Adipurush: ‘ఆదిపురుష్’ ఫస్ట్ లుక్ రిలీజ్ చేయ‌నున్న మేక‌ర్స్!.. రాముడి పాత్ర‌లో ప్ర‌భాస్ (Prabhas)

Updated on Aug 28, 2022 10:23 AM IST
Adipurush:  ప్ర‌భాస్ (Prabhas) పుట్టిన రోజు అక్టోబ‌ర్ 31న‌ 'ఆదిపురుష్' ఫ‌స్ట్ లుక్‌ను రిలీజ్ చేస్తార‌నే వార్త‌లు వినిపించాయి.
Adipurush: ప్ర‌భాస్ (Prabhas) పుట్టిన రోజు అక్టోబ‌ర్ 31న‌ 'ఆదిపురుష్' ఫ‌స్ట్ లుక్‌ను రిలీజ్ చేస్తార‌నే వార్త‌లు వినిపించాయి.

Adipurush: పాన్ ఇండియా హీరో ప్రభాస్ (Prabhas) న‌టిస్తున్న 'ఆదిపురుష్' సినిమా ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేసేందుకు మేక‌ర్స్ సిద్ధ‌మ‌య్యారు. పాన్ వ‌రల్ట్ సినిమాగా 'ఆదిపురుష్' రిలీజ్ చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. రాముడిగా ప్ర‌భాస్ ఎలా క‌నిపిస్తారో చూడాల‌ని అభిమానులు ఎప్ప‌టినుంచో ఎదురు చూస్తున్నారు. 'ఆదిపురుష్' ప్రపంచవ్యాప్తంగా వచ్చే ఏడాది జనవరి 12న  తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది. ఈ సినిమా క‌చ్చితంగా స‌క్సెస్ సాధిస్తుంద‌ని ప్ర‌భాస్ ఫ్యాన్స్ న‌మ్మ‌కం పెట్టుకున్నారు. 

రామాయణం ఆధారంగా 'ఆదిపురుష్' సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. బాలీవుడ్ బ‌డా ద‌ర్శ‌క‌, నిర్మాత ఓం రౌత్ నిర్మిస్తున్నఈ 3 డీ చిత్రంలో ప్ర‌భాస్ (Prabhas) రాముడి పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. బాలీవుడ్ బ్యూటీ కృతి స‌న‌న్ జానకి పాత్రలో ప్ర‌భాస్‌కు జోడిగా న‌టించ‌నున్నారు. రావ‌ణుడి పాత్ర‌లో సైఫ్ అలీఖాన్ న‌టిస్తున్నారు. ఇక సన్నీ సింగ్ లక్ష్మణుడిగా నటిస్తున్నారు.

Adipurush:  ప్ర‌భాస్ (Prabhas) పుట్టిన రోజు అక్టోబ‌ర్ 31న‌ 'ఆదిపురుష్' ఫ‌స్ట్ లుక్‌ను రిలీజ్ చేస్తార‌నే వార్త‌లు వినిపించాయి.

Adipurush: ఫ‌స్ట్ లుక్ రిలీజ్ ఎప్ప‌డంటే!

రెబ‌ల్ స్టార్  ప్ర‌భాస్ (Prabhas) ను రాముడి పాత్ర‌లో చూసేందుకు ప్రేక్ష‌కులు, అభిమానులు ఆతృత‌తో ఎదురుచూస్తున్నారు. 'ఆదిపురుష్' నుంచి ప్ర‌భాస్ ఫ‌స్ట్ లుక్‌ను సెప్టెంబ‌ర్ నెలాఖ‌రులోగా విడుద‌ల చేయ‌నున్నారు. ప్ర‌భాస్ పుట్టిన రోజు అక్టోబ‌ర్ 31న‌ 'ఆదిపురుష్' ఫ‌స్ట్ లుక్‌ను రిలీజ్ చేస్తార‌నే వార్త‌లు వినిపించాయి. కానీ ఇంకా ముందే ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేస్తార‌ని టాక్. 'బాహుబలి' కన్నా పదిరెట్లు VFX ఎఫెక్ట్స్ ఈ సినిమాలో చూడచ్చు. తెలుగు, హిందీ భాష‌ల్లో 'ఆదిపురుష్' చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రాన్ని త‌మిళ్, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో డ‌బ్ చేసి విడుద‌ల చేయ‌నున్నారు.

ప్ర‌భాస్ కూడా 'ఆదిపురుష్' సినిమాకు డ‌బ్బింగ్ కూడా చెప్పేశార‌ట‌. ఈ సినిమాను రూ. 500 కోట్ల బడ్జెట్‌తో టీసిరీస్, రెట్రోఫిల్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. సాచేత్ ప‌రంప‌ర సంగీతం అందిస్తున్నారు. 2023 జ‌న‌వ‌రి 12న 'ఆదిపురుష్' ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. 

Read More : ప్రభాస్ (Prabhas) హీరోగా నటించిన ‘ఆదిపురుష్’ సినిమా ఓవర్సీస్ రైట్స్.. అన్ని రూ.కోట్లా!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!