క్యాస్టింగ్ కౌచ్ కీర్తి సురేష్‌ (Keerthy Suresh) సంచలన వ్యాఖ్యలు.. ‘అది మన ప్రవర్తనను బట్టి కూడా ఉంటుందేమో’..!

Updated on Dec 06, 2022 01:18 PM IST
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి కీర్తి సురేష్ (Keerthy Suresh) కు మొదటిసారిగా క్యాస్టింగ్ కౌచ్ గురించి ప్రశ్న ఎదురయింది.
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి కీర్తి సురేష్ (Keerthy Suresh) కు మొదటిసారిగా క్యాస్టింగ్ కౌచ్ గురించి ప్రశ్న ఎదురయింది.

ఓవైపు గ్లామ‌ర్ పాత్ర‌ల్లో న‌టిస్తూనే మరోవైపు లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతోనూ మెప్పిస్తున్న హీరోయిన్ ‘మహానటి’ కీర్తి సురేష్‌ (Keerthy Suresh). ‘మహానటి’ సినిమా తర్వాత ఇప్పటికు వరకు ఆమెకు ఆ స్థాయి విజయం దక్కలేదు. ఇటీవలే విడుదలైన ‘సర్కారు వారి పాట’ పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకున్నా.. బాక్సాఫీస్‌ దగ్గర మాత్రం యావరేజ్‌ హిట్ తోనే సరిపెట్టుకుంది. అయితే తాజాగా ఓటీటీలో విడుదలైన ‘సాని కాదియం’ కీర్తికి మంచి పేరు తెచ్చిపెట్టింది.

ప్రస్తుతం కీర్తి సురేష్ నాలుగు సినిమాల్లో నటిస్తోంది. అందులో రెండు తెలుగు సినిమాలు కాగా, మరో రెండు తమిళ సినిమాలు. మెగాస్టార్ చిరంజీవి-మెహర్ రమేష్ కాంబోలో తెరకెక్కుతున్న ‘భోళా శంకర్’ (Bhola Skankar) చిత్రంలో కీర్తి చెల్లి పాత్ర చేస్తున్నారు. ఇక నానికి జంటగా తెరక్కుతున్న ‘దసరా’ (Dasara) చిత్రంపై భారీ హైప్ నెలకొని ఉంది. పాన్ ఇండియా చిత్రంగా ‘దసరా’ ఐదు భాషల్లో విడుదల కానుంది.

ఇదిలా ఉంటే.. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి కీర్తి సురేష్ (Keerthy Suresh) కు మొదటిసారిగా క్యాస్టింగ్ కౌచ్ గురించి ప్రశ్న ఎదురయింది. ఒకవేళ మీకు సినిమా అవకాశం రావాలంటే తప్పనిసరిగా కమిట్మెంట్ కి ఒప్పుకోవాల్సిందే. ఇలా ఒప్పుకుంటేనే అవకాశం ఇస్తామని చెప్పినప్పుడు మీ సమాధానం ఎలా ఉంటుంది అని యాంకర్ ప్రశ్నించారు. 

దీనికి సమాధానంగా కీర్తి (Keerthy Suresh) ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉందని తనకు తెలుసంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. కమిట్మెంట్ ఇస్తేనే అవకాశాలు ఇస్తాము అంటే ఆ అవసరం నాకు లేదని వెంటనే ఇండస్ట్రీ నుంచి దూరమై ఏదైనా మంచి జాబ్ చేసుకుంటానని కానీ అలాంటి వాటికి ఒప్పుకోనని ఈమె తెలిపారు. ఇండస్ట్రీలో చాలామంది ఈ విధమైనటువంటి సమస్యతో బాధపడ్డారని చాలామంది నాతో చెప్పారు. అయితే, ఈ క్యాస్టింగ్ కౌచ్ అనేది ఇప్పటివరకు తన దగ్గరకు రాలేదని.. అది మన ప్రవర్తనను బట్టి కూడా ఉంటుందేమో అని తెలిపింది. ఈమె చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.

Read More: పోరాట యోధురాలి పాత్రలో కీర్తి సురేష్‌ (Keerthy Suresh).. హోంబ‌లే ఫిలింస్ నిర్మాణ సంస్థలో ‘రగ్ తాథా’ (Raghu Thatha)

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!