"బాహుబలి రెస్టారెంట్స్" !!! బిజినెస్ రంగంలోకి ఎంట్రీ ఇస్తున్న డార్లింగ్ ప్రభాస్ (Prabhas)!
పాన్ ఇండియా హీరో ప్రభాస్ (Prabhas) అత్యంత పారితోషకం తీసుకుంటున్న హీరో. ప్రభాస్ ఒక్క సినిమాకు రూ. 100 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటారు. ప్రస్తుతం ప్రభాస్ రెమ్యూనరేషన్ మరో ఇరవై కోట్లు పెరిగిందని టాక్. అయితే హీరో ప్రభాస్ మాత్రం బిజినెస్ రంగంలోకి ఎంట్రీ ఇవ్వనున్నారట. విదేశాల్లో ఇండియన్ రుచులను అందించాలని ప్లాన్ చేస్తున్నారు డార్లింగ్.
ప్రభాస్ రెమ్యూనరేషన్ తెలిస్తే షాకే
ప్రభాస్ (Prabhas) సినిమాలకు ఇండియాలో మంచి డిమాండ్ ఉంది. విదేశాల్లోనూ ప్రభాస్ చిత్రాలు భారీ కలెక్షన్లను రాబడతాయి. ప్రపంచ వ్యాప్తంగా డార్లింగ్ సినిమాలు వేల కోట్ల రూపాయలను కొల్లగొడతాయి. అందుకనే ప్రభాస్‌కు వంద కోట్ల రూపాయలకు పైగా పారితోషకం ఇస్తున్నారు. ఇంత పెద్ద మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకుంటున్న ప్రభాస్ బిజినెస్ చేయాలనుకుంటున్నారట.
రాజు గారి విందు భోజనాలు
ప్రభాస్‌తో కలిసి సినిమాల్లో నటించే వారు ఎవరైనా సరే.. డార్లింగ్ ఇంటి భోజనం అద్భుతం అంటుంటారు. ప్రభాస్ తన ఇంటి నుంచి స్పెషల్ వంటకాలను తెప్పించి మరీ.. తోటి నటీనటులకు భోజనాలను ఏర్పాటు చేస్తారు. రాజు గారి ఇంటి బిర్యానీ, నాన్ వెజ్ వంటకాలు తిన్నవారు ఎవరైనా అద్భుతహా అనాల్సిందే.
ఈ మధ్య దిశా పటానీ, దీపికా పదుకొనే, అమితాబ్ బచ్చన్ కూడా ప్రభాస్ ఏర్పాటు చేసిన విందు భోజనాలకు ఫిదా అయ్యారు. వెజ్, నాన్ వెజ్ వంటకాలు ఎంతో రుచిగా ఉన్నాయంటూ సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టారు.
విదేశాల్లో ప్రభాస్ బిజినెస్
ప్రభాస్ (Prabhas) నటిస్తున్న సినిమాలన్నీ పాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కుతున్నవే. 'సలార్', 'ఆదిపురుష్', 'ప్రాజెక్ట్ కె' సినిమాల షూటింగ్స్ శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమాలకు ప్రభాస్ భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ అందుకుంటున్నారు. ఈ డబ్బుతో ప్రభాస్ రెస్టారెంట్లు పెట్టాలని ఫిక్స్ అయ్యారట. ఇప్పటికే కొందరు ప్రభాస్ నటించిన బాహుబలి పేరుతో ఫుడ్ బిజినెస్ చేస్తున్నారు. బాహుబలి థాలి, బాహుబలి రెస్టారెంట్లు, బాహుబలి ఫుడ్ కోర్టులతో లాభాలు పొందుతున్నారు. ఇక ఫారెన్‌లో ప్రభాస్ హోటల్స్ బాహుబలి పేరుతో ఉంటాయో.. లేక మరేదైనా పేరును పెడతారో వేచి చూడాలి.
చైనా వస్తువులకు ప్రపంచ వ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది. చైనాకు కూడా మార్కెటింగ్ ఐడియాలు బాగా తెలుసు. ప్రభాస్ చైనాలో హెటల్ బిజినెస్ చేయాలనుకుంటున్నారట. చైనాతో పాటు దుబాయ్, స్పెయిన్ దేశాల్లో తన బిజినెస్ విస్తరించాలనుకుంటున్నారు. ఇండియాలో కాకుండా విదేశాల్లో మాత్రమే ప్రభాస్ (Prabhas) బిజినెస్ చేయాలని భావిస్తున్నారట.