ప్ర‌భాస్ (Prabhas) కోసం అన్ని భారీ సెట్లు వేయించారా!... త్వ‌ర‌లో 'ఆదిపురుష్' జాత‌ర‌!

Updated on Sep 22, 2022 05:40 PM IST
ప్ర‌భాస్ (Prabhas) 12 సెట్ల‌లో జ‌రిగే సీన్స్ చిత్రీక‌ర‌ణ కోసం హాజ‌ర‌వాల్సి ఉంది. కానీ ప్ర‌భాస్ షూటింగ్‌ల‌కు బ్రేక్ ఇచ్చారు. 
ప్ర‌భాస్ (Prabhas) 12 సెట్ల‌లో జ‌రిగే సీన్స్ చిత్రీక‌ర‌ణ కోసం హాజ‌ర‌వాల్సి ఉంది. కానీ ప్ర‌భాస్ షూటింగ్‌ల‌కు బ్రేక్ ఇచ్చారు. 

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ (Prabhas) అత్యంత భారీ బ‌డ్జెట్ సినిమాల్లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌ల ప్ర‌భాస్ పెద్ద‌నాన్న కృష్ణంరాజు మృతి చెందారు. దీంతో ప‌లు షూటింగ్‌ల‌కు బ్రేక్ ఇచ్చారు ప్ర‌భాస్. పాన్ ఇండియా సినిమాల‌లో న‌టిస్తున్న ప్ర‌భాస్ కోసం నిర్మాత‌లు భారీ సెట్లు వేయించారు. కోట్ల రూపాయ‌ల‌ను ఖ‌ర్చు చేసి ఏకంగా 12 సెట్లు వేయించారు. ప‌లు సినిమాల షూటింగ్‌ల కోసం ప్ర‌భాస్ ఈ 12 సెట్ల‌లో జ‌రిగే సీన్స్ చిత్రీక‌ర‌ణ కోసం హాజ‌ర‌వాల్సి ఉంది. కానీ ప్ర‌భాస్ షూటింగ్‌ల‌కు బ్రేక్ ఇచ్చారు. 

స్పీడ్ పెంచ‌నున్న ప్ర‌భాస్

'కేజీఎఫ్ చాప్ట‌ర్ 2' ఫేమ్ ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న 'స‌లార్' చిత్రంలో ప్ర‌భాస్ (Prabhas) న‌టిస్తున్నారు. ఈ సినిమాను హోంబ‌లే ఫిలిమ్స్ నిర్మాణ సంస్థ వంద‌ల కోట్ల రూపాయ‌ల‌తో నిర్మిస్తోంది. 'స‌లార్' చిత్రం రెండు భాగాలుగా విడుద‌ల కానుంది.

ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌ వైజ‌యంతి మూవీస్ ప‌తాకంపై 'ప్రాజెక్ట్ కె' కూడా భారీ బడ్జెట్‌తోనే తెర‌కెక్కిస్తున్నారు. ఈ సినిమా కోసం హైద‌రాబాద్‌లో భారీ సెట్లు వేయించారు. ప్ర‌భాస్ కూడా త్వ‌ర‌లో సినిమా షూటింగ్‌ల‌లో పాల్గొంటార‌ని.. అనుకున్న స‌మ‌యానికి అన్ని సినిమాలను పూర్తి చేస్తార‌ని స‌మాచారం.

ప్ర‌భాస్ (Prabhas) 12 సెట్ల‌లో జ‌రిగే సీన్స్ చిత్రీక‌ర‌ణ కోసం హాజ‌ర‌వాల్సి ఉంది. కానీ ప్ర‌భాస్ షూటింగ్‌ల‌కు బ్రేక్ ఇచ్చారు. 

'ఆదిపురుష్' జాత‌ర‌

'రాధేశ్యామ్' ఫ్లాప్ త‌రువాత  ప్రభాస్ (Prabhas) త‌న అభిమానుల కోసం వ‌రుస సినిమాల‌లో న‌టిస్తున్నారు. త‌న ఫ్యాన్స్ కోసం బ్యాక్ టూ బ్యాక్ సినిమాల‌ను రిలీజ్ చేయాల‌ని ప్ర‌భాస్ ప్లాన్ చేస్తున్నారు. ఇక 'ఆదిపురుష్' సినిమా పాన్ వ‌ర‌ల్డ్ లెవ‌ల్‌లో రిలీజ్ చేస్తార‌ని టాక్. ద‌స‌రా న‌వ‌రాత్రి ఉత్స‌వాల‌లో 'ఆదిపురుష్' నుంచి ప‌లు అప్‌డేట్స్ రిలీజ్ చేసేందుకు ద‌ర్శ‌కుడు ఓం రౌత్ ప్ర‌య‌త్నిస్తున్నారు. ఈ సినిమాలో ప్ర‌భాస్ రాముడి పాత్ర‌లో న‌టించ‌గా.. కృతి స‌న‌న్ సీత‌గా క‌నిపించ‌నుంది.   

Read More: Adipurush: 'ఆదిపురుష్' టీజ‌ర్ రిలీజ్ ఫిక్స్!.. ద‌స‌రా రోజున రావ‌ణ ద‌హ‌నం చేయ‌నున్న ప్ర‌భాస్ (Prabhas)

Advertisement
Credits: Twitter

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!