దేశభక్తిని చాటే తారలు: జాతీయస్థాయిలో ప్రభాస్ (Prabhas), కీర్తి సురేష్ (Keerthy Suresh) లకు అరుదైన అవకాశం !

Updated on Aug 06, 2022 02:18 PM IST
ప్రభాస్ (Prabhas) తాను నటించిన బాహుబలి సినిమా విజయం సాధించాక, జాతీయ స్థాయిలో  ప్రఖ్యాతులను సంపాదించుకున్న దక్షిణాది నటుడిగా వినుతికెక్కారు.
ప్రభాస్ (Prabhas) తాను నటించిన బాహుబలి సినిమా విజయం సాధించాక, జాతీయ స్థాయిలో ప్రఖ్యాతులను సంపాదించుకున్న దక్షిణాది నటుడిగా వినుతికెక్కారు.

భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి కావస్తోన్న క్రమంలో మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ ఓ స్పెషల్ వీడియోని విడుదల చేసింది. 'హర్ ఘర్ తిరంగా' (Har Ghar Tiranga) పేరుతో సాగే పాట ఈ వీడియోలో అదనపు ఆకర్షణ. ఇదే వీడియోలో ఎందరో సినీ తారలు కనువిందు చేయడం విశేషం. ముఖ్యంగా దక్షిణాది నుండి ప్రభాస్ (Prabhas), కీర్తి సురేష్‌లు (Keerthy Suresh) ఈ వీడియోలో సందడి చేస్తూ, దేశభక్తిని ప్రబోధించడం గమనార్హం. 

దక్షిణాది నుండి ఒకే ఒక్క నటుడు ఈ వీడియో చిత్రీకరణలో పాల్గొనగా.. అది ప్రభాస్‌ కావడం విశేషం. ఈ వీడియోకి బిగ్‌బి అమితాబ్ బచ్చన్ తన గాత్రాన్ని అందించారు. అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ, అనుపమ్ ఖేర్, ఆశా భోంస్లే, సోనూ నిగమ్, అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్, పీవీ సింధూ మొదలైన వారు ఈ వీడియోలో దర్శనమిచ్చారు. ఇదే వీడియోలో భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా తన సందేశాన్ని అందించారు. 

భారతదేశపు ఔన్నత్యాన్ని చాటే క్రమంలో

మన దేశ బలాన్ని, త్యాగాన్ని, ప్రతిభను ప్రపంచానికి తెలియజేయాలనే ఉద్దేశంతో 75 సంవత్సరాల స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను భారత ప్రభుత్వం అంగరంగ వైభవంగా దేశం నలుమూలలా జరుపుతుందన్న విషయం తెలిసిందే. ఇదే క్రమంలో ప్రభుత్వం కొన్ని ప్రత్యేక కార్యక్రమాలకు కూడా రూపకల్పన చేసింది. అందులో భాగంగానే సినీ నటులతో ప్రజలకు దేశభక్తి సందేశాన్ని అందించే వీడియోకి రూపకల్పన చేసింది. ఈ వీడియోలో ప్రభాస్‌కు చోటు దక్కడం విశేషం.

మూడు చిత్రాలతో ప్రభాస్ బిజీ

ప్రభాస్ ప్రస్తుతం 'ప్రాజెక్ట్ కె' అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్ ఓ ప్రత్యేక పాత్ర పోషిస్తుండగా, మరో విభిన్న పాత్రలో దీపికా పదుకొనే నటించడం విశేషం. అలాగే 'ఆదిపురుష్' అనే చిత్రంలో ప్రభాస్ (Prabhas) రాముడి పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. 

ఇక కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ (Prashanth Neel) డైరెక్షన్‌లో 'సలార్' చిత్రంలో కూడా ప్రభాస్ కనువిందు చేయనున్నారు. ఈ మూడు ప్రాజెక్టుల తర్వాత సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో 'స్పిరిట్' అనే చిత్రంలో కూడా ప్రభాస్ నటించేందుకు సిద్దమవుతున్నారు.

ఇక కీర్తి సురేష్ (Keerthy Suresh) విషయానికి వస్తే, 'మహానటి' చిత్రానికి జాతీయ అవార్డు దక్కాక ఆమె ఉత్తరాది వారికి కూడా బాగా చేరువైంది. హిందీ నిర్మాతల నుండి కూడా ఆమెకు వరుస ఆఫర్లు వస్తున్నాయి. ఈమె ప్రస్తుతం నాని సరసన 'దసరా' చిత్రంలో నటిస్తోంది. అలాగే తమిళంలో 'మామన్నన్' అనే మరో చిత్రంలోనూ నటిస్తోంది. 

Read More: సలార్ (Salaar) : హాలీవుడ్‌ రేంజ్‌లో ప్రీ క్లైమాక్స్‌కి సిద్ధమైన ప్రభాస్ సినిమా

 

 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!