‘ఆదిపురుష్‌’ (Adipurush) మూవీలో నటించడం నాకు గర్వకారణం.. హీరోయిన్ కృతీ సనన్‌ (Kriti Sanon) ఆసక్తికర కామెంట్స్‌

Updated on Nov 18, 2022 06:15 PM IST
‘ఆదిపురుష్’ (Adipurush) చిత్రాన్ని చాలా గ్రాండ్‌ విజువల్స్‌తో మేకర్స్ సిద్ధం చేస్తున్నారని హీరోయిన్ కృతీ సనన్ (Kriti Sanon) తెలిపారు
‘ఆదిపురుష్’ (Adipurush) చిత్రాన్ని చాలా గ్రాండ్‌ విజువల్స్‌తో మేకర్స్ సిద్ధం చేస్తున్నారని హీరోయిన్ కృతీ సనన్ (Kriti Sanon) తెలిపారు

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) నటిస్తున్న కొత్త చిత్రం ‘ఆదిపురుష్’ (Adipurush). ప్రముఖ దర్శక నిర్మాత ఓం రౌత్ ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. రామాయణం ఇతివృత్తంగా రూపుదిద్దుతున్న ఈ సినిమాలో కృతీ సనన్ (Kriti Sanon)  హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం టీజర్ డార్లింగ్ అభిమానులతోపాటు సినీ ప్రియుల్ని కూడా నిరాశకు గురి చేసింది. టీజర్‌కు వచ్చిన నెగెటివ్ రెస్పాన్స్ చూసిన మేకర్స్.. రీ షూట్‌కు ప్లాన్ చేశారని, అందువల్ల సినిమా వాయిదా పడిందని సమాచారం. దీనిపై కృతీ సనన్ స్పందించారు. ‘ఆదిపురుష్’పై ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ చిత్రం తనకు చాలా గర్వకారణమని కృతి తెలిపారు. 

ఆదిపురుష్ సినిమా విషయంలో నేను మాత్రమే కాదు మా టీమ్‌ అందరం కూడా ఎంతో గర్వంగా ఉన్నాం. కొంతమంది ఈ చిత్రాన్ని ట్రోల్‌ చేస్తున్నారు. కేవలం 1.35 నిమిషాల టీజర్‌ను చూసి సినిమా మొత్తాన్ని అంచనా వేయకూడదు. ఇది సరికాదు. మన పురాణాలు, చరిత్రకు సంబంధించిన కథలను ప్రపంచానికి తెలియజేయడానికి ఇదో అద్భుతమైన అవకాశమని మేం భావిస్తున్నాం. ఈ మూవీని చాలా గ్రాండ్‌ విజువల్స్‌తో మేకర్స్ సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం ఇంకా మెరుగ్గా చూపించడానికి వర్క్‌ జరుగుతోంది’ అని కృతీ సనన్‌ చెప్పుకొచ్చారు. 

మన పురాణాలు, చరిత్రకు సంబంధించిన కథలను ప్రపంచానికి తెలియజేయడానికి ఇదో అద్భుతమైన అవకాశమని కృతీ సనన్ (Kriti Sanon) అన్నారు

ఇకపోతే, ‘ఆదిపురుష్’ చిత్రంలో ప్రభాస్ రాముడిగా, కృతీ సనన్ సీతగా నటిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ ప్రముఖ నటుడు సైఫ్ అలీ ఖాన్ రావణుడి పాత్రను పోషిస్తున్నారు. దేవదత్త నాగె, సన్నీ సింగ్ కీలక రోల్స్‌లో యాక్ట్ చేస్తున్నారు. ఈ మూవీని 3డీ ఫార్మాట్‌లోనూ విడుదల చేయనున్నారు. 

కాగా, ‘ఆదిపురుష్‌’ బడ్జెట్‌ దాదాపుగా రూ.500 కోట్లని సమాచారం. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తయ్యింది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేయాలని అనుకున్నారు. అయితే గ్రాఫిక్స్‌పై విమర్శలు వచ్చిన నేపథ్యంలో మూవీ రిలీజ్ డేట్ విషయంలో మార్పులు చేసింది చిత్ర యూనిట్. 2023, జూన్‌ 16వ తేదీన ‘ఆదిపురుష్’ను విడుదల చేయనున్నట్టు దర్శకుడు ఓం రౌత్ అధికారికంగా ప్రకటించారు.

Read more: మేం అప్పట్లో అద్దె ఇంట్లో ఉండేవాళ్లం.. రెంట్ కట్టలేక రెండు నెలలకో ఇల్లు మారేవాళ్లం: రష్మిక (Rashmika Mandanna)

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!