ప్రభాస్ (Prabhas) హీరోగా నటించిన ‘ఆదిపురుష్’ సినిమా ఓవర్సీస్ రైట్స్.. అన్ని రూ.కోట్లా!

Updated on Aug 01, 2022 07:22 PM IST
ప్రభాస్ (Prabhas) హీరోగా నటించిన ఆదిపురుష్‌ సినిమా రైట్స్ రికార్డు ధరకు అమ్ముడయ్యాయని టాక్
ప్రభాస్ (Prabhas) హీరోగా నటించిన ఆదిపురుష్‌ సినిమా రైట్స్ రికార్డు ధరకు అమ్ముడయ్యాయని టాక్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) నటించిన పౌరాణిక చిత్రం ‘ఆదిపురుష్’. రామాయణాన్ని శ్రీరాముడి కోణంలో విభిన్న రీతిలో వెండితెరపై ఆవిష్కరించబోతున్నారు బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్.  తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషలతోపాటు, ప్రపంచవ్యాప్తంగా వచ్చే ఏడాది జనవరి 12న ఆదిపురుష్‌ సినిమాను థియేటర్లలో  విడుదల చేస్తున్నారు మేకర్స్.

త్రీడీలో రిలీజ్‌ చేయనున్న ఈ సినిమా షూటింగ్‌ ఇప్పటికే పూర్తికాగా.. కంప్యూటర్‌‌ గ్రాఫిక్స్ వర్క్‌తోపాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. శ్రీరాముడిగా ప్రభాస్, సీతాదేవిగా కృతి సనన్, లక్ష్మణుడిగా సన్నీ సింగ్, హనుమంతుడిగా దేవ్‌దత్త నాగే,  రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ ఈ సినిమాలో నటిస్తున్నారు. 'ఆదిపురుష్‌' సినిమాకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ప్రమోషన్ కంటెంట్ లేకున్నా..

తాజా సమాచారం ప్రకారం ప్రభాస్ (Prabhas) ‘ఆదిపురుష్’ సినిమా ఓవర్సీస్ థియేట్రికల్ రైట్స్ కోసం మేకర్స్ రూ.35 కోట్లు డిమాండ్ చేస్తున్నారట. ఈ సినిమాకి సంబంధించి ఎలాంటి ప్రమోషనల్ కంటెంట్ ఇప్పటివరకూ బయటకు రాలేదు. హీరో, హీరోయిన్ల ఫస్ట్ లుక్ పోస్టర్స్‌ను కూడా రిలీజ్ చేయలేదు మేకర్స్. అయినా 'ఆదిపురుష్‌' సినిమాకి ఆ స్థాయిలో ఓవర్సీస్ రైట్స్ ఇస్తామని ముందుకు రావడం మంచి పరిణామమనే చెప్పాలి.

ప్రభాస్‌ (Prabhas) కృతి సనన్, సైల్‌ అలీ ఖాన్

బేరసారాలు లేకుండానే..

పాన్‌ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన సినిమా కావడంతో,   థియేట్రికల్ రైట్స్‌ విషయంలో నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్స్ అడిగినంత ఇవ్వడానికి ఓకే చెప్పారని తెలుస్తోంది. ఓవర్సీస్‌లో ఒక ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ ‘ఆదిపురుష్’ థియేట్రికల్ రైట్స్‌ను సొంతం చేసుకున్నారని సమాచారం.

ప్రముఖ జపనీస్ ఫిల్మ్ మేకర్ యూగో సాకో యానిమేషన్ వెర్షన్ ‘ది ప్రిన్స్ ఆఫ్ లైట్’ ఆధారంగా ‘ఆదిపురుష్’ సినిమా తెరకెక్కిందని టాక్. 2000వ సంవత్సరంలో ఓ సినిమా స్క్రీనింగ్ కోసం విదేశాలకు వెళ్ళినప్పుడు ఓం రౌత్ ఆ యానిమేషన్ సినిమాను చూశారట. ఆ సినిమా ప్రేరణతో, దాదాపు ఇరవై సంవత్సరాల తర్వాత ‘ఆదిపురుష్’ ను తెరకెక్కించారు ఓం రౌత్. ‘ఆదిపురుష్’ సినిమా ప్రభాస్‌కు (Prabhas) ఏ స్థాయిలో పేరు తెచ్చిపెడుతుందో చూడాలి. 

Read More : ‘ప్రాజెక్ట్‌ K’ సినిమా సెట్‌ నుంచి లంబోర్గిని కారులో దూసుకెళ్లిన ప్రభాస్‌ (Prabhas).. వీడియో వైరల్‌

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!