ప్రభాస్ (Prabhas) ఆదిపురుష్‌ (Adipurush) టీజర్‌‌! న్యాయం చేతుల్లోనే అన్యాయానికి వినాశనం

Updated on Oct 06, 2022 11:52 PM IST
విజయ దశమి సందర్భంగా అయోధ్యలో ప్రభాస్ (Prabhas) నటించిన ఆదిపురుష్ (Adipurush) టీజర్‌‌ను విడుదల చేశారు మేకర్స్‌
విజయ దశమి సందర్భంగా అయోధ్యలో ప్రభాస్ (Prabhas) నటించిన ఆదిపురుష్ (Adipurush) టీజర్‌‌ను విడుదల చేశారు మేకర్స్‌

బాహుబలి సిరీస్ సినిమాలతో పాన్ ఇండియా స్టార్‌‌ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు ప్రభాస్ (Prabhas). ఇక అప్పటి నుంచి అన్నీ పాన్ ఇండియా సినిమాలే చేస్తున్నారు. ప్రభాస్ నటించిన భారీ బడ్జెట్‌ సినిమా ఆదిపురుష్ (Adipurush).  బాలీవుడ్‌ టాప్‌ దర్శకుల్లో ఒకరైన ఓం రౌత్‌ ఆదిపురుష్ సినిమాను తెరకెక్కించారు. ఆదిపురుష్ సినిమాపై సినీ ప్రేమికులకే కాకుండా టాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీల్లో కూడా ఆసక్తి నెలకొంది.

రామాయణం నేపథ్యంలో తెరకెక్కించిన ఆదిపురుష్‌ సినిమాలో ప్రభాస్‌ రాముడి పాత్రలో నటించారు. ఇటీవలే ఈ సినిమా నుంచి ప్రభాస్ ఫస్ట్‌ లుక్ విడుదలైంది. ఫస్ట్‌ లుక్‌కు భారీ స్పందనే వచ్చింది. ప్రభాస్‌తో ఆదిపురుష్ సినిమాను తెరకెక్కిస్తున్నట్టు ప్రకటించినప్పటి నుంచి ఫస్ట్‌ లుక్ విడుదల చేసే వరకు సినిమా గురించిన అన్ని విషయాలను రహస్యంగానే ఉంచింది చిత్ర యూనిట్. ఇటీవల రిలీజ్ చేసిన ఫస్ట్‌ లుక్‌పై కూడా పలువురు అసహనం వ్యక్తం చేశారు. దీంతో ఆదిపురుష్ టీజర్‌‌పైనే అందరూ ఆశలు పెట్టుకున్నారు.

విజయదశమి సందర్భంగా అయోధ్యలోని రామ్‌లీలాలో ప్రతి ఏడాది ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతాయి. ఈ సంవత్సరం జరిగే కార్యక్రమాల్లో ఆదిపురుష్‌ టీజర్‌‌ను రిలీజ్ చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించారు. ఆదివారం రాత్రి 7:11 నిమిషాలకు ఆదిపురుష్ సినిమా టీజర్ రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్‌ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. 

విజయ దశమి సందర్భంగా అయోధ్యలో ప్రభాస్ (Prabhas) నటించిన ఆదిపురుష్ (Adipurush) టీజర్‌‌ను విడుదల చేశారు మేకర్స్‌

జై శ్రీరామ్‌.. జై శ్రీరామ్‌..

రామాయణం నేపథ్యంలో తెరకెక్కిన ఆదిపురుష్‌ సినిమా టీజర్ విజువల్ వండర్‌‌లా ఉంది. ‘భూమి క్రుంగినా.. నింగి చీలినా..న్యాయం చేతుల్లోనే అన్యాయానికి సర్వనాశనం’ అని ప్రభాస్ చెప్పిన డైలాగ్‌తో టీజర్ ప్రారంభమైంది. ‘వస్తున్నా.. న్యాయం రెండు పాదాలతో పది తలల అన్యాయాన్ని అణచివేయడానికి’, ‘ఆగమనం.. అధర్మ విధ్వంసం’ అనే డైలాగులతో టీజర్ ఆసక్తిగా సాగింది. గ్రాఫిక్స్‌ కూడా ఇంట్రెస్టింగా ఉన్నాయి. రావణుడిగా సైఫ్ అలీ ఖాన్, సీతా దేవిగా కృతిసనన్ స్క్రీన్ ప్రజెన్స్ అద్భుతంగా ఉంది. నీటిలో ఆంజనేయుడి బొమ్మ గ్రాఫికల్‌ వండర్‌‌లా కనిపిస్తోంది. టీజర్ చివరిలో జై శ్రీరామ్..జై శ్రీరామ్ అంటూ వచ్చే మ్యూజిక్‌, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్ అద్భుతంగా ఉన్నాయి.

రామాయ‌ణం నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ సినిమాలో ప్రభాస్ (Prabhas) రాముడి పాత్రలో, కృతిసనన్‌ సీతగా నటించారు. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ప్రతినాయ‌కుడి పాత్ర పోషించారు. దాదాపు రూ.500 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన ఆదిపురుష్ (Adipurush) సినిమా వ‌చ్చే ఏడాది సంక్రాంతి కానుక‌గా జ‌న‌వరి 12న విడుద‌ల కానుంది.

Read More : ప్రభాస్ (Prabhas) ‘రాజా డీలక్స్’ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్! త్వరలో అధికారిక ప్రకటన వచ్చే చాన్స్

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!