ప్రభాస్ (Prabhas) ‘ప్రాజెక్ట్‌- K’ సినిమా షూటింగ్‌ రామోజీ ఫిలిం సిటీలో.. వందల మందితో గ్రాండ్‌గా షూటింగ్

Updated on Jul 20, 2022 12:40 AM IST
ప్రభాస్ (Prabhas) ‘ప్రాజెక్ట్‌- K’ సినిమా షూటింగ్‌ రామోజీ ఫిలిం సిటీలో వందల మంది నటీనటుల మధ్య గ్రాండ్‌గా జరుగుతోంది
ప్రభాస్ (Prabhas) ‘ప్రాజెక్ట్‌- K’ సినిమా షూటింగ్‌ రామోజీ ఫిలిం సిటీలో వందల మంది నటీనటుల మధ్య గ్రాండ్‌గా జరుగుతోంది

వరుస సినిమా షూటింగ్‌లతో బిజీబిజీగా ఉన్నారు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas). ప్రస్తుతం మూడు సినిమాలు లైన్‌లో పెట్టారు. వాటిలో ‘ప్రాజెక్ట్‌ కె’ ఒకటి. నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా భారీ బడ్జెట్‌తో రూపొందుతోంది. ప్రస్తుతం ప్రాజెక్ట్‌ కె సినిమా షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది.

సాహో సినిమా తర్వాత ప్రభాస్‌ నటించిన సినిమా ‘రాధేశ్యామ్’. నాలుగు సంవత్సరాల గ్యాప్ తర్వాత వచ్చిన సినిమా కావడంతో అభిమానులు ఈ సినిమాపై భారీ అంచనాలే పెట్టుకున్నారు. అయితే ఈ సినిమా ఫలితంతో వాళ్లు నిరాశ చెందారు. భారీ అంచనాల మధ్య రిలీజైన రాధేశ్యామ్‌ సినిమా బాక్సాఫీస్‌ దగ్గర బోల్తా పడింది.

ప్రభాస్ (Prabhas) ‘ప్రాజెక్ట్‌- K’ సినిమా షూటింగ్‌ షూటింగ్‌ రామోజీ ఫిలిం సిటీలో

మరింత ఫోకస్‌ పెట్టి..

ప్రభాస్ (Prabhas), దీపికా పదుకొనె హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతోన్న సినిమా ‘ప్రాజెక్ట్‌ కె’. రామోజీ ఫిలిం సిటీలో జరుగుతున్న షూటింగ్‌లో ప్రభాస్ ఇంట్రో సీన్ ఇప్పటికే పూర్తయ్యిందని డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెలిపారు. ప్రభాస్, దీపికా పదుకొనె ఇద్దరిపై సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. నటీనటులతోపాటు వందల మంది షూటింగ్‌లో పాల్గొంటున్నారు. అమితాబ్‌బచ్చన్ కీలకపాత్రలో నటిస్తున్నారు. స్పై థ్రిల్లర్‌‌గా తెరకెక్కుతున్న ప్రాజెక్ట్‌ కె సినిమాను వైజయంతీ మూవీస్ బ్యానర్‌‌పై అశ్వనీదత్ నిర్మిస్తున్నారు. ఈ ఏడాదిలోనే షూటింగ్ మొత్తం పూర్తి చేసి వచ్చే ఏడాది ప్రాజెక్ట్‌ కె సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.

 ఇక  ప్రభాస్ న‌టించిన మరో సినిమా ‘ఆదిపురుష్’. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడ‌క్షన్ ప‌నులు జరుగుతున్నాయి. ఓం రౌత్ ద‌ర్శక‌త్వంలో తెర‌కెక్కిన ఆదిపురుష్‌ సినిమా సంక్రాంతి కానుక‌గా విడుద‌ల కానుంది. ఈ రెండు సినిమాలతోపాటు ప్రభాస్ (Prabhas), ప్రశాంత్ నీల్ ద‌ర్శక‌త్వంలో ‘స‌లార్’ సినిమా చేస్తున్నాడు. యాక్షన్‌ ఎంట‌ర్‌‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతున్న ఈ సినిమా షూటింగ్‌ 50% పూర్తయ్యిందని టాక్.

Read More : మహేష్‌బాబు (MaheshBabu) ఫ్యాన్స్‌కు బర్త్‌డే గిఫ్ట్..థియేటర్లలో సందడి చేయనున్న ‘ఒక్కడు’ సినిమా!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!