Adipurush: 'ఆదిపురుష్‌'పైనే ప్ర‌భాస్ (Prabhas) అభిమానుల ఆశ‌లు!.. 'బాహుబ‌లి' రేంజ్‌లో హిట్ ద‌క్కేనా?.

Updated on Aug 25, 2022 05:01 PM IST
Adipurush: ఆదిపురుష్' చిత్రాన్ని ప్రభాస్  (Prabhas) అభిమానుల కోసం అనుకున్న తేదీకే రిలీజ్ చేస్తామ‌ని ఓం రౌత్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.
Adipurush: ఆదిపురుష్' చిత్రాన్ని ప్రభాస్ (Prabhas) అభిమానుల కోసం అనుకున్న తేదీకే రిలీజ్ చేస్తామ‌ని ఓం రౌత్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.

Adipurush: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) న‌టిస్తున్న 'ఆదిపురుష్‌' సినిమాపై భారీ అంచనాలు నెల‌కొన్నాయి. ఈ సినిమాను బాలీవుడ్ బ‌డా ద‌ర్శ‌కుడు ఓం రౌత్ తెర‌కెక్కిస్తున్నారు. 'ఆదిపురుష్' చిత్రాన్ని అనుకున్న తేదీకే రిలీజ్ చేస్తామ‌ని ఓం రౌత్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ప్రభాస్ అభిమానుల కోసం అనుకున్న తేదీకే సినిమాను రిలీజ్ చేస్తామ‌న్నారు. 'ఆదిపురుష్' ప్రపంచవ్యాప్తంగా వచ్చే ఏడాది జనవరి 12న  తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది. ఈ సినిమా క‌చ్చితంగా స‌క్సెస్ సాధిస్తుంద‌ని ప్ర‌భాస్ ఫ్యాన్స్ న‌మ్మ‌కం పెట్టుకున్నారు. 

డార్లింగ్ ఫ్యాన్స్ ఎదురుచూపు 

'బాహుబ‌లి' త‌రువాత ప్ర‌భాస్ పాన్ ఇండియా హీరోగా మారారు. ఆ త‌రువాత వ‌చ్చిన సినిమాలు ఏవీ ప్ర‌భాస్‌కు బ్లాక్ బాస్ట‌ర్ హిట్‌లు ఇవ్వ‌లేదు. 'సాహో', 'రాధేశ్యామ్' సినిమాలు అభిమానులు నిరాశ ప‌రిచాయి. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ 'స‌లార్', 'ప్రాజెక్ట్ కె', 'ఆదిపురుష్' సినిమాల్లో న‌టిస్తున్నారు. ఈ సినిమాల్లో మొద‌టగా 'ఆదిపురుష్' రిలీజ్ కానుంది. ఈ నేప‌థ్యంలో  డార్లింగ్ ఫ్యాన్స్ ఆదిపురుష్ పైనే ఆశ‌లు పెట్టుకున్నారు. ఈ సినిమా ప్ర‌భాస్‌కు 'బాహుబ‌లి'కి మించి హిట్ ఇవ్వాల‌ని కోరుకుంటున్నారు. 

Adipurush: ఆదిపురుష్' చిత్రాన్ని ప్రభాస్ (Prabhas) అభిమానుల కోసం అనుకున్న తేదీకే రిలీజ్ చేస్తామ‌ని ఓం రౌత్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.

ఫ‌స్ట్ లుక్ రిలీజ్ ఎప్పుడంటే..

రామాయణం ఆధారంగా 'ఆదిపురుష్' సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. బాలీవుడ్ బ‌డా ద‌ర్శ‌క‌, నిర్మాత ఓం రౌత్ నిర్మిస్తున్నఈ 3 డీ చిత్రంలో ప్ర‌భాస్ (Prabhas) రాముడి పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. బాలీవుడ్ బ్యూటీ కృతి స‌న‌న్ జానకి పాత్రలో ప్ర‌భాస్‌కు జోడిగా న‌టించ‌నున్నారు. రావ‌ణుడి పాత్ర‌లో సైఫ్ అలీఖాన్ న‌టిస్తున్నారు. ఇక సన్నీ సింగ్ లక్ష్మణుడిగా నటిస్తున్నారు.

ప్ర‌భాస్ పుట్టిన రోజు అక్టోబ‌ర్ 31న‌ 'ఆదిపురుష్' ఫ‌స్ట్ లుక్‌ను రిలీజ్ చేయాల‌ని మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నారు.బాహుబలి కన్నా పదిరెట్లు VFX ఎఫెక్ట్స్ ఈ సినిమాలో చూడచ్చు. తెలుగు, హిందీ భాష‌ల్లో 'ఆదిపురుష్' చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రాన్ని త‌మిళ్, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో డ‌బ్ చేసి విడుద‌ల చేయ‌నున్నారు.

ప్ర‌భాస్ కూడా 'ఆదిపురుష్' సినిమాకు డ‌బ్బింగ్ చెప్ప‌డానికి సిద్ధ‌మ‌య్యార‌ట‌. ఈ సినిమాను రూ. 500 కోట్ల బడ్జెట్‌తో టీసిరీస్, రెట్రోఫిల్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. సాచేత్ ప‌రంప‌ర సంగీతం అందిస్తున్నారు. 2023 జ‌న‌వ‌రి 12న 'ఆదిపురుష్' ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. 

Read More : ప్రభాస్ (Prabhas) హీరోగా నటించిన ‘ఆదిపురుష్’ సినిమా ఓవర్సీస్ రైట్స్.. అన్ని రూ.కోట్లా!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!