Adipurush: ప్ర‌భాస్ (Prabhas) 'ఆదిపురుష్' రిలీజ్ అప్పుడేనంటూ ద‌ర్శ‌కుడు ఓం రౌత్ క్లారిటీ

Updated on Jul 17, 2022 10:29 PM IST
ప్ర‌భాస్ (Prabhas) 'ఆదిపురుష్' 3డీ చిత్రంగా 2023 జ‌న‌వ‌రి 12 న‌ రిలీజ్ కానుంది.
ప్ర‌భాస్ (Prabhas) 'ఆదిపురుష్' 3డీ చిత్రంగా 2023 జ‌న‌వ‌రి 12 న‌ రిలీజ్ కానుంది.

ప్ర‌భాస్ (Prabhas) న‌టిస్తున్న 'ఆదిపురుష్‌'పై భారీ అంచనాలు నెల‌కొన్నాయి. ఈ సినిమాను బాలీవుడ్ బ‌డా ద‌ర్శ‌కుడు ఓం రౌత్ తెర‌కెక్కిస్తున్నారు. 'ఆదిపురుష్' చిత్రాన్ని అనుకున్న తేదీకే రిలీజ్ చేస్తామ‌ని ఓం రౌత్ స్ప‌ష్టం చేశారు. ప్రభాస్ అభిమానుల కోసం తాను అనుకున్న తేదీకే సినిమాను రిలీజ్ చేస్తున్నానంటూ ట్వీట్ చేశారు. 2023 జ‌న‌వ‌రి 12న‌ 'ఆదిపురుష్' 3 డీ చిత్రంగా రిలీజ్ కానుంది.

రామాయణం ఆధారంగా 'ఆదిపురుష్' సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. బాలీవుడ్ బ‌డా ద‌ర్శ‌క‌, నిర్మాత ఓం రౌత్ నిర్మిస్తున్నఈ 3 డీ చిత్రంలో ప్ర‌భాస్ (Prabhas) రాముడి పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. బాలీవుడ్ బ్యూటీ కృతి స‌న‌న్ జానకి పాత్రలో ప్ర‌భాస్‌కు జోడిగా న‌టించ‌నున్నారు. రావ‌ణుడి పాత్ర‌లో సైఫ్ అలీఖాన్ న‌టిస్తున్నారు. ఇక సన్నీ సింగ్ లక్ష్మణుడిగా నటిస్తున్నారు.

 

ప్ర‌భాస్ (Prabhas) 'ఆదిపురుష్' 3 డీ చిత్రంగా 2023 జ‌న‌వ‌రి 12 న‌ రిలీజ్ కానుంది.

ఫ‌స్ట్ లుక్ రిలీజ్ ఎప్పుడంటే..

ప్ర‌భాస్ పుట్టిన రోజు అక్టోబ‌ర్ 31న‌ 'ఆదిపురుష్' ఫ‌స్ట్ లుక్‌ను రిలీజ్ చేయాల‌ని మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నారు.బాహుబలి కన్నా పదిరెట్లు VFX ఎఫెక్ట్స్ ఈ సినిమాలో చూడచ్చు. తెలుగు, హిందీ భాష‌ల్లో 'ఆదిపురుష్' చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రాన్ని త‌మిళ్, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో డ‌బ్ చేసి విడుద‌ల చేయ‌నున్నారు.

ప్ర‌భాస్ కూడా 'ఆదిపురుష్' సినిమాకు డ‌బ్బింగ్ చెప్ప‌డానికి సిద్ధ‌మ‌య్యార‌ట‌. ఈ సినిమాను రూ. 500 కోట్ల బడ్జెట్‌తో టీసిరీస్, రెట్రోఫిల్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. సాచేత్ ప‌రంప‌ర సంగీతం అందిస్తున్నారు. 2023 జ‌న‌వ‌రి 12న 'ఆదిపురుష్' ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. 'ఆదిపురుష్' చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్న ద‌ర్శ‌కుడు ఓం రౌత్ త‌న ట్విట్ట‌ర్‌లో ఈ క్రేజీ అప్‌డేట్‌ను పోస్ట్ చేశారు. 

 

 
 
లాస్ ఏంజెల్స్‌లోని ఐమ్యాక్స్ త్రీడీలో ఆదిపురుష్ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ ప‌నులు జ‌రుగుతున్నాయి. ఈ సినిమా షూటింగ్ పూర్త‌యింది. ఆదిపురుష్ విడుద‌ల కోసం నేను మీలాగానే ఎదురుచూస్తున్నాను. ప్ర‌భాస్ న‌టించిన ఆదిపురుష్ జ‌న‌వ‌రి 12న రిలీజ్ కానుంది. ప్ర‌భాస్ అభిమానుల కోసం అనుకున్న స‌మ‌యానికే ఆదిపురుష్ చిత్రాన్ని విడుద‌ల చేస్తున్నాం.
ద‌ర్శ‌కుడు ఓం రౌత్
 

ప్ర‌భాస్ (Prabhas) ఆదిపురుష్ 3 డీ చిత్రంగా 2023 జ‌న‌వ‌రి 12 న‌ రిలీజ్ కానుంది.

ప్ర‌భాస్ (Prabhas) ఫ్యాన్స్ ఖుషీ
'ఆదిపురుష్' సినిమాను ఓ విజువ‌ల్ వండ‌ర్‌గా ద‌ర్శ‌కుడు ఓం రౌత్ వెండితెర‌పై ఆవిష్కరించనున్నారు. ఈ సినిమా రిలీజ్‌కు ఇంకా ఆరు నెల‌ల టైం ఉంది. 'ఆదిపురుష్' సినిమాను 2020 ఆగ‌స్టు 18న ప్ర‌క‌టించారు. 'ఆదిపురుష్' సినిమా షూటిం‌గ్‌ను ఫిబ్రవరి 2 నుంచి ప్రారంభించారు. 2022 న‌వంబ‌ర్‌లో షూటింగ్‌ను పూర్తి చేశారు. మేక‌ర్స్ చెప్పిన‌ట్లుగా 2023 జ‌న‌వ‌రి 12 న 'ఆదిపురుష్' సినిమాని రిలీజ్ చేస్తున్నారు. ఓం రౌత్ ఇచ్చిన లేటెస్ట్ అప్‌డేట్‌తో ప్ర‌భాస్ అభిమానులు ఫుల్ జోష్‌లో ఉన్నారు.

Read More : ఇంత స్లిమ్ లుక్ ఏంటి డార్లింగ్ అంటున్న ప్ర‌భాస్ (Prabhas) ఫ్యాన్స్.. ఆదిపురుష్ టీమ్‌కు ఓం రౌత్ పార్టీ

Advertisement
Credits: Twitter

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!