సోషల్‌ మీడియాలో లీకైన ప్రభాస్ (Prabhas) ‘సలార్’ మేకింగ్ వీడియో.. మాస్‌ లుక్‌లో పిచ్చెక్కిస్తున్న డార్లింగ్

Updated on Sep 25, 2022 10:52 AM IST
రెబల్‌స్టార్ కృష్ణంరాజు కన్నుమూసిన కారణంగా షూటింగ్‌లకు చిన్న బ్రేక్ ఇచ్చిన ప్రభాస్ (Prabhas) ప్రస్తుతం సలార్ షూటింగ్‌కు హాజరవుతున్నారు.
రెబల్‌స్టార్ కృష్ణంరాజు కన్నుమూసిన కారణంగా షూటింగ్‌లకు చిన్న బ్రేక్ ఇచ్చిన ప్రభాస్ (Prabhas) ప్రస్తుతం సలార్ షూటింగ్‌కు హాజరవుతున్నారు.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ (Prabhas) హీరోగా తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక సినిమా సలార్. కేజీఎఫ్ సిరీస్‌తో దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్న దర్శకుడు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ప్రభాస్ – ప్రశాంత్ నీల్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమాపై అభిమానులతోపాటు సినీ ప్రేమికుల్లో కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.

బాహుబలి సినిమాల సిరీస్ తర్వాత ప్రభాస్ అన్నీ పాన్ ఇండియా రేంజ్ సినిమాలే చేస్తున్నారు. బాహుబలి వంటి భారీ హిట్ తర్వాత ప్రభాస్.. సాహో, రాధేశ్యామ్ సినిమాల్లో నటించారు. అయితే ఆ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. అవి కూడా భారీ బడ్జెట్ సినిమాలే. వాటిలో ఆదిపురుష్.. పాన్ వరల్డ్ సినిమాగా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కాబోతోంది.

కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్- పాన్ ఇండియా స్టార్ ప్రభాస్  (Prabhas) కాంబినేషన్‌లో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా 'సలార్'. రెబల్ స్టార్ కృష్ణంరాజు హఠాన్మరణంతో షూటింగ్‌కు బ్రేక్ పడింది. ఇటీవలే సలార్ సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభమైంది. శరవేగంగా షూటింగ్ పూర్తి చేసి ఈ సినిమాను వచ్చే ఏడాది సెప్టెంబర్‌‌ 28వ తేదీని విడుదల చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఈ క్రమంలో చిత్ర యూనిట్‌కు షాక్ తగిలింది.

రెబల్‌స్టార్ కృష్ణంరాజు కన్నుమూసిన కారణంగా షూటింగ్‌లకు చిన్న బ్రేక్ ఇచ్చిన ప్రభాస్ (Prabhas) ప్రస్తుతం సలార్ షూటింగ్‌కు హాజరవుతున్నారు.

మాస్‌ లుక్‌కు ఫ్యాన్స్ ఫిదా..

సలార్ షూటింగ్‌ వీడియోను ఎవరో లీక్ చేశారు. సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. అయితే ఈ వీడియోలో ప్రభాస్ మాస్‌ లుక్‌లో కనిపిస్తున్నారు. ఈ వీడియోలో ప్రభాస్‌ను చూసిన ఫ్యాన్స్ మాత్రం తన అభిమాన హీరో లుక్‌ చూసి ఫిదా అవుతున్నారు. హైదరాబాద్‌లో సలార్ సినిమా షూటింగ్ జరుగుతోంది. 

సలార్ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మరో కీలకపాత్రను జగపతిబాబు పోషిస్తున్నారు. అక్టోబర్ మొదటివారం వరకు సలార్ షూటింగ్‌లో ప్రభాస్ పాల్గొంటారని తెలుస్తోంది. ఆ తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ప్రాజెక్ట్‌ కె’ సినిమా షూటింగ్‌కు ప్రభాస్ హాజరవుతారని సమాచారం. దీపికా పదుకొనె హీరోయిన్‌గా నటిస్తున్న ప్రాజెక్ట్‌ కె సినిమాలో అమితాబ్‌బచ్చన్, దిశా పటానీ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. 2024లో ఈ సినిమాను రిలీజ్ చేయడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఇక, ప్రభాస్ (Prabhas) రాముడి పాత్రలో నటించిన ఆదిపురుష్‌ సినిమా వచ్చే ఏడాది జనవరి 12వ తేదీన విడుదల కానుంది.

Read More : ప్రభాస్ (Prabhas), దళపతి విజయ్‌ సినిమాలతో పోటీకి సై అంటున్న మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!