ప్రభాస్ (Prabhas) బర్త్‌డే సందర్భంగా అభిమానులకు మాస్ ఫీస్ట్.. సలార్ (Salaar)లో డార్లింగ్ లుక్ వైరల్
హీరో ప్రభాస్ (Prabhas) ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈరోజు ప్రభాస్ పుట్టినరోజు. ఈ సందర్భంగా అభిమానులకు అదిరిపోయే అప్‌డేట్స్ ఇస్తూ ఫుల్ ఖుషీ చేస్తున్నారు నిర్మాతలు. ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న క్రేజీ సినిమాల్లో ఒకటి సలార్ (Salaar). కేజీఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.
సలార్ సినిమా నుంచి ఎప్పుడు ఏ అప్‌డేట్ వస్తుందా అని ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు వరుసగా ఫీస్ట్‌లు ఇస్తున్నారు. ఇప్పటికే ఆదిపురుష్ సినిమా నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. అలాగే మరో క్రేజీ సినిమా ప్రాజెక్ట్ కె చిత్ర యూనిట్ కూడా అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చింది.
యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా..
యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న సలార్ (Salaar) సినిమాలో ప్రభాస్ లుక్ ఇప్పటికే వైరల్ అయ్యింది. ఇక ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా సలార్ షూటింగ్ సెట్స్‌లో ప్రభాస్ ఫోటోను షేర్ చేసింది చిత్ర యూనిట్. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది. కంటెయినర్‌పై నిల్చుని మాస్ లుక్‌లో కనిపిస్తున్నారు ప్రభాస్. ఈ లుక్ సలార్ సినిమాపై క్యూరియాసిటీతోపాటు అంచనాలను కూడా పెంచేస్తోంది. శృతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో ప్రభాస్ (Prabhas) నటిస్తోన్న ప్రాజెక్ట్ కె చిత్రంలో బాలీవుడ్ స్టార్లు అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఓం రౌత్ దర్శకత్వంలో మైథాలాజికల్ ప్రాజెక్ట్ సినిమాగా తెరకెక్కిన ఆదిపురుష్ పాన్ వరల్డ్ రేంజ్‌లో విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఆదిపురుష్ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్ నెట్టింట వైరల్ అయ్యింది.
Read More : ప్రభాస్ (Prabhas) ఆదిపురుష్ (Adipurush) టీజర్! న్యాయం చేతుల్లోనే అన్యాయానికి వినాశనం