మరికొద్ది గంటల్లో ప్రభాస్ (Prabhas) ఆదిపురుష్‌ (Adipurush) సినిమా టీజర్‌‌.. ఏర్పాట్లలో బిజీగా చిత్ర యూనిట్

Updated on Oct 06, 2022 11:54 PM IST
పాన్‌ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) నటించిన భారీ బడ్జెట్‌ సినిమా ఆదిపురుష్ (Adipurush). ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌‌  ఆకట్టుకుంటోంది
పాన్‌ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) నటించిన భారీ బడ్జెట్‌ సినిమా ఆదిపురుష్ (Adipurush). ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌‌ ఆకట్టుకుంటోంది

బాహుబలి సిరీస్ సినిమాలతో పాన్ ఇండియా స్టార్‌‌ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు ప్రభాస్ (Prabhas). ఇక అప్పటి నుంచి అన్నీ పాన్ ఇండియా సినిమాలే చేస్తున్నారు. బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన సాహో, రాధేశ్యామ్ సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద సందడి చేయలేదు. అయినా ప్రభాస్ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. బాలీవుడ్‌ టాప్‌ దర్శకుల్లో ఒకరైన ఓం రౌత్‌ ప్రభాస్‌తో ఒక భారీ బడ్జెట్‌తో ఆదిపురుష్ (Adipurush) సినిమాను తెరకెక్కించారు.

ఆదిపురుష్ సినిమాపై సినీ ప్రేమికులకే కాకుండా టాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీల్లో కూడా ఆసక్తి నెలకొంది. రామాయణం నేపథ్యంలో తెరకెక్కించిన ఈ సినిమాలో ప్రభాస్‌ రాముడి పాత్రలో నటించారు. ఇటీవలే ఈ సినిమా నుంచి ప్రభాస్ ఫస్ట్‌ లుక్ విడుదలైంది. ఈ సినిమా షూటింగ్ పూర్తై చాలా కాలం గడుస్తున్నా.. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్‌కు ఎక్కువ సమయం తీసుకుంది చిత్ర యూనిట్. విజువల్‌ వండర్‌‌గా ఆదిపురుష్‌ను తీర్చిదిద్దడం కోసమే ఆలస్యమైందని తెలుస్తోంది.

పాన్‌ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) నటించిన భారీ బడ్జెట్‌ సినిమా ఆదిపురుష్ (Adipurush). ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌‌  ఆకట్టుకుంటోంది

సన్నాహాల్లో బిజీగా..

విజయ దశమి సందర్భంగా అయోధ్యలో జరిగే రావణ దహన కార్యక్రమంలో ఆదిపురుష్ సినిమా టీజర్‌‌ను విడుదల చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించారు. అందులో భాగంగానే అయోధ్యలో సినిమా టీజర్‌‌ను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది చిత్ర యూనిట్. ఇప్పటికే చిత్ర యూనిట్ అయోధ్యకు చేరుకుందని తెలుస్తోంది. 

ఆదిపురుష్ (Adipurush) సినిమా టీజర్‌‌ను ఆదివారం రాత్రి 7:11 నిమిషాలకు విడుదల చేయనుంది చిత్ర యూనిట్‌. రామాయ‌ణం నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ సినిమాలో ప్రభాస్ (Prabhas) రాముడి పాత్రలో, కృతిసనన్‌ సీతగా నటించారు.  హీరోయిన్‌గా నటిస్తుంది. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ప్రతినాయ‌కుడి పాత్ర పోషించారు. దాదాపు రూ.500 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన ఆదిపురుష్ సినిమా వ‌చ్చే ఏడాది సంక్రాంతి కానుక‌గా జ‌న‌వరి 12న విడుద‌ల కానుంది.

Read More : సోషల్‌ మీడియాలో లీకైన ప్రభాస్ (Prabhas) ‘సలార్’ మేకింగ్ వీడియో.. మాస్‌ లుక్‌లో పిచ్చెక్కిస్తున్న డార్లింగ్

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!