విజువల్ వండర్‌గా ‘హనుమాన్’ (HanuMan) టీజర్.. ‘ఆదిపురుష్’ (Adipurush) డైరెక్టర్ ఓం రౌత్‌పై నెటిజన్స్ ట్రోల్స్

Updated on Nov 22, 2022 02:06 PM IST
సీజీ విషయంలో ప్రశాంత్ వర్మ ‘హనుమాన్’ (HanuMan)ను డీల్ చేసినంత మెరుగ్గా.. ఓం రౌత్ ‘ఆదిపురుష్’ను డీల్ చేయలేకపోయారని నెటిజన్స్ అంటున్నారు
సీజీ విషయంలో ప్రశాంత్ వర్మ ‘హనుమాన్’ (HanuMan)ను డీల్ చేసినంత మెరుగ్గా.. ఓం రౌత్ ‘ఆదిపురుష్’ను డీల్ చేయలేకపోయారని నెటిజన్స్ అంటున్నారు

భారీ బడ్జెట్ సినిమాల విషయంలో ప్రతిదీ క్వాలిటీగా, అద్భతుంగా ఉండాలని ఆడియెన్స్ అనుకుంటారు. ముఖ్యంగా విజువల్ ఎఫెక్ట్స్‌తో కూడిన సినిమాల్లో ఆ భారీదనం తెరపై కనిపించాలని, తమను మరో లోకంలోకి తీసుకెళ్లేలా చేయాలని భావిస్తారు. గ్రాఫిక్స్ ప్రధానంగా తీసిన సినిమాల్లో కథతో పాటు విజువల్స్ బాగుంటే వాటిని ప్రేక్షకులు విపరీతంగా ఆదరిస్తారు. ఇప్పుడు ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకంటారా.. రెండు తెలుగు సినిమాలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి. అందులో ఒకటి ప్రభాస్ నటిస్తున్న ‘ఆదిపురుష్​’, రెండోది తేజ సజ్జా యాక్ట్ చేసిన ‘హనుమాన్’

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘ఆదిపురుష్’ (Adipurush టీజర్ ఆ మధ్య రిలీజై.. నెగెటివ్ కామెంట్స్‌ను మూటగట్టుకున్న సంగతి తెలిసిందే. ఇందులో ప్రభాస్, సైఫ్ అలీ ఖాన్ లుక్స్‌తోపాటు విజువల్ ఎఫెక్ట్స్ సీన్స్‌పై నెటిజన్స్ నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఈ టీజర్ కార్టూన్ వీడియోలా ఉందని కామెంట్లు వినిపించాయి. దీంతో చిత్ర దర్శకుడు ఓం రౌత్ అలర్ట్ అయ్యారు. విజువల్స్‌ను సరిచేసే ప్రయత్నాల్లో ఉన్నారు. దీని వల్ల వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన ‘ఆదిపురుష్’ కాస్తా జూన్ 16వ తేదీకి వాయిదా పడింది.  

ఇక, యంగ్ హీరో తేజ సజ్జా నటిస్తున్న ‘హనుమాన్’ (HanuMan) చిత్రం టీజర్ నిన్న (నవంబర్ 21) విడుదలై అందర్నీ ఆకట్టుకుంటోంది. ఈ టీజర్‌లోని గ్రాఫిక్స్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ముఖ్యంగా టీజర్ ఆఖర్లో వచ్చే సన్నివేశంలో భారీ ఆంజనేయుడ్ని చూపించిన తీరుకు నెటిజన్స్ ఫిదా అంటున్నారు. సినిమా ఎలా ఉండబోతోందనేది క్లారిటీతోపాటు విజువల్స్ కూడా ఆకట్టుకునేలా తీశారని అందరూ మెచ్చుకుంటున్నారు. 

‘హనుమాన్’ చిత్రం టీజర్.. ‘ఆదిపురుష్’ టీజర్ కంటే చాలా బాగుందని కామెంట్లు వస్తున్నాయి. రూ.500 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ప్రభాస్ మూవీ కంటే చాలా తక్కువ నిర్మాణ వ్యయంతో తీసిన తేజ సజ్జా సినిమా టీజర్ బాగుందని సోషల్ మీడియాలో నెటిజన్స్ అంటున్నారు. లో బడ్జెట్ మూవీని దర్శకుడు ప్రశాంత్ వర్మ బాగా డీల్ చేశారని, సీజీ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారని అప్లాజ్ వస్తోంది. మరోవైపు వందల కోట్లు ఖర్చు చేసినా.. ఓం రౌత్ (Om Raut) ‘ఆదిపురుష్’ గ్రాఫిక్స్ విషయంలో సరైన ఔట్‌పుట్ తెచ్చుకోవడంలో విఫలమయ్యారని విమర్శలు వస్తున్నాయి. 

ఇకపోతే, ‘హనుమాన్’ చిత్రాన్ని ఓ ఫ్రాంచైజీలా తెరకెక్కిస్తున్నారు ప్రశాంత్ వర్మ (Prashanth Varma). ఈ మూవీని పాన్ వరల్డ్ లెవల్లో విడుదల చేయడానికి ఆయన ప్లాన్ చేస్తున్నారు. ఇందులో అమృతా అయ్యర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఓ విలువైన మణి కోసం సాగే పోరాటం నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. అబ్బురపరిచే విజువల్స్‌తో ఉన్న ఈ టీజర్ సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెంచేసింది. మరి, సినిమా ఏ స్థాయిలో విజయాన్ని అందుకుంటుందో చూడాలి. 

Read more: Kangana Ranaut: ‘చంద్రముఖి 2’లో బాలీవుడ్‌ క్వీన్‌!.. రాఘవ లారెన్స్ మూవీలో స్పెషల్ రోల్‌లో కంగనా రనౌత్‌?

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!