ప్రభాస్ (Prabhas) ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్.. ‘ప్రాజెక్ట్‌ కె’ సినిమా నుంచి కొత్త పోస్టర్ రిలీజ్

Updated on Oct 23, 2022 04:15 PM IST
పాన్‌ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) పుట్టినరోజు సందర్భంగా ప్రభాస్ ఫ్యాన్స్‌కు  ‘ప్రాజెక్ట్‌ కె’ సినిమా యూనిట్‌ సర్‌‌ప్రైజ్‌ ఇచ్చింది
పాన్‌ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) పుట్టినరోజు సందర్భంగా ప్రభాస్ ఫ్యాన్స్‌కు ‘ప్రాజెక్ట్‌ కె’ సినిమా యూనిట్‌ సర్‌‌ప్రైజ్‌ ఇచ్చింది

ఈశ్వర్ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు రెబల్‌స్టార్ ప్రభాస్ (Prabhas). వర్షం, ఛత్రపతి, మిస్టర్ పర్‌‌ఫెక్ట్, మిర్చి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. బాహుబలి సిరీస్ సినిమాలతో రెబల్ స్టార్ నుంచి పాన్ ఇండియా స్టార్‌‌గా ఎదిగారు ప్రభాస్. ఈ సినిమాల తర్వాత అన్నీ పాన్ ఇండియా రేంజ్ సినిమాలే చేస్తున్నారు డార్లింగ్. సాహో, రాధేశ్యామ్ సినిమాలు నిరాశపరిచినప్పటికీ ప్రభాస్ ఇమేజ్ ఏ మాత్రం తగ్గలేదు.

ప్రభాస్ ప్రస్తుతం ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్‌ కె సినిమాలు చేస్తున్నారు. ఆదివారం ప్రభాస్‌ పుట్టినరోజు. ఈ సందర్భంగా ప్రాజెక్ట్ కె సినిమా యూనిట్ ప్రభాస్ అభిమానులకు సర్‌‌ప్రైజ్ ఇచ్చింది. బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్‌‌టైనర్‌‌గా తెరకెక్కుతున్న ప్రాజెక్ట్‌ కె సినిమా నుంచి సరికొత్త అప్‌డేట్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. ప్రభాస్ బర్త్‌డే సందర్భంగా పోస్టర్‌‌ను రిలీజ్ చేసింది. ఈ పోస్టర్‌‌లో సూపర్‌‌ హీరో చేతిలాగా ఉంది ప్రభాస్‌ హ్యాండ్. ఈ పోస్టర్‌‌పై ‘హీరోలు పుట్టరు.. ఉద్భవిస్తారు’ అని రాసి ఉంది. ప్రస్తుతం ఈ పోస్టర్‌ నెట్టింట వైరల్ అవుతోంది..

పాన్‌ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) పుట్టినరోజు సందర్భంగా ప్రభాస్ ఫ్యాన్స్‌కు  ‘ప్రాజెక్ట్‌ కె’ సినిమా యూనిట్‌ సర్‌‌ప్రైజ్‌ ఇచ్చింది

భారీ బడ్జెట్‌తో..

మూడో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో సైన్స్‌ ఫిక్షన్‌ కథాంశంతో సూపర్‌హీరో మూవీగా 'ప్రాజెక్ట్‌ కె' సినిమా తెరకెక్కుతోంది. నాగ్ అశ్విన్‌  దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా భారీ బడ్జెట్‌తో రూపొందుతోంది. అమితాబ్‌ బచ్చన్‌, దీపికా పదుకోన్‌ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

ప్రాజెక్ట్‌ కె సినిమాలో 5 యాక్షన్‌ బ్లాకులు ఉన్నట్లు తెలుస్తోంది. మునుపెన్నడు చూడని భారీ దృశ్యరూప చిత్రంగా, అతిపెద్ద యాక్షన్‌ థ్రిల్లర్‌గా 'ప్రాజెక్ట్ కె' ను తెరకెక్కించే పనిలో దర్శక నిర్మాతలు ఉన్నారని సమాచారం. ప్రభాస్ (Prabhas) పుట్టినరోజు సందర్భంగా ఆదిపురుష్ సినిమా నుంచి కొత్త లుక్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్.

Read More : ప్రభాస్ (Prabhas) ఆదిపురుష్‌ (Adipurush) టీజర్‌‌! న్యాయం చేతుల్లోనే అన్యాయానికి వినాశనం

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!