ప్రతి మనిషిలోనూ రాముడు ఉంటాడు : ఆదిపురుష్‌ (Adipurush) టీజర్ రిలీజ్‌ వేడుకలో ప్రభాస్ (Prabhas)

Updated on Oct 06, 2022 11:47 PM IST
ప్రభాస్ (Prabhas) రాముడిగా నటించిన ఆదిపురుష్ (Adipurush) సినిమా టీజర్‌‌ అయోధ్యలో ఆదివారం సాయంత్రం విడుదల చేసింది చిత్ర యూనిట్
ప్రభాస్ (Prabhas) రాముడిగా నటించిన ఆదిపురుష్ (Adipurush) సినిమా టీజర్‌‌ అయోధ్యలో ఆదివారం సాయంత్రం విడుదల చేసింది చిత్ర యూనిట్

పాన్ ఇండియా స్టార్ ప్రబాస్ (Prabhas) నటించిన సినిమా ఆదిపురుష్ (Adipurush). రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా టీజర్‌‌ను అయోధ్యలో ఆదివారం సాయంత్రం విడుదల చేశారు. పాన్ వరల్డ్‌ సినిమాగా ప్రపంచవ్యాప్తంగా వచ్చే ఏడాది జనవరి 12వ తేదీన ఆదిపురుష్ సినిమా విడుదల కాబోతోంది. ఆదిపురుష్ సినిమాలో రాముడిగా ప్రభాస్.. సీతాదేవిగా కృతిసనన్, రావణుడి పాత్రలో సైఫ్ అలీఖాన్‌ నటించారు.

ముందు భయపడ్డాను..

అయోధ్యంలో ఆదివారం రాత్రి జరిగిన కార్యక్రమంలో టీజర్‌‌ విడుదల చేసిన తర్వాత ప్రభాస్ మాట్లాడారు. ‘రాముడి క్యారెక్టర్‌‌ చేయాలని దర్శకుడు ఓం రౌత్‌ చెప్పినప్పుడు భయపడ్డాను. ముందు అంగీకరించలేదు. కొన్ని రోజుల తర్వాత దర్శకుడికి ఫోన్ చేశారు. ఎలా చేయాలి? ఏం చేస్తే రాముడిగా మెప్పించగలను? అనే విషయాలను చర్చించుకున్నాం. ఆ తర్వాత రాముడిగా నటించడానికి ఒప్పుకున్నాను’ అని చెప్పారు ప్రభాస్.

ప్రభాస్ (Prabhas) రాముడిగా నటించిన ఆదిపురుష్ (Adipurush) సినిమా టీజర్‌‌ అయోధ్యలో ఆదివారం సాయంత్రం విడుదల చేసింది చిత్ర యూనిట్

‘రాముడిపై ఉన్న భయం, భక్తి ఆదిపురుష్ సినిమాలో నటించేలా చేశాయి. ప్రతి మనిషిలోనూ రాముడు ఉంటాడు. అంకితభావం, క్రమశిక్షణ, విశ్వాసం శ్రీరాముడి ప్రవర్తన నుంచి నేర్చుకోవచ్చు. ఈ మూడు అంశాలను అనుసరించాలని ఎన్నో ఏళ్లుగా అనుకుంటున్నాం. అయితే అది మన వల్ల కావడం లేదు. అందుకే మనం మనుషులమయ్యాం. ఆయన రాముడు.. దేవుడయ్యాడు. శ్రీరాముడి కృప ఆదిపురుష్‌ (Adipurush) సినిమాపై ఉంటుందని ఆశిస్తున్నాను’ అని చెప్పుకొచ్చారు ప్రభాస్ (Prabhas).

Read More : ప్రభాస్ (Prabhas) ఆదిపురుష్‌ (Adipurush) టీజర్‌‌! న్యాయం చేతుల్లోనే అన్యాయానికి వినాశనం

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!