‘ప్రాజెక్ట్‌ K’ సినిమా సెట్‌ నుంచి లంబోర్గిని కారులో దూసుకెళ్లిన ప్రభాస్‌ (Prabhas).. వీడియో వైరల్‌

Updated on Jul 21, 2022 05:56 PM IST
ప్రాజెక్ట్‌ కె సినిమా షూటింగ్ సెట్‌ నుంచి లంబోర్గిని కారులో వేగంగా వెళుతున్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas)
ప్రాజెక్ట్‌ కె సినిమా షూటింగ్ సెట్‌ నుంచి లంబోర్గిని కారులో వేగంగా వెళుతున్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas)

బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్‌‌గా ఎదిగారు రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas). ఆ సినిమా తర్వాత ఆయన ఏ సినిమా చేసినా పాన్ ఇండియా రేంజ్‌లోనే విడుదలవుతోంది. ఇక, అప్పటి నుంచి అన్నీ భారీ బడ్జెట్ సినిమాలే ప్రభాస్‌ దగ్గరకు వస్తున్నాయి.

బాహుబలి సిరీస్‌ తర్వాత ప్రభాస్.. సాహో, రాధే శ్యామ్‌ సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇవి కూడా భారీ బడ్జెట్‌తోనే తెరకెక్కాయి. వీటిలో సాహో పర్వాలేదని అనిపించినా.. రాధే శ్యామ్ సినిమా మాత్రం సినీ ప్రేమికులనే కాకుండా ప్రభాస్ అభిమానులను కూడా నిరాశ పరిచింది.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) ప్రాజెక్ట్‌ కె సినిమా పోస్టర్

అన్నీ భారీ బడ్జెట్ సినిమాలే..

ప్రస్తుతం ప్రభాస్‌ చేతిలో ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్‌ కె వంటి భారీ బడ్జెట్‌ సినిమాలు ఉన్నాయి. ఆదిపురుష్‌ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి కాగా, సలార్, ప్రాజెక్ట్‌ కె సినిమాలు సెట్స్‌పై ఉన్నాయి. ప్రాజెక్ట్‌ కె సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. హైదరాబాద్‌ రామోజీ ఫిల్మ్‌ సిటీలో ప్రాజెక్ట్‌ కె సినిమాకు సంబంధించిన హై ఆక్టేన్ యాక్షన్‌ సీన్లను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు నాగ్ అశ్విన్.

ప్రభాస్‌ (Prabhas) సరసన దీపికా పడుకొనె హీరోయిన్‌గా నటిస్తున్న ‘ప్రాజెక్ట్‌ కె’ సినిమా షూటింగ్ స్పాట్‌లో ఒక వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ పూర్తయిన తర్వాత సెట్స్‌ నుంచి ప్రభాస్ వెళుతున్న సీన్స్ బయటకు వచ్చాయి.

మెరుపువేగంతో వెళుతున్న కారు వీడియో..

ప్రాజెక్ట్‌ కె సినిమా సెట్స్‌ నుంచి లంబోర్గిని కారులో ప్రభాస్ స్పీడ్‌గా బయటకు వెళుతున్న వీడియో ట్రేడ్ అనలిస్ట్ మనోబాల విజయబాలన్ ట్విటర్‌‌లో షేర్ చేశారు. కేవలం ఐదు సెకన్లు మాత్రమే ఉన్న ఈ వీడియోలో కారు చాలా స్పీడ్‌గా వెళుతుండడాన్ని మనం చూడచ్చు.

అయితే ప్రభాస్‌ ఆ కారులో ఉన్నారా లేరా అనేది కనిపించడంలేదు. రాత్రి పూట కావడంతోపాటు కారు అత్యంత వేగంగా వెళుతుండడంతో అందులో ఉన్న వాళ్లు ఎవరు అనేది తెలియడం లేదు.

ప్రభాస్‌ (Prabhas) హీరోగా నటిస్తున్న ‘ప్రాజెక్ట్‌ కె’ సినిమాలో హైలైట్‌గా నిలిచే యాక్షన్‌ సీన్లను ఇక్కడ చిత్రీకరించారని తెలుస్తోంది. ఈ సీన్ల చిత్రీకరణ కోసం ఫెరారీ, లంబోర్గిని కార్లను ప్రత్యేకంగా ఫారిన్ నుంచి తీసుకొచ్చారని ఇటీవల మీడియాలో వార్తలు కూడా వచ్చాయి. ఈ సినిమాలో అమితాబ్‌బచ్చన్ మరో కీలక పాత్రలో నటిస్తున్నారు.

Read More : నేచురల్‌ స్టార్‌‌ నాని (Nani) హీరోగా నటిస్తున్న ‘దసరా’ సినిమాలో నెగెటివ్ క్యారెక్టర్‌‌లో పూర్ణ!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!