ప్ర‌భాస్‌(Prabhas), మారుతీ కాంబోలో కామెడీ, హ‌ర్ర‌ర్ సినిమా... టైటిల్ ఫిక్స్ అయిన‌ట్టేనా!

Updated on Sep 06, 2022 02:44 PM IST
ప్ర‌భాస్ (Prabhas), మారుతి కాంబోలో మ‌రో పాన్ ఇండియా సినిమా తెర‌కెక్క‌నుంది. అయితే ఈ సినిమాకు టైటిల్ యూనివర్సల్‌గా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు
ప్ర‌భాస్ (Prabhas), మారుతి కాంబోలో మ‌రో పాన్ ఇండియా సినిమా తెర‌కెక్క‌నుంది. అయితే ఈ సినిమాకు టైటిల్ యూనివర్సల్‌గా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉన్నారు. ప్ర‌భాస్ న‌టించే సినిమాల‌న్నీ పాన్ ఇండియా సినిమాలే. 'బాహుబ‌లి' త‌రువాత ప్ర‌భాస్‌కు అంత‌టి భారీ స్థాయిలో ఏ సినిమా కూడా స‌క్సెస్ ఇవ్వ‌లేదు. ప్ర‌భాస్‌కు రోజు రోజుకు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతూనే ఉంది.  'రాధేశ్యామ్' త‌రువాత ప్ర‌భాస్‌ అభిమానులు డీలా ప‌డ్డారు. ఈ క్రమంలోనే ద‌ర్శ‌కుడు మారుతి ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌భాస్ న‌టించ‌బోయే సినిమాకి టైటిల్‌ ఖరారు చేశార‌ని టాక్. ఈ వార్త‌ ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది.

మ‌రో పాన్ ఇండియా సినిమా

'ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్' సినిమాతో ద‌ర్శ‌కుడు మారుతి అనుకున్నంత స‌క్సెస్ సాధించ‌లేదు. పాన్ ఇండియా స్థార్ ప్ర‌భాస్‌తో తీసే సినిమాపైనే ఆయన ఆశ‌లు పెట్టుకున్నారు. ప్ర‌భాస్ (Prabhas), మారుతి కాంబోలో మ‌రో పాన్ ఇండియా సినిమా తెర‌కెక్క‌నుంది. అయితే ఈ సినిమాకు టైటిల్ యూనివర్సల్‌గా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ప్ర‌స్తుతం చాలా సినిమాలకు నిర్మాతలు ఇంగ్లీష్ టైటిల్స్ పెడుతున్న సంగతి తెలిసిందే.  అయితే మారుతి దర్శకత్వంలో ప్రభాస్ చేసే సినిమాకు తెలుగు టైటిల్ పెడతారో లేక ఇంగ్లీష్‌ పేరు ప్రతిపాదిస్తారో తెలియాల్సి ఉంది.   

 

ప్ర‌భాస్ (Prabhas), మారుతి కాంబోలో మ‌రో పాన్ ఇండియా సినిమా తెర‌కెక్క‌నుంది. అయితే ఈ సినిమాకు టైటిల్ యూనివర్సల్‌గా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు

టైటిల్ రాజా డీల‌క్స్?

'ఆదిపురుష్', 'స‌లార్', 'ప్రాజెక్ట్ కె', 'స్పిరిట్' .. ఇలా ఏ సినిమా ఎలాంటి హిట్ ఇస్తుందోన‌నే ఆతృత డార్లింగ్ ఫ్యాన్స్‌లో స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. ఇక ఈ లిస్ట్‌లో మారుతి సినిమా కూడా వ‌చ్చి చేరింది. ఈ చిత్రానికి ‘రాజా డీలక్స్’ (Raja Deluxe) అనే టైటిల్‌ను మారుతి ఖ‌రారు చేస్తార‌ని స‌మాచారం. కామెడీ, హారర్ ఎలిమెంట్స్‌తో ఉన్న క‌థ‌లో ప్రభాస్ (Prabhas) తొలిసారిగా న‌టిస్తున్నారు. న‌వంబ‌ర్ నుంచి మారుతి సినిమా కోసం ప్ర‌భాస్ త‌న డేట్స్ కేటాయించార‌ట‌. 

Read More: Prabhas-Maruthi: ప్రభాస్-మారుతి కాంబినేషన్ లో సినిమా వద్దంటున్న రెబల్ స్టార్ ఫ్యాన్స్.. డైరెక్టర్ పై ట్రోలింగ్

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!