ప్రభాస్-మారుతి (Prabhas-Maruthi) కాంబో సినిమాపై ఆసక్తికర అప్డేట్స్.. హీరోయిన్లుగా హాట్ బ్యూటీలు?

Updated on Oct 13, 2022 01:12 PM IST
ప్రభాస్-మారుతి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మాళవిక మోహనన్ (Malavika), నిధి అగర్వాల్ (Nidhi Aggarwal), నటిస్తున్నట్లు సమాచారం.
ప్రభాస్-మారుతి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మాళవిక మోహనన్ (Malavika), నిధి అగర్వాల్ (Nidhi Aggarwal), నటిస్తున్నట్లు సమాచారం.

టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతున్నారు. భారీ యాక్షన్ ఫిల్మ్స్ అయిన ‘సలార్’,‘ప్రాజెక్ట్ కే’ చిత్రాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. వీటితో పాటు ప్రభాస్ ప్రస్తుతం రామాయణం ఇతిహాసంగా తెరకెక్కుతున్న 'ఆదిపురుష్‌'లో రాముడిగా కనిపించనున్నారు.

ఇక, ఆ తరువాత ప్రభాస్ హీరోగా మారుతి (Director Maruthi) దర్శకత్వంలో ఓ సినిమా రూపొందే అవకాశం ఉందని చాలా రోజుల నుంచి ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన అయితే ఇప్పటివరకు వెలువడలేదు. కానీ సినిమా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమా షూటింగ్ ఈ నెలలో ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రభాస్-మారుతి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మాళవిక మోహనన్ (Malavika Mohanan), నిధి అగర్వాల్ (Nidhi Aggarwal), సంజయ్ దత్ కీలక పాత్రల్లో నటిస్తున్నారని సమాచారం. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ బిగ్గీని భారీ స్థాయిలో నిర్మించనుంది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు రానున్న రోజుల్లో వెల్లడి కానున్నాయి.

కాగా, ఇప్పటికే ప్రభాస్ (Rebel star Prabhas) చేస్తున్న దాదాపు అన్ని సినిమాలకు నెగిటివ్ ఫలితాలు వస్తండడంతో ఒక రకమైన టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో మారుతి సినిమా కూడా విఫలం అయితే ప్రభాస్ కెరియర్ మీద అది మరింత ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక, ఇప్పటికే 'ఆది పురుష్' టీజర్ మీద భారీగా నెగెటివిటీ అయితే స్ప్రెడ్ అయిన సంగతి తెలిసిందే.

Read More: 'ఆదిపురుష్' టీజర్ (Adipurush Teaser) టీవీలు, మొబైల్స్‌లో చూసి ఓ అభిప్రాయానికి రావొద్దు : ప్రభాస్ (Prabhas)

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!