24 గంటలు..101 మిలియన్ వ్యూస్..! ప్రభాస్ (Prabhas) ఆదిపురుష్‌ (Adipurush) టీజర్‌‌ రికార్డు

Updated on Oct 06, 2022 03:29 PM IST
ప్రభాస్ (Prabhas) ఆదిపురుష్ సినిమా టీజర్‌‌ విడుదలైన 24 గంటల్లోనే అన్ని భాషల్లో కలిపి 101 మిలియన్‌ వ్యూస్‌తో ఇండియా నం 1 రికార్డు సాధించింది
ప్రభాస్ (Prabhas) ఆదిపురుష్ సినిమా టీజర్‌‌ విడుదలైన 24 గంటల్లోనే అన్ని భాషల్లో కలిపి 101 మిలియన్‌ వ్యూస్‌తో ఇండియా నం 1 రికార్డు సాధించింది

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా తెరకెక్కిన సినిమా ఆదిపురుష్ (Adipurush). ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపించారు. కృతిసనన్‌ సీతగా, సైఫ్ అలీ ఖాన్ రావణుడి పాత్రలు పోషించారు. బాలీవుడ్‌ స్టార్ డైరెక్టర్‌‌ ఓం రౌత్‌ ఆదిపురుష్ సినిమాను భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. సినిమా ఇండస్ట్రీలో మోస్ట్‌ అవైటెడ్‌ సినిమాగా ఆదిపురుష్‌ నిలిచింది. ఈ సినిమాను ప్రకటించినప్పటి నుంచి షూటింగ్ పూర్తి చేసి ఫస్ట్‌ లుక్‌ విడుదలయ్యే వరకు ఆదిపురుష్‌కు సంబంధించిన ఏ విషయం కూడా బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకుంది చిత్ర యూనిట్.

రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఆదిపురుష్‌ సినిమాలో ప్రభాస్ ఫస్ట్‌ లుక్‌ను ఇటీవల విడుదల చేశారు మేకర్స్. అలాగే సీత క్యారెక్టర్‌‌ చేస్తున్న కృతి సనన్, రావణుడి పాత్ర చేస్తున్న సైఫ్ అలీ ఖాన్‌ పాత్రలను కూడా రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఆదిపురుష్ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఇక, ఆ అంచనాలను భారీగా పెంచే విధంగా ప్రభాస్ ఫస్ట్‌ లుక్‌లో ప్రభాస్‌ గెటప్‌ను తీర్చిదిద్దారు దర్శకుడు ఓం రౌత్.

ప్రభాస్ (Prabhas) ఆదిపురుష్ సినిమా టీజర్‌‌ విడుదలైన 24 గంటల్లోనే అన్ని భాషల్లో కలిపి 101 మిలియన్‌ వ్యూస్‌తో ఇండియా నం 1 రికార్డు సాధించింది

పాన్ వరల్డ్ రిలీజ్..

దసరా ఉత్సవాల్లో భాగంగా రామ జన్మభూమి అయోధ్యలోని రామ్‌లీలాలో జరిగే కార్యక్రమాల్లో ఆదిపురుష్‌ టీజర్‌‌ను రిలీజ్‌ చేసింది చిత్ర యూనిట్. ఈ టీజర్‌‌కు భారీ రెస్పాన్స్ కూడా వచ్చింది. రెబల్ స్టార్ నుంచి పాన్‌ ఇండియా స్టార్‌‌గా ఎదిగిన ప్రభాస్ నటించిన ఆదిపురుష్‌ సినిమా పాన్‌ వరల్డ్‌ సినిమాగా విడుదల కాబోతోంది. ఈ మేరకు మేకర్స్‌ సన్నాహాలు చేస్తున్నారు. సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 12వ తేదీని ఆదిపురుష్ సినిమాను విడుదల చేయనున్నారు.

కాగా, ప్రభాస్ రాముడి పాత్ర పోషించిన ఆదిపురుష్ సినిమా టీజర్‌‌ నెట్టింట రికార్డులను తిరగరాస్తోంది. టీజర్‌‌ విడుదలైన 24 గంటల్లోనే 101 మిలియన్ వ్యూస్‌ను సాధించి రికార్డు సృష్టించింది. కేవలం 24 గంటల్లో 101 మిలియన్ వ్యూస్‌ సాధించి ఇండియాలోనే నంబర్‌‌ 1 టీజర్‌‌గా నిలిచింది. టీ సిరీస్, రెట్రో ఫైల్స్ బ్యానర్లపై భూషణ్‌ కుమార్, ఓ రౌత్‌ సంయుక్తంగా ఆదిపురుష్ సినిమాను నిర్మించారు. యూవీ క్రియేషన్స్ కూడా ప్రభాస్ (Prabhas) ఆదిపురుష్ (Adipurush) నిర్మాణంతో భాగస్వామిగా వ్యవహరించింది.  

Read More :ప్రభాస్ (Prabhas) ఆదిపురుష్‌ (Adipurush) టీజర్‌‌! న్యాయం చేతుల్లోనే అన్యాయానికి వినాశనం

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!