Mahanati Savitri Birth Anniversary: "నటనను ఆరాధించిన మహానటి" - సావిత్రి జయంతి సందర్భంగా పింక్ విల్లా ప్రత్యేక కథనం.

Updated on Dec 06, 2022 04:31 PM IST
నటనలో అంచెలంచెలుగా ఎదిగిన సావిత్రి (Mahanati Savitri)… నటనపై మక్కువతో చివరి రోజుల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా నటించి మెప్పించారు..
నటనలో అంచెలంచెలుగా ఎదిగిన సావిత్రి (Mahanati Savitri)… నటనపై మక్కువతో చివరి రోజుల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా నటించి మెప్పించారు..

మహానటి సావిత్రి (Mahanati Savitri) తన నటనతో తెలుగు సినిమా పరిశ్రమ గౌరవాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లారు. అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయారు. కళ్ళతో నటించిన గొప్ప నటిగా అందరినీ ఆకట్టుకున్నారు. అందుకే సావిత్రి మహానటిగా పేరు తెచ్చుకున్నారు. టాలీవుడ్‌తో పాటు దక్షిణాది సినిమా రంగంలో చాలా సంవత్సరాలు టాప్ హీరోయిన్‌గా కొనసాగారు. సావిత్రి 88వ జయంతి సందర్భంగా పింక్ విల్లా ప్రత్యేక కథనం. 

మహానటి సావిత్రి (Mahanati Savitri)

సావిత్రికి చిన్నప్పటి నుంచి కళలపైన ఆసక్తి ఉండేది. నటనపై ఇష్టంతో నాటక రంగంలోకి అడుగుపెట్టారు. 13 ఏళ్ల వయసులో సావిత్రి కాకినాడలోని ఆంధ్రనాటిక పరిషత్ నిర్వహించిన నాటక పోటీల్లో అద్భుతమైన నటన కనబరిచారు. ఆ కార్యక్రమంలో బాలీవుడ్ ప్రముఖ నటుడు పృధ్వీ రాజ్ కపూర్ చేతుల మీదుగా బహుమతి అందుకున్నారు. పృధ్వీ రాజ్ కపూర్ సావిత్రికి బహుమతి అందిస్తూ.. భవిష్యత్తులో మహానటి అవుతావని చెప్పారట.

మహానటి సావిత్రి (Mahanati Savitri)

సావిత్రి (Mahanati Savitri) సినిమాల్లో నటించాలని మద్రాసుకు వెళ్లారు. 1950లో విడుదలైన 'సంసారం' సినిమా ద్వారా నటిగా వెండితెరపై మొదటిసారి కనిపించారు సావిత్రి. ఆ తరువాత 'పాతళ భైరవి' సినిమాలో మరో పాత్రతో తెలుగు ప్రేక్షకులను మెప్పించారు. 

చిన్న చిన్న పాత్రలలో నటించిన సావిత్రి 'పెళ్లి చేసి చూడు చిత్రం' ద్వారా పాపులర్ అయ్యారు. 'పెళ్లి చేసి చూడు' సినిమా తరువాత 'దేవదాసు', 'మిస్సమ్మ', 'మాయాబజార్' సినిమాలు సావిత్రికి బ్లాక్ బాస్టర్ హిట్ అందించాయి. 

మహానటి సావిత్రి (Mahanati Savitri)

1954 విడుదలైన 'బహుత్ దిన్ హుయే' హిందీ సినిమా ద్వారా సావిత్రి బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు.

'దొంగ రాముడు', 'అర్థాంగి', 'మూగ మనసులు', 'మంచి మనసులు', 'తోడికోడళ్ళు', 'ఆత్మ బంధువు', 'రక్త సంబంధం', 'గుండమ్మ కథ' సావిత్రి నటించిన హిట్ సినిమాలు.సావిత్రి తాను నటించిన సినిమాల్లో 'చివరికి మిగిలేది' అంటే చాలా ఇష్టమైన సినిమా అట.

మహానటి సావిత్రి (Mahanati Savitri)

సావిత్రి (Mahanati Savitri)ని అభిమానులు పలు పేర్లతో పిలుచుకునే వారు. మహానటి సావిత్రి, నడిగర్ తిలగమ్, సావిత్రి గణేశ్ అంటూ సావిత్రిని పిలిచేవారు.

లక్స్ సోప్ప్‌కు సావిత్రి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవరించారు.1975లో విడుదలైన 'ఏక్ చిట్టీ ప్యార్ భరీ' హిందీ సినిమాకు సావిత్రి నిర్మాతగా వ్యవహించారు. 

మహానటి సావిత్రి (Mahanati Savitri)

నటిగానే కాకుండా దర్శకురాలిగా సావిత్రి పలు సినిమాలను తెరకెక్కించారు. 'చిన్నారి పాపలు', 'కుళందై ఉళ్ళం' (తమిళ్), 'మాతృ దేవత', 'చిరంజీవి', 'వింత సంసారం', 'ప్రాప్తం' (తమిళ్) సినిమాలకు సావిత్ర దర్శకత్వం వహించారు.

సావిత్రి 1966లో విడుదలైన 'నవరాత్రి' సినిమాలో నేపథ్య గాయనిగా పాటలను ఆలపించారు.

 

మహానటి సావిత్రి (Mahanati Savitri)

'దేవదాసు', 'చివరకు మిగిలేది', 'మాయాబజార్', 'ఆరాధన', 'మరో ప్రపంచం' సినిమాలలో నటించిన సావిత్రి ఉత్తమ నటిగా ఫిలిమ్ ఫేర్ అవార్డులను అందుకున్నారు. 'చిన్నారి పాప' సినిమాకు గానూ ఉత్తమ నటిగా నంది అవార్డు లభించింది. 2011లో సావిత్రి సేవలకు భారతీయ ప్రభుత్వం ఆమె ఫోటోతో పోస్టల్ స్టాంప్‌ను విడుదల చేసింది. 

మహానటి సావిత్రి ( Mahanati Savitri)

మద్రాస్ రోడ్లపై సావిత్రి కారు హారన్ విని ఆమె కారు వెళ్లడానికి దారి ఇచ్చేవారట. అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి హైదరాబాద్‌లో సావిత్రికి గజారోహణ సన్మానం చేశారు. 

మహానటి సావిత్రి ( Mahanati Savitri)

టాలీవుడ్‌ (Tollywood) హీరోయిన్లలో సావిత్రికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అప్పట్లో హీరోలతో సమానంగా పారితోషకం తీసుకున్న హీరోయిన్ సావిత్రి. ప్రభుత్వ ఉద్యోగుల జీతం నెలకు రూ. 200 ఉండేవి. కానీ సావిత్రి రోజు వారి సంపాదన  5 వేల రూపాయలుండేదట. 

మహానటి సావిత్రి ( Mahanati Savitri)

సావిత్రికి నాలుగు పెద్ద బంగళాలు ఉండేది. కొడైకెనాల్‌లో ఒక గెస్ట్ హౌస్, విజయవాడలో రెండు బంగళాలు, హైదరాబాదులో ఒక బంగళా ఉండేవట. కృష్ణాజిల్లాలో విజయ్ స్పిన్నింగ్ మిల్ కంపెనీ కూడా సావిత్రిదే.

రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, మద్రాసులో సావిత్రీ పొడక్షన్ పేరుతో సినిమా నిర్మాణ సంస్థ ఉండేది. 

సావిత్రికి ఆరు కారులుండేవట. సినిమాలు నిర్మించి నష్టపోయిన సమయంలో సావిత్రి ఆదాయపు పన్ను కట్టలేక పోయారు. దీంతో సావిత్రి ఆస్తులన్నీ ఆదాయపు పన్ను శాఖ వారు స్వాధీనం చేసుకున్నారు.

మహానటి సావిత్రి ( Mahanati Savitri)

'ఆంధ్ర సచిత్ర వార పత్రిక'లో మొదటి సారిగా సావిత్రి ఫోటో కవర్ పేజ్‌పై ప్రచురించారు. అప్పట్లో కవర్ పేజ్‌పై ఫోటో రావడం అంటే చాలా గొప్ప విషయం. సావిత్రి చివరిరోజుల్లో కూడా కవర్ పేజ్‌పై 'ఆంధ్ర సచిత్ర వార పత్రిక' మహానటి ఫోటోను ప్రచురించి ఔదార్యం చాటుకుంది.

మహానటి సావిత్రి ( Mahanati Savitri)

సావిత్రి చాలా తెలివైన వారు. తెలుగుతో పాటు తమిళ్, హిందీ, ఇంగ్లీష్ భాషలలో సావిత్రి మాట్లాడగలరు. సావిత్రి తెలుగు వారని చాలా మంది తమిళులకు ఇప్పటికీ తెలియదు. ఆమె తమిళ్ అంత చక్కగా మాట్లాడతారు. ఇంగ్లీష్ వార్తా పత్రికలకు ఇంగ్లీష్‌లోనే ఇంటర్వ్యూలు ఇచ్చేవారు. హిందీలో ధర్మేంద్రతో 'సీతారోం సే ఆగే', పృథ్వీరాజ్ కపూర్‌తో ఐదు సినిమాలలో సావిత్రి నటించారు.

మహానటి సావిత్రి ( Mahanati Savitri)

తమిళ నటుడు జెమిని గణేశ్‌ను సావిత్రి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. కూతురు విజయ చాముండేశ్వరీ, కుమారుడు సతీష్ కుమార్. ఇద్దరు భార్యలున్న వ్యక్తిని పెళ్లి చేసుకున్న సావిత్రికి.. పెళ్లి తరువాత వరుస ఆఫర్లు వచ్చాయి. సావిత్రి నటించిన చివరి చిత్రం 'గోరింటాకు'. 'గోరింటాకు' సినిమాలో నటించేటప్పటికే సావిత్రి ఆర్థికంగా చితికపోవడమే కాకుండా ఆరోగ్యం కూడా క్షీణించింది. 1981 డిసెంబర్ 26 వ తేదీన  మహానటి సావిత్రి తుది శ్వాస విడిచారు.

మహానటి సావిత్రి ( Mahanati Savitri)

నటనలో అంచెలంచెలుగా ఎదిగిన సావిత్రి… నటనపై మక్కువతో చివరి రోజుల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా నటించారు. నటన అంటే కేవలం హీరోయిన్  పాత్రే కాదని.. ప్రతి పాత్ర గొప్పదే అని నమ్మారు సావిత్రి. నటనపై ప్రేమ.. ప్రతి కళాకారుల పట్ల గౌరవం కలిగిన నటి కాబట్టే సావిత్రికి మహానటి అనే పేరు వచ్చింది. 

 

 

మహానటి సావిత్రి ( Mahanati Savitri)

సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా దర్శకుడు నాగ్ అశ్విన్ 2018లో 'మహానటి' పేరుతో సినిమాను రూపొందించారు. ఈ సినిమాలో సావిత్రి పాత్రలో హీరోయిన్ కీర్తి సురేష్ జీవించారు. ఈ చిత్రంలో నటించిన కీర్తి సురేష్ నటనకు ఉత్తమ నటిగా జాతీయ పురస్కారం లభించింది. 

Read More: Tollywood: ఈ ఏడాది రూ. 100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన తెలుగు సినిమాలపై ప్రత్యేక కథనం..

మహానటి సావిత్రి ( Mahanati Savitri)

 
 
సావిత్రి ఎన్నో గొప్ప పాత్రల్లో నటించారు. కథా బలమున్న సినిమాల్లో నటించి మెప్పించారు. మానవత్వంతో ఎంతో మందికి సహాయం అందించారు. సావిత్రికి నటనపై ఉన్న గౌరవం ఆమెను మహానటిగా వెండితెరపై చిరస్థాయిగా మిగిలేలా చేసింది. హ్యాపీ బర్త్ డే మహానటి
పింక్ విల్లా
 
Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!