HanuMan Teaser: విజువల్ వండర్‌గా ‘హనుమాన్’ సినిమా టీజర్.. అంచనాలు పెంచేస్తున్న డైరెక్టర్ ప్రశాంత్ వర్మ 

Updated on Nov 21, 2022 03:40 PM IST
ఆంజనేయుడి భారీ విగ్రహాన్ని ‘హనుమాన్’ (HanuMan) చిత్రం టీజర్ ఆఖర్లో చూపించిన తీరు.. ఆడియెన్స్‌ను అబ్బురపరిచేలా ఉంది
ఆంజనేయుడి భారీ విగ్రహాన్ని ‘హనుమాన్’ (HanuMan) చిత్రం టీజర్ ఆఖర్లో చూపించిన తీరు.. ఆడియెన్స్‌ను అబ్బురపరిచేలా ఉంది

‘జాంబి రెడ్డి’ తర్వాత యువ నటుడు తేజ సజ్జా (Teja Sajja), దర్శకుడు ప్రశాంత్ వర్మ కాంబినేషన్‌లో వస్తున్న రెండో చిత్రం ‘హనుమాన్’ (HanuMan). అమృతా అయ్యర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీలో ప్రముఖ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ కీలకపాత్ర పోషిస్తున్నారు. విభిన్నమైన కథాంశంతో సూపర్ హీరో చిత్రంగా ఇది తెరకెక్కుతోంది. తాజాగా ఈ మూవీ టీజర్‌ను మూవీ యూనిట్ విడుదల చేసింది. 

ఒక విలువైన మణి కోసం సాగే పోరాటం నేపథ్యంలో ‘హనుమాన్’ చిత్రం తెరకెక్కుతున్నట్లు టీజర్ చూస్తే అర్థమవుతోంది. ఈ వీడియోలో విజువల్స్ ఒక రేంజ్‌లో ఉన్నాయి. అందరూ చిన్న చిత్రం అని అనుకుంటున్నప్పటికీ.. విజువల్స్‌తో ప్రశాంత్ వర్మ అందరినీ మెస్మరైజ్ చేశారు. ముఖ్యంగా హనుమాన్ భారీ విగ్రహాన్ని టీజర్ ఆఖర్లో చూపించిన తీరు.. ఆడియెన్స్‌ను అబ్బురపరిచేలా ఉంది. ఫైట్స్ కూడా స్పెషల్ అట్రాక్షన్‌గా ఉన్నాయి.

‘హనుమాన్’ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో పలు భాషల్లో విడుదల చేయనున్నామని దర్శకుడు ప్రశాంత్ వర్మ తెలిపారు. ‘హనుమాన్‌ను మించిన సూపర్ హీరో లేరు. ఈ సినిమా కోసం ఓ సరికొత్త ప్రపంచాన్ని సృష్టిస్తున్నాం. ఇందులో ఎన్నో పాత్రలు ఉంటాయి. దీని నేపథ్యంలోనే ‘అధీర’ అనే చిత్రాన్ని ఇప్పటికే ప్రకటించాం. ‘హనుమాన్’ రిలీజైన తర్వాత ఆ మూవీని తెరకెక్కిస్తా. అలాగే ఈ సినిమాటిక్ యూనివర్స్‌లోనే ఒక విమెన్ సెంట్రిక్ ఫిల్మ్‌ను కూడా తీయడానికి ప్లాన్ చేస్తున్నా. భారతీయ పురాణాలు, ఇతిహాసాల్లోని కొన్ని పాత్రల స్ఫూర్తితో ఈ సినిమాల కథలను సిద్ధం చేసుకుంటున్నా. నా గత చిత్రాల కంటే ఈ మూవీ చాలా బాగుంటుంది’ అని ప్రశాంత్ వర్మ పేర్కొన్నారు. 

హనుమాన్‌ను మించిన సూపర్ హీరో ఎవరూ లేరని హీరో తేజ సజ్జా అన్నారు. ‘సూపర్ హీరోలు అనగానే స్పైడర్‌మన్, బ్యాట్‌మన్ అనుకుంటారు. ఆ సూపర్ హీరోలు ఫిక్షనేమో! కానీ మన సూపర్ హీరో హనుమాన్ ఉండేవారనేది మాత్రం సత్యం. ఇది మన చరిత్ర. అంత గొప్ప ఆంజనేయుడి అనుగ్రహంతో ఒక కుర్రాడికి సూపర పవర్స్ వస్తే ఏం చేస్తాడనేదే మా ‘హనుమాన్’ చిత్ర కథ. ఈ సినిమాలో నాకు అవకాశం ఇచ్చిన ప్రశాంత్ వర్మకు కృతజ్ఞతలు’ అని తేజ సజ్జా చెప్పుకొచ్చారు.  

Read more: Chiranjeevi: చిరంజీవికి ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ 2022 అవార్డు

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!