ప్ర‌భాస్ (Prabhas) త‌న డార్లింగ్స్ కోసం స‌ర్‌ప్రైజ్ ప్లాన్ చేశారా?.. పాన్ ఇండియా సినిమాలా మ‌జాకా!!!

Updated on Jul 09, 2022 10:26 PM IST
వ‌రుస సినిమాల‌తో ప్ర‌భాస్ (Prabhas) త‌న అభిమానులను స‌ర్‌ప్రైజ్ చేయ‌నున్నారు.
వ‌రుస సినిమాల‌తో ప్ర‌భాస్ (Prabhas) త‌న అభిమానులను స‌ర్‌ప్రైజ్ చేయ‌నున్నారు.

టాలీవుడ్‌లో ఈశ్వ‌ర్ సినిమాతో సినీ రంగంలోకి వ‌చ్చిన ప్ర‌భాస్ (Prabhas) ప్ర‌స్తుతం పాన్ ఇండియా స్టార్‌గా కొన‌సాగుతున్నారు. ప్ర‌భాస్ త‌న అభిమానుల కోసం ఏం చేస్తున్నారు?. ప్ర‌భాస్ మూడు నెల‌ల నుంచి చేస్తున్న సినిమాలేంటి?. వ‌రుస సినిమాల‌తో ప్ర‌భాస్ త‌న అభిమానులకు స‌ర్‌ప్రైజ్ చేయ‌నున్నారా?. ప్ర‌భాస్ ఎన్ని చిత్రాల్లో ప్ర‌స్తుతం న‌టిస్తున్నారు?. ఏ సినిమా ఎప్పుడు రిలీజ్ కానుంది?. ఆ విశేషాలు పింక్ విల్లా ఫాలోవ‌ర్స్ కోసం..

వ‌రుస సినిమాల‌తో ప్ర‌భాస్ (Prabhas) త‌న అభిమానులను స‌ర్‌ప్రైజ్ చేయ‌నున్నారు.

ప‌ట్టుద‌ల‌తో  ఉన్న ప్ర‌భాస్
ప్ర‌భాస్ (Prabhas)కు రోజు రోజుకు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతూనే ఉంది. బాహుబ‌లి సినిమా త‌ర్వాత ప్ర‌భాస్‌ పాన్ ఇండియా హీరోగా మారారు. ప్ర‌స్తుతం పాన్ ఇండియా సినిమాల‌తో ఫుల్ బిజీగా ఉన్నారు. ప్ర‌భాస్ అంద‌రినీ డార్లింగ్ అంటూ స‌ర‌దాగా పిలుస్తారు. తన అభిమానుల‌ను కూడా డార్లింగ్స్ అంటారు. ఏది చేసినా డార్లింగ్స్ కోస‌మే.. ల‌వ్ యూ డార్లింగ్స్ అంటుంటారు ప్ర‌భాస్.

రాధేశ్యామ్ ప్ర‌భాస్‌కు భారీ ఫ్లాప్ ఇచ్చింది. త‌న‌ను ఎంతో ఇష్ట‌ప‌డే అభిమానుల ఆనందం కోసం ప్ర‌భాస్ హిట్ సినిమా చేయాల‌నుకుంటున్నారు. వ‌రుస సినిమాల‌తో ప్ర‌భాస్ త‌న అభిమానుల్లో జోష్ నింపారు. ఒక సంవ‌త్స‌రంలో ఎక్కువ సినిమాల‌ను రిలీజ్ చేయాల‌ని  భావిస్తున్నారు. రాధేశ్యామ్ డిజాస్ట‌ర్ త‌ర్వాత ప్ర‌భాస్ ఎలాగైనా ఓ రేంజ్‌లో స‌క్సెస్ సాధించాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు.

వ‌రుస సినిమాల‌తో ప్ర‌భాస్ (Prabhas) త‌న అభిమానులను స‌ర్‌ప్రైజ్ చేయ‌నున్నారు.

డార్లింగ్ బిజీ
ప్ర‌స్తుతం ప్ర‌భాస్ (Prabhas) స‌లార్, ఆదిపురుష్, ప్రాజెక్ట్ కె సినిమాల షూటింగ్‌ల‌లో బిజీగా ఉన్నారు. ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో స‌లార్ సినిమా షూటింగ్ 60 శాతం వ‌ర‌కు పూర్త‌యింది. ఇక ఆదిపురుష్ షూటింగ్ పూర్త‌యింద‌ని ఓం రౌత్ సోష‌ల్ మీడియాలో తెలిపారు. ఈ సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుగుతున్నాయి. ఇక ప్రాజెక్ట్ కె కూడా సెట్స్ పైకి వెళ్ల‌నుంది. 

 

వ‌రుస సినిమాల‌తో ప్ర‌భాస్ (Prabhas) త‌న అభిమానులను స‌ర్‌ప్రైజ్ చేయ‌నున్నారు.

పాన్ ఇండియా లెవ‌ల్
ప్రాజెక్ట్ కె నిర్మిస్తున్న అశ్వినీ ద‌త్ రీసెంట్‌గా హైద‌రాబాద్‌లో కొత్త ఆఫీస్ ఓపెన్ చేశారు. త్వ‌ర‌లో సందీప్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో స్పిరిట్ సినిమా షూటింగ్‌కు హ‌జ‌రుకానున్నారు ప్ర‌భాస్ . మూడు నెల‌ల నుంచి ప్ర‌భాస్ రెస్ట్ లేకుండా షూటింగ్స్ చేస్తున్నారు. ప్ర‌భాస్ న‌టిస్తున్న సినిమాలన్నీ పాన్ ఇండియా లెవ‌ల్‌లో తెర‌కెక్కుతున్నాయి. దీంతో ప్ర‌భాస్ షూటింగ్స్‌తో ఫుల్ బిజీగా ఉంటున్నారు. 

వ‌రుస సినిమాల‌తో ప్ర‌భాస్ (Prabhas) త‌న అభిమానులను స‌ర్‌ప్రైజ్ చేయ‌నున్నారు.

స‌లార్ (Salaar)
కేజీఎఫ్ ఫేమ్ ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో స‌లార్ సినిమా తెర‌కెక్కుతుంది. ఈ చిత్రంలో ప్ర‌భాస్ డ‌బుల్ రోల్‌లో న‌టించ‌నున్నారు. ప్ర‌భాస్‌కు జోడిగా శృతి హాస‌న్ న‌టిస్తున్నారు. కేజీఎఫ్ హీరో య‌శ్ కూడా ప్ర‌త్యేక పాత్ర‌లో క‌నిపించ‌నున్నార‌ట‌. అలాగే జగపతిబాబు, మధు గురుస్వామి, ఈశ్వరిరావు ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ ఓ స్పెషల్ సాంగ్‌లో నటిస్తోంది.

ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై ప్ర‌ముఖ‌ నిర్మాత విజయ్ కిరంగదూర్ నిర్మిస్తున్నారు. దాదాపు రూ. 200 కోట్ల బ‌డ్జెట్‌తో స‌లార్ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. రవి బస్రూర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించగా, భువన్ గౌడ సినిమాటోగ్రఫీ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. స‌లార్ చిత్రాన్ని 2023లో తెలుగుతో పాటు క‌న్న‌డ‌, త‌మిళ్, మ‌ల‌యాళం, హిందీ భాష‌ల్లో రిలీజ్ చేయ‌నున్నారు. 

వ‌రుస సినిమాల‌తో ప్ర‌భాస్ (Prabhas) త‌న అభిమానులను స‌ర్‌ప్రైజ్ చేయ‌నున్నారు.

ఆదిపురుష్ (Adipurush)
రామాయణం ఆధారంగా ఆదిపురుష్ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. బాలీవుడ్ బ‌డా ద‌ర్శ‌క‌, నిర్మాత ఓం రౌత్ నిర్మిస్తున్నఈ 3 డీ చిత్రంలో ప్ర‌భాస్ రాముడి పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. బాలీవుడ్ బ్యూటీ కృతి స‌న‌న్ జానకి పాత్రలో ప్ర‌భాస్‌కు జోడిగా న‌టించ‌నున్నారు. రామాయ‌ణంలోని రావ‌ణుడి పాత్ర‌లో సైఫ్ అలీఖాన్ న‌టిస్తున్నారు. ఇక సన్నీ సింగ్ లక్ష్మణుడిగా నటిస్తున్నారు.

ప్ర‌భాస్ పుట్టిన రోజు అక్టోబ‌ర్ 31న‌ ఆదిపురుష్ ఫ‌స్ట్ లుక్‌ను రిలీజ్ చేయాల‌ని మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నారు.బాహుబలి కన్నా పదిరెట్లు VFX ఎఫెక్ట్స్ ఈ సినిమాలో చూడచ్చు. తెలుగు, హిందీ భాష‌ల్లో ఆదిపురుష్ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రాన్ని త‌మిళ్, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో డ‌బ్ చేసి విడుద‌ల చేయ‌నున్నారు.

ప్ర‌భాస్ కూడా ఆదిపురుష్ సినిమాకు డ‌బ్బింగ్ చెప్ప‌డానికి సిద్ధ‌మ‌య్యార‌ట‌. ఈ సినిమాను రూ. 500 కోట్ల బడ్జెట్‌తో టీసిరీస్, రెట్రోఫిల్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. సాచేత్ ప‌రంప‌రం సంగీతం అందిస్తున్నారు. 2023 జ‌న‌వ‌రి 12న ఆదిపురుష్ ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. 

వ‌రుస సినిమాల‌తో ప్ర‌భాస్ (Prabhas) త‌న అభిమానులను స‌ర్‌ప్రైజ్ చేయ‌నున్నారు.

ప్రాజెక్ట్ కె (Project K)
సైన్స్ ఫిక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో ప్రాజెక్ట్ కె సినిమాను ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ నిర్మిస్తున్నారు. నిర్మాత అశ్వ‌నీద‌త్ నిర్మాణ సంస్థ అయిన వైజయంతి మూవీస్‌ 50వ సినిమాను ప్ర‌భాస్‌తో నిర్మిస్తుంది. ప్రాజెక్ట్ కె చిత్రాన్ని రూ.500 కోట్ల భారీ బడ్జెట్‌తో సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. 

ప్రాజెక్ట్ కె సినిమాతో ప్ర‌భాస్ హాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమాను తెలుగు, హిందీ భాష‌ల్లో తెర‌కెక్కిస్తున్నారు. ప్రాజెక్ట్ కె సినిమాను త‌మిళ్, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం, ఇంగ్లీష్ భాష‌ల్లో డ‌బ్ చేయ‌నున్నారు.

ప్ర‌భాస్‌కు జోడిగా దీపికా ప‌దుకొనే న‌టిస్తున్నారు. బాలీవుడ్ బ‌డా స్టార్, బిగ్ బి అమితాబ్ బ‌చ్చ‌న్ కూడా ఈ సినిమాలో కీల‌క పాత్ర‌ను పోషిస్తున్నారు. ప్రాజెక్ట్ కె కోసం ఆరి అలెక్సా అనే కొత్త టెక్నాల‌జీ క‌లిగిన‌ కెమెరా మొద‌టి సారి ఇండియాలో వాడ‌నున్నారు. ఈ చిత్రానికి మిక్కి జే మేయ‌ర్ సంగీతం అందిస్తున్నారు.  2023లో ప్రాజెక్ట్ కె రిలీజ్ కానుంది. 

వ‌రుస సినిమాల‌తో ప్ర‌భాస్ (Prabhas) త‌న అభిమానులను స‌ర్‌ప్రైజ్ చేయ‌నున్నారు.

స్పిరిట్ (Spirit)
స్పిరిట్ చిత్రం ప్ర‌భాస్ న‌టించ‌బోయే 25వ సినిమా. ఈ సినిమాకు ద‌ర్శ‌కుడిగా సందీప్ రెడ్డి వంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ప్ర‌భాస్‌కు జోడిగా క‌రీనా క‌పూర్ న‌టించ‌నున్నార‌ట‌. సందీప్ వంగా తన సొంత ప్రొడక్షన్ బ్యానర్‌లో యూవీ క్రియేషన్స్, టీ సిరీస్‌తో క‌లిసి సంయుక్తంగా ఈ సినిమా నిర్మిస్తున్నారు. ప్ర‌భాస్ పోలీస్ పాత్ర‌లో న‌టిస్తార‌నే టాక్ వినిపిస్తుంది. 

ప్ర‌భాస్, సందీప్ రెడ్డి వంగా కాంబోలో రానున్న స్పిరిట్ చిత్రం విదేశీ భాషల్లో కూడా రిలీజ్ కానుంది. భార‌తీయ భాష‌లైన తెలుగు, హిందీ, త‌మిళ్, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో రిలీజ్ కానుంది. వీటితో పాటు విదేశీ భాష‌లైన జ‌ప‌నీస్, చైనీస్ కొరియ‌న్ భాష‌ల్లో స్పిరిట్ రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా రిలీజ్‌కు సంబంధించిన అప్‌డేట్‌ను మేక‌ర్స్ ఇంకా రిలీజ్ చేయ‌లేదు. 
Read More : ఇంత స్లిమ్ లుక్ ఏంటి డార్లింగ్ అంటున్న ప్ర‌భాస్ (Prabhas) ఫ్యాన్స్.. ఆదిపురుష్ టీమ్‌కు ఓం రౌత్ పార్టీ

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!