Kangana Ranaut: ‘చంద్రముఖి 2’లో బాలీవుడ్‌ క్వీన్‌!.. రాఘవ లారెన్స్ మూవీలో స్పెషల్ రోల్‌లో కంగనా రనౌత్‌?

Updated on Nov 22, 2022 12:08 PM IST
హారర్, థ్రిల్లర్ జానర్‌లో రూపొందుతున్న ‘చంద్రముఖి 2’ (Chandramukhi 2) షూటింగ్ ఇప్పటికే మైసూర్‌లో ఓ షెడ్యూల్ పూర్తి చేసుకుంది
హారర్, థ్రిల్లర్ జానర్‌లో రూపొందుతున్న ‘చంద్రముఖి 2’ (Chandramukhi 2) షూటింగ్ ఇప్పటికే మైసూర్‌లో ఓ షెడ్యూల్ పూర్తి చేసుకుంది

బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ (Kangana Ranaut)కు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. విభిన్నమైన సినిమాల్లో నటిస్తూ మంచి గుర్తింపును సంపాదించారు కంగనా. ‘ఫ్యాషన్’, ‘క్వీన్’, ‘తను వెడ్స్ మను’, ‘మణికర్ణిక’ లాంటి చిత్రాలతో తనలోని నటనా పటిమ ఎలాంటిదో చూపించారు. వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తూ ఆడియెన్స్‌లో స్పెషల్ ఇమేజ్ తెచ్చుకున్న ఈ కంగన.. ఉత్తమ నటిగా మూడు జాతీయ అవార్డులు అందుకుని వహ్వా అనిపించారు. అందుకే ఆమె నుంచి సినిమా వస్తోందంటే ప్రేక్షకులతోపాటు విమర్శకులు కూడా ఆతృతగా ఎదురు చూస్తుంటారు. ఇప్పుడు ఓ ప్రత్యేక పాత్ర కంగనాను వరించిందని తెలుస్తోంది. 

సౌత్ సూపర్‌స్టార్ రజినీకాంత్ కథానాయకుడిగా నటించిన ‘చంద్రముఖి’ చిత్రం ఎంతటి బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిందో తెలిసిందే. తాజాగా ఈ మూవీకి సీక్వెల్ రూపొందుతోంది. లారెన్స్ హీరోగా యాక్ట్ చేస్తున్న ఈ సినిమాకు ‘చంద్రముఖి’ చిత్ర దర్శకుడు పి.వాసునే తెరకెక్కిస్తున్నారు. దీనికి ఎంఎం కీరవాణి బాణీలు సమకూర్చుతున్నారు. లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ మూవీలో సీనియర్ నటులు రాధిక, వడివేలు, రవిమరియ, మనోబాల తదితరులు నటిస్తున్నారు. 

‘చంద్రముఖి 2’ (Chandramukhi 2) చిత్రంలో ముఖ్యపాత్రను కంగన పోషించనున్నట్లు సమాచారం

‘చంద్రముఖి 2’ (Chandramukhi 2) చిత్రంలో ముఖ్యపాత్రను కంగన పోషించనున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుందని తెలుస్తోంది. హారర్, థ్రిల్లర్ జానర్‌లో రూపొందుతున్న ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే మైసూర్‌లో ఓ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. అక్కడ లారెన్స్, రాధిక మీద కీలక సన్నివేశాలను షూట్ చేశారు. తాజాగా హైదరాబాద్‌లో ఈ సినిమా చిత్రీకరణను జరుపుకుంటోంది.

కాగా, కంగన 2008లో ‘ధూమ్ ధామ్’ సినిమాతో కోలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత బాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా ఎదిగారు. చాలా గ్యాప్ తర్వాత ఇటీవల విడుదలైన ‘తలైవి’తో తమిళంలో రీఎంట్రీ ఇచ్చిన ఆమె.. ‘చంద్రముఖి 2’లో ఎలాంటి పాత్రలో యాక్ట్ చేయనున్నారనేది ఆసక్తిగా మారింది. 

Read more: పెరుగుతున్న ఇమేజ్‌తో ఛేంజ్ అయిన టాలీవుడ్‌ (Tollywood) స్టార్‌‌ హీరోల టైటిల్స్‌

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!