Prabhas: 'సలార్' (Salaar) షూటింగ్‌లో ప్రభాస్ కాలికి గాయం.. ఆందోళనలో ఫ్యాన్స్ !

Updated on Jul 29, 2022 08:34 PM IST
'సీతారామం' ప్రీరిలీజ్‌ ఈవెంట్‌కు ప్రభాస్‌ అతిథిగా రావాల్సి ఉంది. కానీ సర్జరీ వల్ల రాలేకపోయాడు అంటున్నారు నిర్మాత అశ్వనీదత్ (Ashwini Dutt).
'సీతారామం' ప్రీరిలీజ్‌ ఈవెంట్‌కు ప్రభాస్‌ అతిథిగా రావాల్సి ఉంది. కానీ సర్జరీ వల్ల రాలేకపోయాడు అంటున్నారు నిర్మాత అశ్వనీదత్ (Ashwini Dutt).

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ (Prabhas) ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రభాస్ ఇటీవలే 'రాధేశ్యామ్' సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఊహించని విధంగా బాక్సాఫీస్ వద్ద  పరాజయం పాలైంది. కాగా, ప్రభాస్ ప్రస్తుతం 'ప్రాజెక్ట్ కె', 'సలార్', 'స్పిరిట్', 'ఆది పురుష్' వంటి సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఈ సినిమాలన్నీ పాన్ ఇండియా సినిమాలే కావడం విశేషం. 

కాగా ప్రభాస్ నటిస్తున్న సినిమాలలో 'ప్రాజెక్ట్ కె' (Project k) కూడా ఒకటి. ఈ సినిమాకు యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తుండగా, అశ్వినీదత్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా గురించి గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన 'సీతారామం' ప్రీరిలీజ్‌ ఈవెంట్‌కు ప్రభాస్‌ ముఖ్య అతిథిగా రావాల్సి ఉంది. కానీ కాలి సర్జరీ కోసం విదేశంలో ఉండటంతో రాలేకపోయాడు' అని చెప్పుకొచ్చాడు. దీంతో ఒక్కసారిగా ఈ వార్తలు గుప్పుమన్నాయి. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.

అయితే.. ప్రభాస్‌కు ఈ ఏడాది మార్చిలోనే సర్జరీ జరిగినట్లు వార్తలు విచ్చిన విషయం తెలిసిందే. అలాగే 'ప్రాజెక్ట్ కె' గురించి మాట్లాడుతూ.. 'ఈ సినిమా షూటింగ్ జనవరికి పూర్తవుతుంది. తర్వాత గ్రాఫిక్స్ వర్క్ ఉంటుంది' అని అన్నారు. ఈ మూవీని 2024 అక్టోబర్ 24న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఒకవేళ అప్పటికి కుదరకపోతే.. 2025 జనవరిలో సంక్రాంతి సందర్భంగా రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది.

'బాహుబలి' (Bahubali) మూవీ ప్రపంచవ్యాప్తంగా హిట్ అయిన తరువాత.. ప్రభాస్ సినిమాలపై అభిమానులకు భారీ అంచనాలు నెలకొంటున్నాయి. దీంతో ఆ అంచనాలను అందుకునేందుకు ఈ యంగ్ రెబల్ స్టార్ కష్టపడుతున్నా.. బాక్సాఫీసు వద్ద ఫలితం మాత్రం నిరాశపరుస్తోంది. ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన 'సాహో', 'రాధే శ్యామ్' (Radheyshyam) చిత్రాలు డిజాస్టర్స్‌గా నిలవడంతో డార్లింగ్ ఫ్యాన్స్ భారీ హిట్ కోసం ఎదురుచూస్తున్నారు.

Read More: ప్ర‌భాస్ (Prabhas) సినిమాలో విల‌న్‌గా న‌టించ‌నున్న‌ 'మ‌ల‌యాళ హీరో'

Advertisement
Credits: Instagram

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!