లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ ఉన్న హీరోలలో పవన్ కల్యాణ్ ఒకరు. పవన్ కల్యాణ్ చాలా రోజులు గ్యాప్ తీసుకుని వకీల్ సాబ్ సినిమాతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చారు. భీమ్లా నాయక్ సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్నారు. పవన్ కల్యాణ్ ఒక్కో సినిమాకు రూ. 60 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటారట. 

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కల్యాణ్ దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు సినిమాలో నటిస్తున్నారు. అలాగే సురేంద్రరెడ్డి దర్శకత్వంలో భవధీయుడు భగత్‌సింగ్ సినిమాలో నటించనున్నారు. 

జూనియర్ ఎన్టీఆర్

5. జూనియర్ ఎన్టీఆర్ - రూ. 50 కోట్లు

'ఆర్ఆర్ఆర్' సినిమాలో కొమురం భీముడిగా నటించి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు సంపాదించుకున్నారు ఎన్టీఆర్. ఎన్టీఆర్ ఒక్కో సినిమాకు రూ. 50 కోట్లు పారితోషికం తీసుకుంటారని సమాచారం. 'ఆర్ఆర్ఆర్' సినిమా పాన్ ఇండియా లెవల్‌లో సక్సెస్ సాధించింది. ఈ సినిమా కోసం రూ.50 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ దర్శకులు ప్రశాంత్ కిషోర్, కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాల్లో నటిస్తున్నారు. 

 

రామ్ చరణ్  (Ram Charan)

6. రామ్ చరణ్ - రూ. 50 కోట్లు

'రౌద్రం రణం రుధిరం' (ఆర్ఆర్ఆర్) (RRR) సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించిన రామ్ చరణ్ ప్రపంచ వ్యాప్తంగా మంచి పేరు సంపాదించుకున్నారు. 2022లో రామ్ చరణ్ 'ఆర్ఆర్ఆర్', 'ఆచార్య' సినిమాల్లో నటించారు. 'ఆర్ఆర్ఆర్' చిత్రం బ్లాక్ బాస్టర్ హిట్ సాధించగా... తండ్రి చిరంజీవితో కలిసి మొదటి సారి నటించిన 'ఆచార్య' సినిమా ఫ్లాప్ అయింది. 

'ఆర్ఆర్ఆర్' సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిన రామ్ చరణ్.. ఈ సినిమా కోసం రూ. 50 కోట్లకు పైగా పారితోషికం తీసుకున్నారట. 

విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)

7. విజయ్ దేవరకొండ - రూ. 35 కోట్లు

రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఒక్కో సినిమాకు రూ. 35 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటారు. 2022లో విడుదలైన పాన్ ఇండియా సినిమా 'లైగర్'.. విజయ్‌కు డిజాస్టర్‌గా మిగిలింది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ 'ఖుషీ' సినిమాలో నటిస్తున్నారు. 'లైగర్' తెరకెక్కించన దర్శకుడు పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ మరో సినిమా చేయనున్నారు. ఈ సినిమాకు 'జనగణమన' అనే టైటిల్ ఖారరు చేశారు. 

చిరంజీవి (Chiranjeevi)

8. చిరంజీవి - రూ. 25 కోట్లు

తెలుగు సినిమా పరిశ్రమలో ఎన్నో ఏళ్ల నుంచి హీరోగా కొనసాగుతున్నారు మెగాస్టార్ చిరంజీవి. చిరంజీవి 'ఖైదీ నంబర్ 150'తో మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చారు. 2022లో విడుదలైన 'ఆచార్య' సినిమా చిరుకు ఫ్లాప్‌గా మిగిలింది. ఇక ఇదే ఈ ఏడాది రిలీజ్ అయిన 'గాడ్ ఫాదర్' సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ ఇచ్చింది. చిరంజీవి రెమ్యునరేషన్ ఒక్కో సినిమాకు రూ. 22 కోట్లు నుంచి రూ. 30 కోట్లు ఉంటుందట.

రవితేజ (Ravi Teja)

9. రవితేజ - రూ. 15 కోట్లు

మాస్ మహారాజ రవితేజ సినిమాలు ప్రత్యేకంగా ఉంటాయి. మాస్ యాక్షన్‌తో పాటు కామెడీ రవితేజ సినిమాల్లో హైలెట్‌గా ఉంటుంది. ప్రతి సంవత్సరం రవితేజ రెండు లేక మూడు సినిమాల్లో నటిస్తుంటారు. ఈ ఏడాది రవితేజ నటించిన 'రామారావు ఆన్ డ్యూటీ' రిలీజ్ అయింది. ఒక్కో సినిమా కోసం రవితేజ రూ.15 కోట్ల నుంచి రూ. 20 కోట్ల పారితోషికం తీసుకుంటారు. ప్రస్తుతం రవితేజ 'రావణాసుర', 'టైగర్ నాగేశ్వరరావు' సినిమాల్లో నటిస్తున్నారు.

 

నాని (Nani)

10. నాని - రూ. 10 కోట్లు

నేచురల్ స్టార్ నాని ఫ్యామిలీ ఎంటర్‌టైన్ సినిమాలతో టాలీవుడ్‌ (Tollywood) ప్రేక్షకులను అలరిస్తుంటారు. ఈ సంవత్సరం నాని నటించిన 'అంటే సుందరానికీ' సినిమా రిలీజ్ అయింది. నాని ఒక్కో సినిమాకు దాదాపు రూ. 10 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటారట. ప్రస్తుతం 'దసరా' సినిమాలో నాని నటిస్తున్నారు.

Read More: Tollywood: ఈ ఏడాది రూ. 100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన తెలుగు సినిమాలపై ప్రత్యేక కథనం..

 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!