ప్రభాస్ (Prabhas) హీరోగా నటిస్తున్న ‘ప్రాజెక్ట్‌ కె’ సినిమా అవెంజర్స్‌ రేంజ్‌లో ఉంటుంది: నిర్మాత అశ్వనీదత్

Updated on Jul 29, 2022 02:36 PM IST
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas)  నటిస్తున్న ప్రాజెక్ట్‌ కె సినిమా షూటింగ్ హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ సిటీలో శరవేగంగా జరుగుతోంది
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) నటిస్తున్న ప్రాజెక్ట్‌ కె సినిమా షూటింగ్ హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ సిటీలో శరవేగంగా జరుగుతోంది

‘బాహుబలి’ సినిమాతో పాన్‌ ఇండియా స్టార్‌ అయ్యారు ప్రభాస్‌ (Prabhas). ఆ తర్వాత ఆయన ఓకే చేస్తున్న సినిమాలన్నీ పాన్‌ ఇండియా స్థాయిలోనే తెరకెక్కుతున్నాయి. ఇదే క్రేజ్‌లో ఆయన పాన్‌ వరల్డ్‌ హీరోగా కూడా గుర్తింపు తెచ్చుకుంటారని అభిమానులు భావిస్తున్నారు.

తాజాగా ప్రభాస్ నటిస్తున్న సినిమా ‘ప్రాజెక్ట్‌ కె’. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను అశ్వనీదత్ నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ దీపికా పడుకొనె హీరోయిన్‌గా నటిస్తున్నారు. వైజయంతీ మూవీస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ప్రాజెక్ట్‌ కె సినిమాపై నిర్మాత అశ్వనీదత్ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

ప్రభాస్ నటిస్తున్న ప్రాజెక్ట్‌ కె సినిమా.. ఇండియన్ సినిమాను మరో లెవెల్‌కి తీసుకెళ్తుంది. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ప్రభాస్ (Prabhas), దీపికా పడుకొనె ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. డిసెంబర్‌‌ నెల వరకు షూటింగ్‌ పూర్తికానుంది.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas)  నటిస్తున్న ప్రాజెక్ట్‌ కె సినిమా షూటింగ్ హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ సిటీలో శరవేగంగా జరుగుతోంది

గ్రాఫిక్స్‌కే 9 నెలలు..

భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న సినిమా కావడంతో అన్ని విషయాలలోనూ జాగ్రత్తలు తీసుకుంటున్నాం. సినిమాలో గ్రాఫిక్స్‌ కోసం 9 నెలల సమయాన్ని కేటాయించాం. అవెంజర్స్‌ సినిమా రేంజ్‌లో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ‘ప్రాజెక్ట్ కె’ ఉంటుంది. 2024 అక్టోబర్‌‌లో ఈ సినిమాను విడుదల చేస్తామని అశ్వనీదత్ వెల్లడించారు. ప్రాజెక్ట్‌ కె సినిమాతో అమెరికా, చైనా మార్కెట్లను కూడా టార్గెట్ చేస్తున్నట్టు చెప్పారు.

ప్రభాస్ (Prabhas) నటించిన ఆదిపురుష్‌ సినిమా వచ్చే ఏడాది విడుదల కాబోతోంది. ఈ సినిమా కూడా పాన్ వరల్డ్ సినిమాగా రిలీజ్‌ కానున్నట్టు తెలుస్తోంది. ఆదిపురుష్ సినమాలో ప్రభాస్ రాముడిగా, కృతిసనన్ సీత క్యారెక్టర్లలో నటించారు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తికాగా.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. 

 Read More : హీరోయిన్‌ కృతిసనన్‌కు బర్త్‌డే విషెస్ చెప్పిన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas).. ఆదిపురుష్‌లో సీతగా కృతి

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!