ప్రభాస్ (Prabhas) ‘రాజా డీలక్స్’ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్! త్వరలో అధికారిక ప్రకటన వచ్చే చాన్స్

Updated on Sep 26, 2022 03:26 PM IST
ప్రభాస్ (Prabhas) ఆదిపురుష్ సినిమా త్వరలో విడుదల కానుంది. ప్రస్తుతం ప్రభాస్ సలార్ సినిమా షూటింగ్‌కు హాజరవుతున్నారు
ప్రభాస్ (Prabhas) ఆదిపురుష్ సినిమా త్వరలో విడుదల కానుంది. ప్రస్తుతం ప్రభాస్ సలార్ సినిమా షూటింగ్‌కు హాజరవుతున్నారు

బాహుబలి సినిమాలతో పాన్ ఇండియా స్టార్ అయ్యారు ప్రభాస్ (Prabhas). అయితే ఆ సినిమా తర్వాత ఆయన నటించిన సాహో, రాధేశ్యామ్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తాపడ్డాయి. ఈ రెండు సినిమాల ఫలితాలు ప్రభాస్‌తోపాటు ఆయన అభిమానులను కూడా నిరాశపరిచాయి. దాంతో ప్రభాస్ రేంజ్ కంబ్యాక్‌ కోసం అందరూ ఎదురుచూస్తున్నారు.

ప్రభాస్ చేతిలో ప్రస్తుతం అన్నీ పాన్ ఇండియా సినిమాలే ఉన్నాయి. ఆదిపురుష్ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తికాగా.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఆదిపురుష్ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇక, ప్రస్తుతం ప్రభాస్ సలార్ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఇవి కాకుండా ప్రాజెక్ట్‌ కె షూటింగ్‌ మొదలుకాగా, స్పిరిట్ సినిమా సెట్స్‌పైకి వెళ్లేందుకు సిద్ధంగా ఉంది. ఈ ప్రాజెక్టులతో బిజీబిజీగా ఉన్న ప్రభాస్‌.. మారుతి దర్శకత్వంలో సినిమా చేయడానికి ఇటీవలే ఓకే చెప్పారు.

ఆ సినిమాకు రాజా డీలక్స్ అనే టైటిల్‌ పరిశీలనలో ఉన్నట్టు టాక్. ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా జరిగాయని సమాచారం. ప్రీ ప్రొడక్షన్ పనులను కూడా డైరెక్టర్ మారుతి ఇప్పటికే పూర్తి చేసినట్టు తెలుస్తోంది. ప్రభాస్ ఎప్పుడు డేట్స్ ఇచ్చిన వెంటనే సినిమా షూటింగ్ మొదలుపెట్టడానికి మారుతి రెడీగా ఉన్నారని టాక్.

ప్రభాస్ (Prabhas) ఆదిపురుష్ సినిమా త్వరలో విడుదల కానుంది. ప్రస్తుతం ప్రభాస్ సలార్ సినిమా షూటింగ్‌కు హాజరవుతున్నారు

హర్రర్‌‌ కామెడీ జానర్‌‌లో..

రాజా డీలక్స్ అనే థియేటర్‌‌ చుట్టూ తిరిగే తాతమనవళ్ల కథతో ఈ సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది. హర్రర్ కామెడీ జానర్‌‌లో ఈ సినిమాను మారుతి రూపొందించనున్నారని టాక్. అయితే, ఈ సినిమా గురించిన ఆసక్తికర అప్‌డేట్‌ ప్రస్తుతం నెట్‌లో హల్‌చల్‌ చేస్తోంది. మారుతి – ప్రభాస్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న సినిమాలో కీలకపాత్ర కోసం బాలీవుడ్‌ స్టార్‌‌ను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది.

ఈ ఏడాది వచ్చిన కేజీఎఫ్‌2, షంషేరా సినిమాల్లో విలన్‌గా నటించి మెప్పించారు సంజయ్‌దత్. ఈ సినిమా కోసం చిత్ర యూనిట్ సంప్రదించగా.. సంజయ్‌దత్‌ కూడా నటించడానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే చాన్స్ ఉందని సమాచారం.  

 ప్రస్తుతం ప్రభాస్‌ నటించిన ‘ఆదిపురుష్‌’ విడుదలకు సిద్ధంగా ఉంది.  ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం రామాయణం నేపథ్యంలో తెరకెక్కింది.  వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేయనున్నట్లు మేకర్స్‌ ఇప్పటికే ప్రకటించారు.  వచ్చేనెల నుంచి ప్రభాస్ (Prabhas) హీరోగా నటించిన ఆదిపురుష్‌ సినిమా ప్రమోషన్స్‌ను మొదలుపెట్టనుందట చిత్రయూనిట్.

Read More : మోస్ట్‌ పాపులర్ తెలుగు సెలబ్రిటీగా ప్రభాస్ (Prabhas)..ఫిమేల్ సెలబ్రిటీ సమంత (Samantha):ఆర్మాక్స్‌ మీడియా సర్వే

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!