Prabhas (ప్రభాస్) నటిస్తున్న హారర్ చిత్రం 'రాజా డీలక్స్' పై కొత్త అప్డేట్ ఇదే !

Updated on Aug 29, 2022 03:42 PM IST
Prabhas (ప్రభాస్), మారుతి కాంబినేషనులో ఓ హారర్ సినిమా తెరకెక్కుతోందని ఫిల్మ్ నగర్‌లో ఓ వార్త సర్క్యులేట్ అవుతోంది
Prabhas (ప్రభాస్), మారుతి కాంబినేషనులో ఓ హారర్ సినిమా తెరకెక్కుతోందని ఫిల్మ్ నగర్‌లో ఓ వార్త సర్క్యులేట్ అవుతోంది

టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌ (Prabhas) హీరోగా స్టార్ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందబోతున్న సంగతి తెలిసిందే. కొద్ది రోజుల క్రితం ఈ సినిమా పూజా కార్యక్రమాలను జరుపుకుంది. నవంబర్‌ నుంచి ఈ సినిమా సెట్స్‌మీదకు వెళ్లనున్నట్లు సమాచారం. 

తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు ప్రభాస్‌ ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తున్నాయి. ఈ సినిమా 'రాజా డీలక్స్‌'  (Raja Deluxe) అనే థియేటర్‌ బ్యాక్‌డ్రాప్‌లో సాగే తాతామనవళ్ల కథ అని ఫిలింనగర్‌లో వార్తలు వినిపిస్తున్నాయి.

హైదరాబాద్ నగరంలో షూటింగ్

ఈ చిత్రం షూటింగ్‌ కోసం ఇప్పటికే హైదరాబాద్‌లోని ఓ స్టూడియోలో థియేటర్‌ సెట్‌ను రెడీ చేస్తున్నారట చిత్రయూనిట్‌. అలాగే వీలైనంత త్వరగా రెండు షెడ్యూల్స్‌లోనే షూటింగ్‌ను పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్నారట మారుతి.

ఈ సినిమాకి హారర్ బ్యాక్ డ్రాప్‌ను మిళితం చేస్తూ, చిత్రాన్ని వినోదాత్మకంగా తెరకెక్కించనున్నట్టు వార్తలు వస్తున్నాయి. పూర్వీకుల నుండి ఒ యువకుడికి వారసత్వంగా సంక్రమించిన ఓ థియేటర్ నేపథ్యంలో ఈ కథ సాగుతుందని తెలుస్తోంది. 

మరోవైపు.. ఇప్పటికే ఈ సినిమా కోసం రూ. 6 కోట్ల రూపాయల వ్యయంతో రామోజీ ఫిలిం సిటీలో ఒక భారీ థియేటర్ సెట్ వేసారట. మారుతి ఈ సినిమా కోసం ఇప్ప‌టికే ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌ను కూడా ప్రారంభించారట. ఏ క్ష‌ణ‌మైనా ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లే ఛాన్స్ ఉంద‌ట‌. 

హారర్ సినిమాలో ప్రభాస్

కాగా, ప్రభాస్‌ (Prabhas) తొలిసారి హారర్ జోనర్‌లో నటిస్తుండడం విశేషం. కథానుగుణంగా ఈ చిత్రంలో నలుగురు కథానాయికలకు చోటు ఉండబోతున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్‌ నటుడు బొమన్‌ ఇరానీ దెయ్యం పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. అయితే, ఈ సినిమా విషయంలో ప్రభాస్‌ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని తెలుస్తోంది.

యాక్షన్‌ అంశాలతో పాటు మారుతి (Maruthi) శైలి కామెడీతో ప్రేక్షకుల్ని ఈ చిత్రం ఆకట్టుకుంటుందని ఫిల్మ్ నగర్ వర్గాలు అంటున్నాయి.

బాహుబలి తర్వాత సాహో, రాధేశ్యామ్‌ చిత్రాలతో ఆకట్టుకున్న ప్రభాస్‌  (Prabhas) ప్రస్తుతం వరుస సినిమాలను లైన్‌లో పెడుతున్నారు. బ్యాక్‌ టు బ్యాక్‌ సినిమాలను పట్టాలెక్కిస్తూ బిజీ బిజీగా గడిపేస్తున్నారు. ఇప్పటికే ప్రశాంత్‌ నీల్‌తో 'సలార్‌', ఓం రౌత్‌తో 'ఆదిపురుష్‌', సందీప్‌ వంగతో 'స్పిరిట్‌'.. ఇలా మూడు సినిమాలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన ప్రభాస్ తాజాగా మారుతి సినిమాకు కూడా ఓకే చెప్పేశాడు.

Read :  ప్రభాస్ (Prabhas) ‘ఆదిపురుష్‌’ సినిమాకి కాన్సెప్ట్‌ ఆర్ట్‌ డిజైన్ చేసిన అభిమాని.. నెట్టింట ఫోటో వైరల్ !

 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!