Adipurush: 'ఆదిపురుష్' టీజ‌ర్ రిలీజ్ ఫిక్స్!.. ద‌స‌రా రోజున రావ‌ణ ద‌హ‌నం చేయ‌నున్న ప్ర‌భాస్ (Prabhas)

Updated on Sep 13, 2022 01:42 PM IST
 ద‌ర్శ‌కుడు ఓం రౌత్ అన్న‌ట్లుగానే ప్ర‌భాస్ (Prabhas) న‌టిస్తున్న‌ 'ఆదిపురుష్' నుంచి ఎవ‌రూ ఊహించ‌ని విధంగా పోస్ట‌ర్, టీజ‌ర్ రిలీజ్ చేయ‌నున్నారు.
ద‌ర్శ‌కుడు ఓం రౌత్ అన్న‌ట్లుగానే ప్ర‌భాస్ (Prabhas) న‌టిస్తున్న‌ 'ఆదిపురుష్' నుంచి ఎవ‌రూ ఊహించ‌ని విధంగా పోస్ట‌ర్, టీజ‌ర్ రిలీజ్ చేయ‌నున్నారు.

Adipurush: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) న‌టిస్తున్న‌ అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం 'ఆదిపురుష్'. ఈ సినిమా అప్‌డేట్స్‌ కోసం ప్రేక్ష‌కులు, అభిమానులు ఎప్ప‌టి నుంచో ఎదురుచూస్తున్నారు. ద‌ర్శ‌కుడు ఓం రౌత్ 'ఆదిపురుష్' గురించి ఓ సందర్భంలో మాట్లాడుతూ, ఈ సినిమా సమాచారాన్ని ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా ప్రభాస్ అభిమానులకు చేరవేస్తామని ప్రామిస్ చేసారు.  అలాగే ఈ సినిమాకు సంబంధించిన పోస్ట‌ర్ తో పాటు, టీజ‌ర్ కూడా రిలీజ్ చేయ‌నున్నామని ఇటీవలే తెలిపారు. అంతేకాకుండా ద‌స‌రా న‌వ‌రాత్రి ఉత్స‌వాల సందర్భంగా 'ఆదిపురుష్' ప్ర‌మోష‌న్ల‌ను యంగ్ రెబల్ స్టార్ ప్ర‌భాస్‌తో నిర్వ‌హించ‌నున్నామని ప్రకటించారు. 

 ద‌ర్శ‌కుడు ఓం రౌత్ అన్న‌ట్లుగానే ప్ర‌భాస్ (Prabhas) న‌టిస్తున్న‌ 'ఆదిపురుష్' నుంచి ఎవ‌రూ ఊహించ‌ని విధంగా పోస్ట‌ర్, టీజ‌ర్ రిలీజ్ చేయ‌నున్నారు.

ఆదిపురుష్ ప్ర‌మోష‌న్లు షురూ

శ్రీరాముడు దసరా రోజున దశకంఠుడైన రావణుడిని హతమార్చిన సంగతి తెలిసిందే. ఢిల్లీలో ప్ర‌తీ ఏటా ద‌స‌రా న‌వ‌రాత్రి ఉత్స‌వాలు అంగ‌రంగ వైభ‌వంగా జ‌రుగుతుంటాయి. రామ్‌లీలా మైదానంలో కొన్ని లక్షలమంది చూస్తుండగా.. రావ‌ణ సంహార కార్యక్రమాన్ని జరుపుతుంటారు . ఈ ఉత్స‌వాల‌ను ల‌వ్‌కుశ రామ్‌లీలా క‌మిటీ నిర్వ‌హిస్తుంటుంది.

చిత్రమేమిటంటే,   ఢిల్లీలోని రామ్‌లీలా క‌మిటీ ఈ సంవత్సరం విజ‌య ద‌శ‌మి ఉత్స‌వాల‌కు ముఖ్య అతిథిగా సినీ నటుడు ప్ర‌భాస్ (Prabhas)ను ఆహ్వానించింది. 'ఆదిపురుష్‌' చిత్రంలో రాముడిగా న‌టించిన ప్ర‌భాస్‌తో ఈసారి రావ‌ణ సంహారం చేయించ‌డానికి కమిటీ సంకల్పించింది.  అక్టోబ‌ర్ 5వ తేదీన ద‌స‌రా కావ‌డంతో, ఆ రోజు నుండే 'ఆదిపురుష్' సినిమా ప్ర‌మోష‌న్ల‌ను కూడా మొద‌లు పెట్టాల‌ని మేక‌ర్స్ భావిస్తున్నారు.

 ద‌ర్శ‌కుడు ఓం రౌత్ అన్న‌ట్లుగానే ప్ర‌భాస్ (Prabhas) న‌టిస్తున్న‌ 'ఆదిపురుష్' నుంచి ఎవ‌రూ ఊహించ‌ని విధంగా పోస్ట‌ర్, టీజ‌ర్ రిలీజ్ చేయ‌నున్నారు.

ప్ర‌భాస్‌తో రావ‌ణ ద‌హ‌నం కార్య‌క్ర‌మం

ద‌స‌రా రోజున రావ‌ణుడు, కుంభ‌క‌ర్ణుడు, మేఘ‌నాథుడు మొదలైన వారి బొమ్మ‌లను ద‌హ‌నం చేయడం సంప్రదాయంగా వస్తుందని ఈ సందర్భంగా క‌మిటీ చైర్మ‌న్ అర్జున్ కుమార్ తెలిపారు. 'ఆదిపురుష్‌'లో ప్ర‌భాస్ రాముడి పాత్ర పోషిస్తున్నారని.. అందుకే అత‌నిని రావ‌ణ దహన కార్యక్రమంలో భాగస్వామిని చేయడానికి నిర్ణయించామని పేర్కొన్నారు . దాదాపు వంద అడుగుల‌ ఎత్తు గల బొమ్మలను ప్ర‌భాస్ త‌న వద్దనున్న బాణాల‌తో ద‌హ‌నం చేస్తార‌న్నారు. ఈ వేడుక‌ల్లో బాలీవుడ్ న‌టులు అజ‌య్ దేవ‌గ‌ణ్, జాన్ అబ్ర‌హం కూడా పాల్గొన్నారు.

టీజ‌ర్ రిలీజ్ షురూ!

ద‌స‌రా న‌వ‌రాత్రి ఉత్స‌వాల్లోని తొలి రోజున అంటే సెప్టెంబ‌ర్ 26వ తేదీన 'ఆదిపురుష్'  టీజ‌ర్ ను మేకర్స్ సోషల్ మీడియాలో రిలీజ్ చేయ‌నున్నారు. ఇక ప్ర‌భాస్ పుట్టిన‌రోజు సందర్భంగా, అనగా అక్టోబ‌ర్ 23న 'ఆదిపురుష్'కు సంబంధించిన స్పెషల్ అప్‌డేట్స్ రిలీజ్ చేసే అవకాశం ఉందని అభిమానులు భావిస్తున్నారు. అలాగే ఆ దశరథ  రాముడి ఆశీస్సుల‌తో ఈ సినిమా కచ్చితంగా బ్లాక్ బాస్ట‌ర్ హిట్ కావాల‌ని డార్లింగ్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. పలు పోస్టులు పెడుతున్నారు.

Read More: Adipurush: 'ఆదిపురుష్‌'పైనే ప్ర‌భాస్ (Prabhas) అభిమానుల ఆశ‌లు!.. 'బాహుబ‌లి' రేంజ్‌లో హిట్ ద‌క్కేనా?.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!