ప్రభాస్ (Prabhas) పుట్టినరోజున బిల్లా సినిమా రీరిలీజ్.. పండుగ చేసుకోనున్న పాన్‌ ఇండియా స్టార్ ఫ్యాన్స్

Updated on Aug 30, 2022 05:35 PM IST
ప్రభాస్ (Prabhas) కెరీర్‌‌లో మైలురాయిగా నిలిచిన సినిమా బిల్లా.. ఈ సినిమాలో ప్రభాస్ డబుల్‌ రోల్‌ చేశారు
ప్రభాస్ (Prabhas) కెరీర్‌‌లో మైలురాయిగా నిలిచిన సినిమా బిల్లా.. ఈ సినిమాలో ప్రభాస్ డబుల్‌ రోల్‌ చేశారు

బాహుబలి, సాహో, రాధేశ్యామ్ సినిమాలతో పాన్ ఇండియా స్టార్‌‌గా ఎదిగారు ప్రభాస్ (Prabhas). ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఉన్న సినిమాలు కూడా పాన్ ఇండియా సినిమాలే. ప్రాజెక్ట్‌ కె, సలార్, ఆదిపురుష్‌ సినిమాలు చేస్తున్నారాయన.

ప్రస్తుతం స్టార్ హీరోల పుట్టినరోజులకు, స్పెషల్ షోలకు విడదీయరాని బంధం ఏర్పడింద. ఆయా హీరోలు నటించిన ఒకప్పటి సూపర్ హిట్ చిత్రాల్ని ఇప్పటి టెక్నాలజీని ఉపయోగించి రీ రిలీజ్ చేసే ట్రెండ్ ప్రస్తుతం టాలీవుడ్‌లో మొదలైంది.

దీనికి మొట్టమొదటిసారిగా నాంది పలికిన హీరోగా సూపర్‌‌స్టార్ మహేష్‌బాబు నిలిచారు. మహేష్‌ కెరీర్‌‌ను మలుపు తిప్పిన సూపర్ హిట్ సినిమా 'పోకిరి' 4కె ప్రింట్‌ను ఆయన పుట్టినరోజు సందర్బంగా రీ రిలీజ్ చేస్తే రికార్డు స్థాయిలో కలెక్షన్స్ కొల్లగొట్టిన సంగతి తెలిసిందే. ఇక, మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా 'ఘరానామొగుడు' చిత్రాన్ని విడుదల చేస్తే  భారీ కలెక్షన్స్ వచ్చాయి.

ప్రభాస్ (Prabhas) కెరీర్‌‌లో మైలురాయిగా నిలిచిన సినిమా బిల్లా.. ఈ సినిమాలో ప్రభాస్ డబుల్‌ రోల్‌ చేశారు

లిస్ట్‌లోకి ప్రభాస్ కూడా..

సెప్టెంబర్ 2న పవర్ స్టార్ పవన్ కల్యాణ్ బర్త్ డే సందర్బంగా 'జల్సా' చిత్రాన్ని రీ రిలీజ్ చేయనున్నారు. ఆ సినిమా అడ్వాన్స్‌ బుకింగ్స్‌కు వస్తున్న క్రేజ్‌ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. పవన్‌ నటించిన'తమ్ముడు' సినిమాను రీ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

ఈ లిస్ట్ లోకి పాన్‌ ఇండియా స్టార్ ప్రభాస్ చేరనున్నారు. అక్టోబర్ 23వ తేదీన ప్రభాస్ పుట్టినరోజు.  అదే రోజున ప్రభాస్ నటించిన స్టైలిష్ యాక్షన్ చిత్రం 'బిల్లా'ను రీ రిలీజ్ చేయబోతున్నారు. మెహెర్‌‌ రమేష్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రభాస్ (Prabhas) కెరీర్‌‌కు ప్లస్ అయ్యింది. అనుష్క హీరోయిన్‌గా నటించిన బిల్లా సినిమాలో హన్సిక, నమిత ముఖ్యపాత్రలు పోషించారు.

Read More : Adipurush: 'ఆదిపురుష్‌'పైనే ప్ర‌భాస్ (Prabhas) అభిమానుల ఆశ‌లు!.. 'బాహుబ‌లి' రేంజ్‌లో హిట్ ద‌క్కేనా?.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!