Project K: ప్ర‌భాస్ (Prabhas) 'ప్రాజెక్ట్ కె' త్వ‌ర‌లో సెట్స్‌పైకి వెళ్ల‌నుందా!.. మేక‌ర్స్ ఇచ్చిన హింట్ వైర‌ల్

Updated on Sep 01, 2022 01:30 PM IST
ప్రభాస్ (Prabhas) న‌టించబోయే 'ప్రాజెక్ట్ కె' కోసం ఆరి అలెక్సా అనే కొత్త టెక్నాల‌జీ క‌లిగిన‌ కెమెరా మొద‌టి సారి ఇండియాలో వాడ‌నున్నారు.
ప్రభాస్ (Prabhas) న‌టించబోయే 'ప్రాజెక్ట్ కె' కోసం ఆరి అలెక్సా అనే కొత్త టెక్నాల‌జీ క‌లిగిన‌ కెమెరా మొద‌టి సారి ఇండియాలో వాడ‌నున్నారు.

Project K: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) న‌టించబోయే 'ప్రాజెక్ట్ కె' సినిమాకు సంబంధించిన అప్‌డేట్‌ను మేక‌ర్స్ రివీల్ చేశారు. ఈ సినిమా త్వ‌ర‌లో సెట్స్‌పైకి వెళ్ల‌నుందంటూ హింట్ ఇచ్చారు. 'ప్రాజెక్ట్ కె' సినిమా స్క్రిప్ట్‌ను వినాయ‌క స్వామి ముందు ఉంచారు. త‌మ సినిమాకు గ‌ణేష్ ఆశీర్వాదం అందించాల‌ని కోరుకుంటున్నామ‌ని చిత్ర యూనిట్ సోష‌ల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. సైన్స్ ఫిక్షన్ కం ఫాంటసీ డ్రామాగా 'ప్రాజెక్ట్ కె' తెర‌కెక్క‌నుంది. 

మ‌హాభార‌తం క‌థ‌?

వినాయక చవితి సందర్భంగా 'ప్రాజ‌క్ట్ కె' సినిమాకు సంబంధించిన పోస్ట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. 'ప్రాజెక్ట్ కె' సినిమా స్క్రిప్ట్‌ను వినాయ‌కుడి ముందు పెట్టారు. మ‌హాభార‌తం ర‌చించిన వేద వ్యాసుడికి గ‌ణేష్ స‌హాయం చేశారు. అలాగే త‌మ సినిమాకు కూడా గ‌ణేష్ స‌హాయం చేయాల‌ని కోరుకుంటున్నామ‌ని మేక‌ర్స్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ఆస‌క్తిక‌రంగా మారింది. 'ప్రాజెక్ట్ కె' సినిమా టైటిల్ క‌ర్ణ అని ఫిక్స్ చేస్తార‌నే వార్త‌లు హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. మ‌హాభార‌తం నేప‌థ్యంలో ఈ సినిమా తెర‌కెక్క‌నుందా అనే అనుమానాలు ఉన్నాయి. 'ప్రాజెక్ట్ కె' సినిమాలో ఎలాంటి పాత్ర‌లో డార్లింగ్ అభిమానుల‌ను స‌ర్‌ప్రైజ్ చేయ‌నున్నారో చూడాలి. 

'ప్రాజెక్ట్ కె' (Project K) భారీ బ‌డ్జెట్ సినిమా

సైన్స్ ఫిక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో ప్రాజెక్ట్ కె సినిమాను ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ నిర్మిస్తున్నారు. నిర్మాత అశ్వ‌నీద‌త్ నిర్మాణ సంస్థ అయిన వైజయంతి మూవీస్‌ 50వ సినిమాను ప్ర‌భాస్‌తో నిర్మిస్తుంది. ప్రాజెక్ట్ కె చిత్రాన్ని రూ.500 కోట్ల భారీ బడ్జెట్‌తో సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. 

ప్రాజెక్ట్ కె సినిమాతో ప్ర‌భాస్ హాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమాను తెలుగు, హిందీ భాష‌ల్లో తెర‌కెక్కిస్తున్నారు. ప్రాజెక్ట్ కె సినిమాను త‌మిళ్, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం, ఇంగ్లీష్ భాష‌ల్లో డ‌బ్ చేయ‌నున్నారు.

ప్ర‌భాస్‌  (Prabhas) కు జోడిగా దీపికా ప‌దుకొనే న‌టిస్తున్నారు. బాలీవుడ్ బ‌డా స్టార్, బిగ్ బి అమితాబ్ బ‌చ్చ‌న్ కూడా ఈ సినిమాలో కీల‌క పాత్ర‌ను పోషిస్తున్నారు. 'ప్రాజెక్ట్ కె' కోసం ఆరి అలెక్సా అనే కొత్త టెక్నాల‌జీ క‌లిగిన‌ కెమెరా మొద‌టి సారి ఇండియాలో వాడ‌నున్నారు. ఈ చిత్రానికి మిక్కి జే మేయ‌ర్ సంగీతం అందిస్తున్నారు.  2023లో ప్రాజెక్ట్ కె రిలీజ్ కానుంది. 

Read More: ప్రభాస్ (Prabhas) హీరోగా నటిస్తున్న ‘ప్రాజెక్ట్‌ కె’ సినిమా అవెంజర్స్‌ రేంజ్‌లో ఉంటుంది: నిర్మాత అశ్వనీదత్

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!