Prabhas: ప్రభాస్, అమితాబ్‌, నాని.. అభిమాన తారలంతా ఒకే ఫ్రేమ్‌లో.. సంబరపడిపోతున్న ఫ్యాన్స్‌!

Updated on Jun 27, 2022 04:17 PM IST
వైజయంతీ మూవీస్ ఆఫీస్ ఓపెనింగ్‌ కార్యక్రమానికి వచ్చిన ప్రభాస్, ప్రశాంత్‌నీల్, అమితాబ్, రాఘవేంద్రరావు, నాని, దుల్కర్ సల్మాన్, నాగ్‌ అశ్విన్
వైజయంతీ మూవీస్ ఆఫీస్ ఓపెనింగ్‌ కార్యక్రమానికి వచ్చిన ప్రభాస్, ప్రశాంత్‌నీల్, అమితాబ్, రాఘవేంద్రరావు, నాని, దుల్కర్ సల్మాన్, నాగ్‌ అశ్విన్

పాన్‌ ఇండియా సినిమాలతో సినీ పరిశ్రమలో ఉన్న హద్దులు చెరిగిపోయాయి. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళం అనే తేడా లేకుండా నటీనటులందరూ కలిసి గొప్ప చిత్రాలను తెరకెక్కిస్తున్నారు. టాలీవుడ్‌ రెబల్‌ స్టార్‌గా కెరీర్‌ ప్రారంభించిన ప్రభాస్‌ (Prabhas) ప్రస్తుతం పాన్‌ ఇండియా స్టార్‌గా భారీ బడ్జెట్‌ సినిమాల్లో భాగమయ్యాడు.

ప్రభాస్‌ పై ప్రస్తుతం వేల కోట్లల్లో బిజినెస్‌ జరుగుతోంది. ప్రస్తుతం ప్రభాస్‌ నటిస్తున్న చిత్రాలన్నీ భారీ బడ్జెట్‌ లో రూపొందుతున్న పాన్‌ ఇండియా మూవీస్‌ కావడం విశేషం. ఆదిపురుష్‌, సలార్‌, ప్రాజెక్ట్‌ కె ఇలా ప్రభాస్‌ నటిస్తున్న చిత్రాలన్నీ భారీ అంచనాలతో తెరకెక్కుతున్న సినిమాలే.

ఆదిపురుష్‌లో ప్రభాస్‌

వేగంగా జరుగుతున్న షూటింగ్స్..

ప్రభాస్‌ నటిస్తున్న ఆదిపురుష్‌ చిత్ర షూటింగ్‌ చాలా రోజుల క్రితమే పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ‘సలార్‌’, ‘ప్రాజెక్ట్‌ కె’ చిత్రాల షూటింగ్స్‌ శరవేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రం కేజీఎఫ్‌తో సెన్సేషనల్‌ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోంది.

ఇక ‘ప్రాజెక్ట్‌ కె’ చిత్రాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో విజువల్‌ వండర్‌ గా తీర్చిదిద్దుతున్నాడు యువ దర్శకుడు నాగ్‌ అశ్విన్‌. ఈ చిత్రంలో క్రేజీ నటీనటులు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ప్రభాస్‌ సరసన దీపికా పదుకొనె నటిస్తుండగా బిగ్‌ బి అమితాబ్‌ మరో ముఖ్య పాత్రలో నటిస్తున్నారు.

‘ప్రాజెక్ట్‌ కె’ సినిమాలో ప్రభాస్, దీపికా పదుకొనె, అమితాబ్‌ బచ్చన్

గచ్చిబౌలిలో కొత్త ఆఫీసు..

వైజయంతి మూవీస్‌ బ్యానర్‌ పై అశ్వినీదత్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘ప్రాజెక్ట్‌ కె’ మూవీ కోసం వైజయంతి సంస్థ గచ్చిబౌలిలో కొత్త ఆఫీసును ప్రారంభించింది. ఈ ఆఫీస్‌ ప్రారంభోత్సవానికి ప్రభాస్‌, నేచురల్‌ స్టార్‌ నాని, రాఘవేంద్ర రావు, దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌, మలయాళీ స్టార్‌ దుల్కర్‌ సల్మాన్‌ హాజరయ్యారు. వీరిలో బాలీవుడ్‌ బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు.

ఇలా ప్రభాస్‌, నాని, అమితాబ్‌ లాంటి అగ్ర నటులు ఒకే ఫ్రేములో కనిపించడంతో ఫ్యాన్స్‌ సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. ఈ పిక్‌ నెట్టింట వైరల్‌ అవుతోంది. ‘ప్రాజెక్ట్‌ కె’ చిత్రంలో ప్రభాస్‌ (Prabhas) సూపర్‌ హీరోగా కనిపించబోతున్నట్లు ఊహాగానాలు వెలువడుతున్నాయి.

Read More : ప్ర‌భాస్ (Prabhas) సినిమా 'ప్రాజెక్ట్ కె' షూటింగ్ వాయిదా వేశారా ? రూమ‌ర్ల‌కు చెక్ పెట్టిన చిత్ర యూనిట్ !

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!