ప్ర‌భాస్ (Prabhas) సినిమా 'ప్రాజెక్ట్ కె' షూటింగ్ వాయిదా వేశారా ? రూమ‌ర్ల‌కు చెక్ పెట్టిన చిత్ర యూనిట్ !

Updated on Jun 18, 2022 01:44 PM IST
 తాము నిర్మిస్తున్న  ప్ర‌భాస్ (Prabhas) 'ప్రాజెక్ట్ కె'  సినిమా షూటింగ్‌కు ఎటువంటి అంతరాయం కలగలేదని నిర్మాత అశ్వ‌నీద‌త్ చెప్పారు.
తాము నిర్మిస్తున్న ప్ర‌భాస్ (Prabhas) 'ప్రాజెక్ట్ కె' సినిమా షూటింగ్‌కు ఎటువంటి అంతరాయం కలగలేదని నిర్మాత అశ్వ‌నీద‌త్ చెప్పారు.

పాన్ ఇండియా హీరో ప్ర‌భాస్ (Prabhas) కెరిరీలో 'ప్రాజెక్ట్ కె' అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కమైన సినిమా. ఈ సినిమాలో ప్ర‌భాస్‌కు జోడిగా బాలీవుడ్ బ్యూటీ దీపికా దీపికా పదుకొణే న‌టిస్తున్నారు. 'ప్రాజెక్ట్ కె' లో బిగ్ బి అమితాబ్ బ‌చ్చ‌న్ కూడా కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. 'మ‌హాన‌టి' డైరెక్ట‌ర్ నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో 'ప్రాజ‌క్ట్ కె' తెర‌కెక్కుతుంది.

అయితే 'ప్రాజెక్ట్ కె' సినిమా వాయిదా పడిందనే వార్త‌లు ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో బాగానే చ‌క్క‌ర్లు కొట్టాయి. ఇదే క్రమంలో అస‌లు ప్రభాస్ 'ప్రాజెక్ట్ కె' సినిమా చేస్తున్నారా? లేదా అంటూ అభిమానులు ప్ర‌శ్నించారు. అయితే తాజాగా 'ప్రాజెక్ట్ కె' టీమ్ అందించిన లేటెస్ట్ అప్ డేట్ అన్ని ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం ఇచ్చింది. 

ఫేక్ వార్త‌లు న‌మ్మ‌కండి : ప్రాజెక్ట్ కె టీమ్
నటి దీపికా పదుకొణే  అస్వ‌స్థ‌త‌కు గురి అయ్యారని.. దీంతో 'ప్రాజెక్ట్ కె' వాయిదా ప‌డిందంటూ ఓ టాక్ వినిపించింది. అయితే అలాంటిదేమీ లేద‌ని.. అస‌త్య‌ వార్తలు న‌మ్మ‌కండ‌ని 'ప్రాజెక్ట్ కె' చిత్ర యూనిట్ తెలిపింది. తాము నిర్మిస్తున్న సినిమా షూటింగ్‌కు ఎటువంటి అంతరాయం కలగలేదని నిర్మాత అశ్వ‌నీద‌త్ కూడా చెప్పారు.

తాము ప్లాన్ చేసుకున్న షెడ్యూల్ ప్ర‌కారం షూటింగ్ జ‌రుగుతుంద‌న్నారు. ప్ర‌భాస్  ప్రస్తుతం 'స‌లార్' షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. అలాగే 'ప్రాజెక్టు కె' షూటింగ్‌కు కూడా త్వరలోనే పూర్తిస్థాయిలో సమయం కేటాయంచనున్నారు. 

దీపికా అస్వ‌స్థ‌త‌కు గురయ్యారా?
దీపికా ఇటీవలే ఓ దీర్ఘకాలిక సమస్యతో ఆస్ప‌త్రిలో జాయిన్ అయ్యార‌ని.. కనుక 'ప్రాజెక్ట్ కె' షూటింగ్ ఖచ్చితంగా వాయిదా పడుతుందంటూ రూమ‌ర్స్ వ‌చ్చాయి. దీంతో దీపికా ఆరోగ్య పరిస్థితిపై సినీ నిర్మాతలు క్లారిటీ ఇచ్చారు. ఆమె ఆరోగ్యం బాగుంద‌ని.. కేవ‌లం నార్మ‌ల్ చెక‌ప్ కోస‌మే హాస్ప‌ట‌ల్‌కు వెళ్లార‌న్నారు. 

ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లో 'ప్రాజెక్ట్ కె' షూటింగ్ షెడ్యూల్ జ‌రుగుతోంది. ఈ చిత్రాన్ని వైజ‌యంతి మూవీస్ నిర్మిస్తుంది.  ప్రస్తుతం ఈ సినిమా దర్శకుడి ఆధ్వర్యంలో దీపికా, అమితాబ్‌ బచ్చన్‌లపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట‌. జూన్ 20 వ‌ర‌కు దీపికా, అమితాబ్ బచ్చన్ సీన్స్‌ను చిత్రీక‌రిస్తార‌ట‌. ఆ త‌ర్వాత షెడ్యూల్‌లో ప్ర‌భాస్ (Prabhas) సీన్స్‌ను తెర‌కెక్క‌స్తామ‌ని చిత్ర యూనిట్ తెలిపింది. 

Read More: ప్ర‌భాస్ (Prabhas) పెళ్లి పై కృష్ణం రాజు ప్ర‌క‌ట‌న ఇవ్వ‌నున్నారా? ఈ సంవ‌త్స‌రంలోనే డార్లింగ్ మ్యారేజా ?

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!