ప్రభాస్ (Prabhas) ఫ్యాన్స్‌ కోసం ‘సలార్‌‌’ సినిమాలో హై ఆక్టేన్ యాక్షన్ సీన్స్ ప్లాన్ చేసిన ప్రశాంత్ నీల్ !

Updated on Jul 18, 2022 06:16 PM IST
సలార్‌‌ సినిమాలో ప్రభాస్ (Prabhas) మీద భారీ యాక్షన్ సీన్స్‌ను తెరకెక్కించేందుకు ప్రయత్నిస్తున్నారు దర్శకుడు ప్రశాంత్ నీల్
సలార్‌‌ సినిమాలో ప్రభాస్ (Prabhas) మీద భారీ యాక్షన్ సీన్స్‌ను తెరకెక్కించేందుకు ప్రయత్నిస్తున్నారు దర్శకుడు ప్రశాంత్ నీల్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) ప్రస్తుతం ‘సలార్’ సినిమాను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నారు.ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కాబోతోంది. హై ఆక్టేన్ యాక్షన్ థ్రిల్లర్‌గా సలార్ సినిమా రూపొందుతోంది.

ప్రభాస్ సరసన శ్రుతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. జగపతిబాబు కీలక పాత్ర పోషిస్తున్నారు. కేజీఎఫ్, కేజీఎఫ్‌2 సినిమాలతో గుర్తింపు పొందిన ప్రశాంత్‌ నీల్‌ సలార్ సినిమాకు దర్శకత్వం వహిస్తుండడంతో ఈ సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి.

ఈ సినిమాలో ప్రభాస్ లుక్, మేకవర్‌ ఫోటోలు కొన్ని లీక్ అయ్యాయనే సంగతి తెలిసిందే. ఆ ఫోటోలు లీక్ అయినప్పటి నుంచి సినిమాపై హైప్ మరింత ఎక్కువైంది. తాజాగా సలార్ సినిమాకు సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది.

ప్రశాంత్‌ నీల్,  ప్రభాస్ (Prabhas), శృతి హాసన్

షూటింగ్ పూర్తి చేయనున్న ప్రభాస్..

‘సలార్’ సినిమాలో ప్రభాస్ క్యారెక్టర్‌‌కు సంబంధించిన షూటింగ్ త్వరలోనే పూర్తికానుందని టాక్. త్వరలో జరగబోయే షెడ్యూల్‌తో చిత్రం టాకీ పార్ట్ మొత్తం కంప్లీట్ అవుతుందని సమాచారం. ఈ షెడ్యూల్‌లో లోయ బ్యాక్ డ్రాప్‌లో ఒక భారీ యాక్షన్ సీక్వెల్‌ను చిత్రీకరించబోతుందట చిత్ర యూనిట్.

ఇదే షెడ్యూల్‌లో ప్రభాస్‌పై పలు ఛేజింగ్ సీన్లను కూడా చిత్రీకరించనున్నారని తెలుస్తోంది. సముద్రం లోపల చిత్రీకరించిన యాక్షన్ పార్ట్ సినిమాకు హైలైట్‌గా నిలుస్తుందని సమాచారం.

బొగ్గు గనుల మాఫియా నేపథ్యంలో ఆసక్తికరమైన కథకథనాలతో భారీ యాక్షన్ సీన్స్‌ను తెరకెక్కిస్తున్నారు ప్రశాంత్‌ నీల్. ఇటీవల వచ్చిన ‘రాధేశ్యామ్‌’ సినిమా‌లో ఒక్క యాక్షన్ సీన్ కూడా లేకపోవడంతో అభిమానులు నిరాశచెందారు. ‘సలార్’ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్‌లు అభిమానులను అలరిస్తాయని చెబుతున్నారు మేకర్స్.

హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ నిర్మాణంలో ‘సలార్’ సినిమా తెరకెక్కుతోంది. రవిబస్రూర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో మధు గురుస్వామి, ఈశ్వరీరావు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ప్రభాస్‌ (Prabhas) హీరోగా చేస్తున్న సలార్ సినిమాను వచ్చే ఏడాది విడుదల చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ‘కేజీఎఫ్’ తరహాలోనే డార్క్ సెంట్రిక్ థీమ్‌తో సలార్‌‌ సినిమాను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు ప్రశాంత్ నీల్. లైటింగ్ పేట్రన్, కలర్ ప్యాలెట్ సినిమాలో డార్క్‌గా కనిపిస్తుంది. ఈ తరహా టెక్నిక్‌తో తెరకెక్కుతున్న మొదటి ఇండియన్ ఫిల్మ్ ‘సలార్’ .

Read More : Prabhas: ప్రభాస్, అమితాబ్‌, నాని.. అభిమాన తారలంతా ఒకే ఫ్రేమ్‌లో.. సంబరపడిపోతున్న ఫ్యాన్స్‌!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!