నేచురల్‌ స్టార్‌‌ నాని (Nani) హీరోగా నటిస్తున్న ‘దసరా’ సినిమాలో నెగెటివ్ క్యారెక్టర్‌‌లో పూర్ణ!

Updated on Jul 20, 2022 06:27 PM IST
నేచురల్‌ స్టార్ నాని (Nani) ‘దసరా’ సినిమాలో నెగెటివ్‌ రోల్‌ పోషించనున్న నటి పూర్ణ
నేచురల్‌ స్టార్ నాని (Nani) ‘దసరా’ సినిమాలో నెగెటివ్‌ రోల్‌ పోషించనున్న నటి పూర్ణ

నేచురల్ స్టార్ నాని (Nani) నటిస్తున్న కొత్త సినిమా ‘దసరా’. శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాకు దర్శకత్వం  వహిస్తున్నారు. శ్రీలక్ష్మీ వెంకటేశ్వరా సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి దసరా సినిమాను నిర్మిస్తున్నారు. కీర్తి సురేశ్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇప్పటివరకు ఎప్పుడూ లేనంత మాస్ లుక్‌లో అభిమానులను అలరించడానికి రెడీ అవుతున్నారు నాని.

సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో ఆసక్తికరమైన కథకథనాలతో దసరా సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే విడుదలైన ‘దసరా’ సినిమా టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

పూర్తి స్థాయిలో తెలంగాణ యాసలో డైలాగ్స్ చెప్పబోతున్నారు నాని. ‘దసరా’ సినిమాకు సంబంధించిన ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ‘ఈ సినిమాలో మలయాళీ బ్యూటీ పూర్తి స్థాయి విలన్‌గా నటించనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఆమెపై పలు సీన్లు చిత్రీకరించారని టాక్.

నేచురల్‌ స్టార్ నాని (Nani) ‘దసరా’ సినిమాలో నెగెటివ్‌ రోల్‌ పోషించనున్న నటి పూర్ణ

అఖండ సినిమా తర్వాత..

బాలకృష్ణ – బోయపాటి శీను కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘అఖండ’ సినిమాలో పూర్ణ కీలకపాత్రలో నటించారు. ఇక, దసరా సినిమాలో పూర్ణ.. కన్నింగ్ అండ్ క్రూయల్‌ క్యారెక్టర్‌‌లో నటించనున్నారని తెలుస్తోంది. పూర్ణ పోషించనున్న క్యారెక్టర్ సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందని ఇండస్ట్రీ టాక్. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ హిందీ భాషల్లో పాన్‌ ఇండియా రేంజ్‌లో సినిమాను విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

నాని (Nani) నటించిన ‘అంటే సుందరానికీ’ సినిమా బాక్సాఫీస్‌ వద్ద సక్సెస్ టాక్‌ తెచ్చుకోలేకపోయింది. అయితే ఓటీటీలో మాత్రం ఈ సినిమాను ఎక్కువ మంది వీక్షించారు. అయితే చాలా కాలంగా హిట్‌ కోసం ఎదురుచూస్తున్న నాని.. ‘దసరా’ సినిమాపైనే నమ్మకం పెట్టుకున్నాడు.

ఆ సినిమాలో మాస్ పాత్ర కోసం బాగానే కష్టపడుతున్నాడు. ‘పుష్ప’ సినిమాలోని అల్లు అర్జున్ మేకోవర్‌ తరహాలో ఉంగరాల జుట్టుతో అభిమానుల్ని అలరించడానికి రెడీ అవుతున్నారు నాని (Nani). ‘దసరా’ సినిమా నటిగా పూర్ణకు  ఏ స్థాయిలో సక్సెస్‌ను తెచ్చిపెడుతుందో చూడాలి మరి.

Read More : ఓటీటీలోకి మాధవన్‌ (Madhavan) ‘రాకెట్రీ’ సినిమా.. స్ట్రీమింగ్‌ ఎందులో, ఎప్పటి నుంచి అంటే?

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!