ప్ర‌భాస్ (Prabhas) బ‌ర్త్‌డే స్పెష‌ల్.. 'ఆదిపురుష్' (Adipurush) కొత్త పోస్ట‌ర్ రిలీజ్‌.. 3D,ఐమాక్స్ లో విడుదల!

Updated on Oct 23, 2022 10:08 AM IST
వ‌చ్చే ఏడాది సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 12న ‘ఆదిపురుష్’ (Adipurush) సినిమా రిలీజ్ కానుంది.
వ‌చ్చే ఏడాది సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 12న ‘ఆదిపురుష్’ (Adipurush) సినిమా రిలీజ్ కానుంది.

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ బర్త్ డే (అక్టోబర్23) సందర్భంగా ప్రస్తుతం సోషల్ మీడియా మొత్తం మార్మోగిపోతోంది. ప్ర‌భాస్ (Prabhas) పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఆదివారం అభిమానుల‌ను స‌ర్‌ప్రైజ్ చేసింది 'ఆదిపురుష్' (Adipurush) చిత్ర యూనిట్‌. నేడు ‘ఆదిపురుష్’ నుంచి ప్రభాస్‌ కు సంబంధించిన మరో పోస్టర్‌ ను రిలీజ్‌ చేసింది చిత్ర బృందం. ఈ పోస్టర్‌ లో ప్రభాస్‌ రామావతారంలో ప్రభాస్ మరింత తీక్షణంగా కనిపిస్తున్నారు.

వ‌చ్చే ఏడాది సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 12న ‘ఆదిపురుష్’ (Adipurush) సినిమా రిలీజ్ కానుంది. తెలుగుతో పాటు త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా జనవరి 12న కేవలం త్రీడీ, ఐమాక్స్ థియేటర్లోనే విడుదల అవుతుందని దర్శకుడు ఓ రౌంత్ పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో ప్రభాస్ అభిమానులు నిరాశకు గురయినట్లు తెలుస్తోంది. 

ఎందుకంటే.. కేవలం 3D, ఐమాక్స్ థియేటర్లలోనే (3D, Imax Theaters) ఈ సినిమా విడుదలవుతుండడమే కారణం. ఈ క్రమంలో ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో కనీసం ఐదారువందల స్క్రీన్లలో కూడా విడుదల కాదన్న మాట. తెలంగాణ వ్యాప్తంగా అసలు త్రీడీ, ఐమాక్స్ స్క్రీన్స్ లేనేలేవు. హైద్రాబాద్‌లోనే ఐమాక్స్, త్రీడీ స్క్రీన్లున్నాయి. అంటే 'ఆదిపురుష్‌' సినిమా కేవలం హైద్రాబాద్‌లోనే విడుదలవుతుందా? అని అభిమానులు ప్రశ్నిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. 'ఆదిపురుష్' సినిమాలో సీతగా కృతిస‌న‌న్ (Krithi sanon) న‌టిస్తుండగా.. రావ‌ణుడిగా సైఫ్ అలీఖాన్ క‌నిపించ‌బోతున్నాడు. ఇక, ఈ నెల ప్రారంభంలో అయోధ్యలో ఈ సినిమా టీజ‌ర్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇందులోని విజువ‌ల్స్‌, ప్ర‌భాస్, సైఫ్ అలీఖాన్ లుక్స్‌పై చాలా విమ‌ర్శ‌లు వచ్చాయి. 

ఇక, ఈ సినిమాపై ప‌లు హిందుత్వ సంఘాల‌తో పాటు రాజ‌కీయ నాయ‌కులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ సినిమాను బ్యాన్ చేయాలంటూ పిలుపునిచ్చారు. త్రీడీలో టీజ‌ర్‌ (Adipurush 3D Teaser) విడుదల చేయడంతో ఈ విమ‌ర్శ‌ల తాకిడికి కొంత వ‌ర‌కు అడ్డుక‌ట్ట వేయగలిగింది చిత్ర యూనిట్‌. మరోవైపు ప్రభాస్ పుట్టిన రోజు ఆయన పాత సినిమాలు మళ్లీ రిలీజ్ చేస్తున్నారు. 'బిల్లా' 4k ప్రస్తుతం నెట్టింట్లో తెగ ట్రెండ్ అవుతోంది.

Read More: ప్రభాస్ (Prabhas) బర్త్ డే సందర్భంగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. 4K క్వాలిటీలో ‘బిల్లా’ (Billa Movie) రీరిలీజ్!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!