HanuMan: ‘హనుమాన్’ కోసం మైండ్‌బ్లోయింగ్‌గా అండర్‌ వాటర్‌ షాట్స్‌.. సోషల్ మీడియాలో వైర​ల్ అవుతున్న ఫొటోలు

Updated on Dec 20, 2022 06:54 PM IST
యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న ‘హనుమాన్’ (HanuMan) సినిమా టీజర్ ఇటీవల విడుదలై ఊహించని రీతిలో భారీ రెస్పాన్స్‌ను అందుకుంది 
యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న ‘హనుమాన్’ (HanuMan) సినిమా టీజర్ ఇటీవల విడుదలై ఊహించని రీతిలో భారీ రెస్పాన్స్‌ను అందుకుంది 

తెలుగు చిత్ర పరిశ్రమ వరుస హిట్లతో దూసుకెళ్తోంది. ఈ ఏడాది విడుదలైన ‘ఆర్ఆర్ఆర్’, ‘మేజర్’, ‘కార్తికేయ 2’ చిత్రాలు పాన్ ఇండియా హిట్స్‌గా నిలిచాయి. విజయాలు సాధించిన లిస్టులో మరిన్ని సినిమాలు ఉన్నప్పటికీ ‘మేజర్’, ‘కార్తికేయ’ లాంటి మూవీస్ దేశవ్యాప్తంగా మంచి గుర్తింపుతోపాటు వసూళ్లనూ సొంతం చేసుకోవడం విశేషమనే చెప్పాలి. తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాల సక్సెస్‌తో మరిన్ని తెలుగు చిత్రాలు పాన్ ఇండియన్ ఆడియెన్స్‌ను టార్గెట్ చేసుకుని రూపొందుతున్నాయి. 

లిమిటెడ్ బడ్జెట్‌లో తెరకెక్కుతూ భారీ బజ్ తెచ్చుకుంటున్న చిన్న చిత్రాల్లో ‘హనుమాన్’ (HanuMan) ఒకటి. తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రతిభ కలిగిన యువ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న ప్రశాంత్ వర్మ (Prashanth Varma) ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. ‘అ!’, ‘కల్కి’, ‘జాంబీరెడ్డి’ లాంటి డిఫరెంట్ మూవీస్ తీసి సక్సెస్‌తోపాటు విమర్శకుల ప్రశంసలు అందుకున్న ప్రశాంత్ వర్మ తీస్తున్న ‘హనుమాన్’ టీజర్ ఇటీవల విడుదలై ఊహించని రీతిలో భారీ రెస్పాన్స్‌ను అందుకుంది. టీజర్‌లోని ప్రతి ఫ్రేమ్ చాలా ఆకర్షణీయంగా ఉండటంతో పాటు చివర్లో భారీ ఆంజనేయుడ్ని చూపించిన తీరుకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. 

 యువ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న ప్రశాంత్ వర్మ (Prashanth Varma) ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు

టీజర్‌కు వచ్చిన రెస్పాన్స్‌తో సూపర్ హ్యాపీగా ఉన్న ‘హనుమాన్’ మూవీ టీమ్.. చిత్రీకరణను మరింత వేగవంతం చేసింది. సినిమాలో కీలకమైన వాటర్ సీక్వెన్స్ షాట్స్‌ను ముంబైలోని ఓ స్పెషల్ సెట్స్‌లో పూర్తి చేశారని తెలిసింది. దీనికి సంబంధించిన స్టిల్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. పాపులర్‌ టెక్నీషియన్స్ పర్యవేక్షణలో షూట్ చేసిన ఈ సీన్లు ఆడియెన్స్‌కు సరికొత్త అనుభూతిని కలిగించేలా ఉండబోతున్నాయట. ఇవి మూవీలో హైలెట్‌గా నిలుస్తాయని సమాచారం. 

ఇక తేజ సజ్జ (Teja Sajja) ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘హనుమాన్‌’ సినిమాను ప్రైమ్ షో ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై నిరంజ‌న్ రెడ్డి నిర్మిస్తున్నారు. శ్రీమతి చైతన్య సమర్పణలో తెరకెక్కుతున్న ఈ మూవీకి గౌరహరి - అనుదీప్‌ దేవ్‌, కృష్ణ సౌరభ్‌ సంగీతం అందిస్తున్నారు. అస్రిన్‌ రెడ్డి, వెంకట్‌ కుమార్ జెట్టీ, కుశాల్‌ రెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఫిక్షనల్‌ నేప‌థ్యంలో వస్తున్న ‘హనుమాన్’ చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీతోపాటు పలు ఇతర భాషల్లోనూ రిలీజ్ చేయనున్నారు.  

Read more: Bigg Boss Season 7: బిగ్‌బాస్ నెక్స్ట్ సీజన్‌కు కొత్త హోస్ట్!.. నాగ్ స్థానంలో బాలయ్య వస్తున్నారనడంలో నిజమెంత? 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!